రౌడీషీటర్‌ దారుణ హత్య | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్‌ దారుణ హత్య

Published Sun, Aug 6 2023 12:06 AM

- - Sakshi

బనశంకరి: పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలైన కొద్దిసేపటికే ఓ రౌడీషీటర్‌ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సిద్దాపుర మహేశ్‌ హత్యకు గురైన రౌడీషీటర్‌. మహేశ్‌ పలు నేరాలతో సంబంధం ఉన్న కారణంగా పరప్పన అగ్రహార జైలుకెళ్లాడు. శుక్రవారం జైలు నుంచి విడుదలైన మహేశ్‌ హొసరోడ్డు జంక్షన్‌ వద్ద కారులో ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో కారును అడ్డుకున్న ప్రత్యర్థులు మహేశ్‌పై మరణాయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేసి అక్కడ నుంచి ఉడాయించారు.

రౌడీషీటర్‌ విల్సన్‌ గార్డెన్‌ నాగ వ్యతిరేక గ్యాంగ్‌లో మహేశ్‌ లీడర్‌గా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ప్రత్యర్థి గ్యాంగ్‌ రౌడీషీటర్‌ విల్సన్‌గార్డెన్‌ నాగ. మోహన్‌ అలియాస్‌ డబల్‌ మీటర్‌ మోహన్‌, సునీల్‌ తదితరులపై కేసులు ఉన్నాయి. 2019లో కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో హాసన ఫామ్‌హౌస్‌లో రౌడీషీటర్‌ లింగన్నను విల్సన్‌గార్డెన్‌ నాగన్న వర్గం హత్య చేసింది. మోహన్‌, నంజప్ప, కణ్ణన్‌, కుమార్‌, ప్రదీప్‌ గ్రీస్‌ వాల్టర్‌, సునీల్‌ తదితరులతో కలిపి 16 మంది బృందం లింగన్నను హత్య చేశారు.

హత్యకు ప్రతీకారంగా లింగన్న గ్యాంగ్‌లో ఉన్న సిద్దాపుర మహేశ్‌, విల్సన్‌గార్డెన్‌ స్నేహితుడిగా ఉన్న మదన్‌ను హత్య చేశాడు.దీంతో నాగన్నపై ప్రతీకారం పెరిగింది. అదే కారణంతో శుక్రవారం రాత్రి జైలు నుంచి విడుదలైన మహేశ్‌ను నాగన్న గ్రూపు కాపుగాచి హత్య చేసింది. ఘటనా స్థలాన్ని సీసీబీ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ శరణప్ప పరిశీలించారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement