
సాక్షి, హైదరాబాద్: రౌడీషీటర్ల ఆగడాలకు నగరంలో అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నగరంలోని శ్రీనగర్‌కాలనీ ప్రధాన రోడ్డులో మమతా పాన్‌షాప్ వద్దకు శ్రీకృష్ణనగర్‌కు చెందిన ఇస్మాయిల్ వచ్చాడు. ఆ సమయంలో అక్కడే వున్న వెంకటగిరికి చెందిన రౌడీషీటర్ అర్జున్ యాదవ్ ఇస్మాయిల్ను అడ్డగించాడు. నాకే నమస్తే పెట్టవా అంటూ ఆగ్రహాంతో అతడిని తీవ్రంగా కొట్టాడు. దీంతో బాధితుడు ఎస్‌కె. ఇస్మాయిల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు అర్జున్ యాదవ్‌పై ఐపీసీ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పదవ ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం హాజరుపరిచారు. న్యాయమూర్తి కేసు విచారించి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1050 జరిమానా కూడా విధించారు. నిందితుడిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.