
'వాళ్లందరినీ చంపేయండి..'
ప్రియురాలి కుటుంబ సభ్యులందరినీ చంపేయాలని లేఖ రాసి.. బేగంపేటకు చెందిన ఒక రౌడీ షీటర్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్: ప్రియురాలి కుటుంబ సభ్యులందరినీ చంపేయాలని లేఖ రాసి.. బేగంపేటకు చెందిన ఒక రౌడీ షీటర్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏడాది టీ కొట్టు యజమానితో గొడవపెట్టుకుని పట్టపగలే అతడిని చంపేసిన కేసులో షోయబ్ ముద్దాయి.
ప్రేమ వ్యవహారంలో ఫెయిలై ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు అతని వద్ద కుటుంబసభ్యులు ఒక లేఖను స్వాధీనం చేసుకున్నారు. ప్రియురాలి కుటుంబసభ్యులందరినీ చంపేయాలని అందులో కోరాడు.