Atiq Ahmed's Henchman Guddu Muslim Last Located In Odisha, Chhattisgarh - Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ సన్నిహితుడు గుడ్డూ ముస్లిం ఎక్కడున్నాడు?

Published Wed, Apr 26 2023 2:11 AM | Last Updated on Wed, Apr 26 2023 12:05 PM

- - Sakshi

భువనేశ్వర్‌: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ నాయకుడుగా ఎదిగి, హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌కు సన్నిహితుడు, కరుడుగట్టిన నేరస్తుడు గుడ్డూ ముస్లిం 12రోజులుగా రాష్ట్రంలో తల దాచుకున్నట్లు ప్రసారమైన వార్త తీవ్ర కలకలం రేపుతోంది. ఉమేష్‌పాల్‌ హత్య కేసులో నిందితుడైన గుడ్డూ ముస్లింను ఉత్తరప్రదేశ్‌ పోలీసుల గాలింపు కొనసాగుతోంది. అదృశ్యమైన నిందితుడి ఆచూకీ చివరి ప్రదేశం రాష్ట్రంలో బర్‌గడ్‌గా ఖరారైనట్లు వార్తలు ప్రసారం అవుతున్నాయి. హత్యకు గురైన డాన్‌ అతీక్‌ అహ్మద్‌ అనుచరుడు గుడ్డూ ముస్లిం ఇటీవల కాలంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో తారస పడింది.

తాజాగా బర్‌గడ్‌లో ఉన్నట్లు రాష్ట్రేతర పోలీసు వర్గాల సమాచారం. గుడ్డూ ముస్లిం ఈనెల 2 నుంచి 13వ వరకు ఒడిశాలో ఉన్నాడని పోలీసులను ఉటంకిస్తూ ఒక ప్రముఖ జాతీయ వార్తా సంస్థ సమాచారం. దాదాపు 12 రోజుల పాటు రాష్ట్రంలో తలదాచుకున్న అతడు తన దుస్తులతో కూడిన బ్యాగ్‌ని వదిలి పారిపోయాడని ఈ సమాచారంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో గుడ్డూ ముస్లిం సహాయకుడు రాజా ఖాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసులకు దొరికిపోకుండా ఉండేందుకు గడ్డం పెంచుకున్నాడని విచారణలో వెల్లడైనట్లు ఈ సమాచారం తెలిపింది.

పూరీ కటకక..
గుడ్డూ ముస్లిం మీరట్‌, అజ్మీర్‌, ఝాన్సీ, నాసిక్‌, పూణే, ప్రస్తుతం ఒడిశాలో బర్‌గడ్‌ వంటి ప్రాంతాలకు ప్రయాణించినట్లు బలమైన ఆధారాలు ఉన్నా యి. ప్రస్తుతం అతడు ఛత్తీస్‌గఢ్‌కు పారిపోయాడని పోలీసులు తెలిపారు. అంతకుముందు, అతని చివరి మజిలీ కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించారు. ఉమేష్‌పాల్‌ హత్య కేసులో నిందితులుగా ఉన్న 10 మందిలో గుడ్డూ ముస్లిం ఒకడు. వీరిలో అతీక్‌ అహ్మద్‌తో మరో 5 మంది చంపబడ్డారు. గుడ్డూ ముస్లిం ఇప్పటి వరకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ ఆట పట్టిస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్‌–రాజకీయ నాయకుడు అతీక్‌ అహ్మద్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదల చేసిన నుంచి గుడ్డూ ముస్లిం ఆయన అనుచరునిగా పని చేస్తున్నాడు. గుడ్డూ ముస్లిం పేరుగాంచిన బాంబ్‌ స్పెషలిస్ట్‌గా పోలీసుల రికార్డుల్లో చోటు చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉమేష్‌పాల్‌ను పట్ట పగలు హత్య చేసిన వీడియోలో మోటారు సైకిల్‌పై వెనుక కూర్చుని అవలీలగా నాటు బాంబులు రువ్వుతున్నట్లు రికార్డు అయింది. ఈ వీడియో రికార్డింగు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో అతని పేరు నమోదు చేశారు.

ఎస్‌టీఎఫ్‌ ఏర్పాటు..
ఐదుగురు సభ్యులతో కూడిన ఉత్తరప్రదేశ్‌ ప్రత్యేక టాస్కుఫోర్సు(ఎస్‌టీఎఫ్‌) బృందం ఈ నెల 18వ తేదీన బర్‌గడ్‌ సందఉ లిపారు.ఈ బృందం బర్‌గడ్‌లో 2 రోజులు డేరా వేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని నిలదీసింది. ఈ నేపథ్యంలో వారికి నిబంధనల ప్రకారం అన్ని విధాలా సహకారాన్ని అందించినట్లు బర్‌గడ్‌ ఎస్పీ వివరించారు. ఎవరినీ అరెస్టు చేయలేదని ఎస్పీ తెలిపారు. అతీక్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌లను ఇటీవల కాల్కుమార్‌ బన్సాల్‌ మీడియాకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు రాష్ట్ర పోలీసులకు ఎటువంటి సమాచారం అందజేయలేదని వివరించారు. గుడ్డూ ముస్లిం బర్‌గడ్‌లో ఉన్నాడని ఓ జాతీయ మీడియా వెబ్‌సైట్‌ పేర్కొందన్నారు. గత వారం, రాజా ఖాన్‌ ధ్రువీకరించేందుకు ఉత్తర ప్రదేశ్‌ పోలీసు బృందం బర్‌గడ్‌ సందర్శించింది. రాష్ట్ర పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఉత్తర ప్రదేశ్‌ పోలీసుల బృందం పూరీని సందర్శించిన దాఖలాలు లేవు. బర్‌గడ్‌లో రాజా ఖాన్‌ విచారణ చేపట్టారు. కానీ అతన్ని ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement