హత్యకు గురైన ఈసా(ఫైల్ ఫొటో)
హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో గురువారం అర్ధరాత్రి ఈసా (32) అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇక్కడి ఫలక్‌నుమా బీబీకా చష్మా ప్రాంతానికి అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి చంపారు. ఘటనకు సంబంధించి ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పులి యాదగిరి వివరాలు వెల్లడించారు. ఈసా అనే రౌడీషీటర్‌ను ఛాతీలో పొడిచి హత్య చేశారని.. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించామని తెలిపారు. ఈ హత్య ఎవరు చేశారన్న వివరాలేవీ తెలియరాలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment