'నాముందే తలెత్తుకు వెళతావా' | Rowdy Sheeter attacked and injured Young men | Sakshi
Sakshi News home page

'నాముందే తలెత్తుకు వెళతావా'

Published Thu, Jan 7 2016 6:22 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

Rowdy Sheeter  attacked and injured Young men

తను రోడ్డుపై నిల్చుని ఉన్న విషయం తెలిసి కూడా బైక్ ఆపకుండా వెళ్లాడంటూ ఓ యువకుడి చితకబాదాడో రౌడీ షీటర్. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌కట్టా చాచా గ్యారేజీ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ సయ్యద్ కరీం (26) బుధవారం రాత్రి సాలెం చౌక్ వద్ద యాక్టివా ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముక్తార్ అహ్మద్ (25)ను అడ్డుకున్నాడు. 'నా ముందే తలెత్తుకుని వెళతావా.. ఎంత ధైర్యం ?' అంటూ ఆగ్రహించాడు.

తాను రోడ్డుపై నిల్చున్న విషయం తెలిసీ ఆపకుండా వెళ్లినందుకు వాగ్వాదానికి దిగాడు. మాటా మాటా పెరిగి ముక్తార్ అహ్మద్ ను కొట్టాడు. అడ్డు వచ్చిన ముక్తార్ స్నేహితుడు మహ్మద్ ముజఫర్ (24)పై సైతం దాడికి పాల్పడ్డాడు. గాయాలపాలైన ముక్తార్, ముజఫర్‌లను ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితులు భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రౌడీ షీటర్ సయ్యద్ కరీం ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement