బెంగళూరు: వారిద్దరు అంతకుముందు స్నేహితులు.. అందులో ఒకరు లేడీ రౌడీ షీటర్ కాగా.. మరొకరు ఓ ప్రైవేట్ కోపరేటివ్ సొసైటీ సభ్యురాలు. లేడీ రౌడీని నమ్మి ఎంతోమంది సొసైటీలో పెట్టుబడులు పెట్టారు. అయితే, వారిని తన స్నేహితురాలైన సొసైటీ సభ్యురాలు మోసం చేసి కొంపముంచింది. అసలే రౌడీ షీటర్.. ఊరుకుంటుందా.. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోబోతున్న తన స్నేహితురాలిని ఇంట్లో నుంచి బజార్లోకి లాగి చితక్కొట్టింది. 'నా పరువు తీశావ్.. నా పేరు పోగొట్టావ్' అని ఆగ్రహంతో పెద్ద గ్రూపుతో వచ్చి కర్రలతో తీవ్రంగా కొట్టింది. ఇది కర్ణాటకకు చెందిన లేడీ రౌడీ షీటర్ యశశ్విని మహేశ్ అనే మహిళా చేసిన దాడి ఘటన.
గతంలో ఓ దినసరి కూలీని, పలువురిని డబ్బుకోసం కొట్టిన ఆమె తాజాగా తన స్నేహితురాలిపై దాడి చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ ప్రైవేట్ కోపరేటివ్ సొసైటీలో బోర్డు సభ్యురాలిగా పనిచేస్తున్న ఉషారాణి అనే తన మిత్రురాలిపై దాడి చేసి పారిపోయింది. కాగా, ఉషారాణిపై పలువురు పెట్టుబడిదారులను మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు రౌడీ షీటర్ యశశ్విని కోసం వెతుకుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉషారాణి ఓ ప్రైవేట్ కోపరేటివ్ సొసైటీలో సభ్యురాలిగా ఉంది.
కొద్ది రోజుల కిందటే పెట్టుబడి దారులను మోసం చేసినట్లుగా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆ క్రమంలో నెల రోజులు కనిపించకుండా పోయింది. అలా నెలపాటు కనిపించకుండాపోయిన ఉషారాణి అనూహ్యంగా వచ్చి తన ఇళ్లును మార్చే ప్రయత్నం చేస్తుండగా పెద్ద మూకతో వచ్చిన రౌడీ షీటర్ యశశ్వినీ ఆమెపై దాడి చేసింది. ఆమెను కర్రలతో కొడుతూ..'నన్ను నమ్మి ఎంతోమంది నీదగ్గర పెట్టుబడి పెడితే వారందరినీ మోసం చేశావ్.. ఇప్పుడు నా పేరు, పరువు మొత్తం పోయింది' అని గట్టిగా అరుస్తూ ఆమెను చితక్కొట్టింది.
బజార్లో ఈడ్చిఈడ్చి తన్నిన లేడీ రౌడీ షీటర్
Published Wed, Aug 10 2016 5:59 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
Advertisement
Advertisement