బావమరిది చేతిలో రౌడీషీటర్‌ హత్య! | Rowdy Sheeter Murdered in West Godavari | Sakshi
Sakshi News home page

బావమరిది చేతిలో రౌడీషీటర్‌ హత్య!

Published Sun, Aug 18 2019 11:39 AM | Last Updated on Sun, Aug 18 2019 12:02 PM

Rowdy Sheeter Murdered in West Godavari - Sakshi

సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. బావమరిది చేతిలోనే హతమయ్యాడు. పెదవేగి మండలం భోగాపురం సమీపం ప్రకాష్‌నగర్‌లో రౌడీషీటర్ హనీష్‌ హత్య తీవ్ర కలకలం రేపింది. రామచంద్రపురానికి చెందిన వర్ధనపు హనీష్ నిన్న ఉదయం మేనత్త గ్రామమైన ప్రకాష్‌నగర్‌కు వచ్చాడు. మేనత్త సుజాతకుమారితో ఘర్షణకు దిగిన హనీష్‌ ఆమెపై దాడి చేసి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చిన హనీష్‌తో సుజాతకుమారి కొడుకు ప్రశాంత్.. నా తల్లిపైనే దాడి చేస్తావా అంటూ ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఇనుప రాడ్డుతో తలపై మోదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హనీష్ అక్కడిక్కడే మృతి చెందాడు. నిందితుడు ప్రశాంత్‌ను ఏలూరు రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement