ఏఎస్సైపై రౌడీషీటర్ దాడి | Rowdy sheeter attacks on ASI | Sakshi
Sakshi News home page

ఏఎస్సైపై రౌడీషీటర్ దాడి

Published Tue, Jun 2 2015 4:36 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

Rowdy sheeter attacks on ASI

ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఒక రౌడీషీటర్ ఏకంగా ఏఎస్సైపైనే దాడికి దిగాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం... మండలంలో ఏఎస్సైగా పని చేస్తున్న మహేందర్‌పై రౌడీషీటర్ రామాంజనేయులు దాడి చేశాడు. ఈ దాడిలో మహేందర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement