usharani
-
భర్త ఇంటి ముందు వధువు ఆందోళన
అనంతపురం సెంట్రల్ : ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. మంచి సంబంధం అనుకొని వివాహంతో ఒక్కటయ్యారు. పెళ్లై పట్టుమని ఐదు నెలలు కూడా గడవలేదు. అప్పుడే మనస్పర్థలు ఏర్పడ్డాయి. వేధిపులు తట్టుకోలేని వధువు భర్త ఇంటి ముందు బుధవారం ఆందోళన దిగింది. న్యాయం కోసం గంటల కొద్దీ బైఠాయించి నిరసన చేస్తున్నా పోలీసు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఈ ఘటన అనంతపురం విద్యుత్‌నగర్ సర్కిల్ సమీపంలోని కృపానందనగర్‌లో బుదవారం జరిగింది. పోలీసు శాఖలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వీరన్న కుమారుడు నాగరాజు వివాహం నార్పల మండలానికి చెందిన రంగప్ప కుమార్తె ఉషారాణితో గత ఏడాది డిసెంబర్ 11న అయింది. నాగరాజు మడకశిరలో బీఎస్ఎన్ఎల్ శాఖలో జేఈగా పని చేస్తున్నారు. ఉషారాణి ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశారు. చూడ ముచ్చటగా ఉన్న ఈ జంట వైవాహిక జీవితం తొలినాళ్లలో ఎంతో అన్యోన్యంగా సాగింది. అయితే నాగరాజు మడకశిరలోనే ఉంటూ వారానికోసారి ఇంటికొచ్చి వెళ్లేవాడు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అత్త, మామతో పాటు ఆడపడుచులు కూడా ఇంట్లోనే ఉంటుండడంతో ఉషారాణిని సూటిపోటి మాటలతో వేధించేవారు. ఇప్పటికే రెండు, మూడు దఫాలు పంచాయితీలు కూడా చేశారు. భర్తకు చెప్పినా కుటుంబ సభ్యులకే మద్దతు పలుకుతుండడంతో వేధింపులు తాళలేని బాధితురాలు పుట్టింటివారితో కలసి భర్త ఇంటి ముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆమెకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. అయితే పోలీసులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ కుమారుడు కావడంతోనే పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని బా«ధితురాలు ఉషారాణి, ఆమె తండ్రి రంగప్ప అన్నారు. అనంతరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ యల్లమరాజును కలసి జరిగిన అన్యాయాన్ని వివరించారు. -
ఉషారాణి తల్లిదండ్రులను విచారించిన సీఐడీ
బద్వేలుఅర్బన్: ఉషారాణి ఆత్మహత్యకేసును సీఐడీకి అప్పగించిన నేపథ్యంలో కర్నూలు సీఐ నాగభూషణ్ బుధవారం పుట్టాయపల్లె గ్రామానికి చేరుకుని ఉషారాణి తల్లిదండ్రులను, సోదరిని, విచారించారు. ఇందులో భాగంగా ఉషారాణి కుటుంబ సభ్యులతో ఎలా ఉండేది, కళాశాలలో జరిగే విషయాలపై చర్చించేదా అని ఆమె తల్లిదండ్రులు జయరామిరెడ్డి, జయమ్మలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. సోదరి బీరం శిరీషతో కూడా మాట్లాడారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇప్పటికే కేసుకు సంబంధించి కళాశాల యాజమాన్యాన్ని, విద్యార్థులను విచారించి కొన్ని ఆధారాలు సేకరించామని నివేదికగా తయారుచేసి నేడు హైదరాబాద్‌లోని సీఐడీ ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉషారాణి తల్లిదండ్రులు , సోదరి తమ కుమార్తె మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని సీఐడీ అధికారికి విన్నవించారు. -
అవినీతిని సహించేది లేదు
అనంతపురం టౌన్ : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎవరూ పనిచేయరాదని డీఆర్డీఏ–వెలుగు అధికారులకు సెర్ప్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్స్ (ఐబీ) డైరెక్టర్ ఉషారాణి సూచించారు. క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన చాంబర్లో జిల్లాలోని డీపీఎంలు, ఏరియా కో ఆర్డినేటర్లతో ఆమె వర్క్‌షాప్ నిర్వహించారు. 2009లో సెర్ప్ ఆవిర్భావం సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాలు, మానవ వనరులకు సంబంధించి విధి విధానాలను వివరించారు. ఆర్థిక క్రమశిక్షణ అవసరమని, ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అమలుకు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. -
‘అగ్రి జర్నలిజం’పై డిప్లమో కోర్సు
వ్యవసాయ పరిశోధనలను మరింత సమర్థవంతంగా రైతులకు అందించే లక్ష్యంతో వ్యవసాయ జర్నలిజంపై జాతీయ స్థాయి డిప్లొమా కోర్సును ప్రారంభించడానికి జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) సమాయత్తమవుతోంది. ఈ కోర్సు రూపురేఖలు, శిక్షణాంశాలపై చర్చించేందుకు సంబంధిత నిపుణులు, సీనియర్ జర్నలిస్టులు, శాస్త్రవేత్తలతో శుక్రవారం మేనేజ్ డెరైక్టర్ జనరల్ ఉషారాణి తమ కార్యాలయ ఆవరణలో చర్చాగోష్టిని నిర్వహించారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ పరిశోధనా సంస్థలు 140 ఉన్నాయని, ఏటేటా ప్రజాధనాన్ని వెచ్చించి నిర్వహిస్తున్న పరిశోధనల ఫలాలను రైతులకు అందించడంలో విఫలమవుతున్నామని ఉషారాణి అన్నారు. విస్తరణ సేవల్లో జర్నలిజం పాత్ర చాలా కీలకమన్నారు. క్షేత్రస్థాయి జర్నలిస్టులు, అధికారులు, శాస్త్రవేత్తల కోసం అగ్ని జర్నలిజంపై డిప్లొమా కోర్సును ప్రారంభించనున్నామన్నారు. వ్యవసాయ విస్తరణలో లోపాలను గుర్తించి, సాంకేతికతను రైతుల గుమ్మంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వినోద్ పావురాల, రచన జర్నలిజం కాలేజి ప్రిన్సిపాల్ రేవూరి ఉమామహేశ్వరరావు, సాక్షి న్యూస్‌ఎడిటర్, సాగుబడి ఇన్చార్జ్ పంతంగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
బజార్లో ఈడ్చిఈడ్చి తన్నిన లేడీ రౌడీ షీటర్
బెంగళూరు: వారిద్దరు అంతకుముందు స్నేహితులు.. అందులో ఒకరు లేడీ రౌడీ షీటర్ కాగా.. మరొకరు ఓ ప్రైవేట్ కోపరేటివ్ సొసైటీ సభ్యురాలు. లేడీ రౌడీని నమ్మి ఎంతోమంది సొసైటీలో పెట్టుబడులు పెట్టారు. అయితే, వారిని తన స్నేహితురాలైన సొసైటీ సభ్యురాలు మోసం చేసి కొంపముంచింది. అసలే రౌడీ షీటర్.. ఊరుకుంటుందా.. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోబోతున్న తన స్నేహితురాలిని ఇంట్లో నుంచి బజార్లోకి లాగి చితక్కొట్టింది. 'నా పరువు తీశావ్.. నా పేరు పోగొట్టావ్' అని ఆగ్రహంతో పెద్ద గ్రూపుతో వచ్చి కర్రలతో తీవ్రంగా కొట్టింది. ఇది కర్ణాటకకు చెందిన లేడీ రౌడీ షీటర్ యశశ్విని మహేశ్ అనే మహిళా చేసిన దాడి ఘటన. గతంలో ఓ దినసరి కూలీని, పలువురిని డబ్బుకోసం కొట్టిన ఆమె తాజాగా తన స్నేహితురాలిపై దాడి చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ ప్రైవేట్ కోపరేటివ్ సొసైటీలో బోర్డు సభ్యురాలిగా పనిచేస్తున్న ఉషారాణి అనే తన మిత్రురాలిపై దాడి చేసి పారిపోయింది. కాగా, ఉషారాణిపై పలువురు పెట్టుబడిదారులను మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు రౌడీ షీటర్ యశశ్విని కోసం వెతుకుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉషారాణి ఓ ప్రైవేట్ కోపరేటివ్ సొసైటీలో సభ్యురాలిగా ఉంది. కొద్ది రోజుల కిందటే పెట్టుబడి దారులను మోసం చేసినట్లుగా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆ క్రమంలో నెల రోజులు కనిపించకుండా పోయింది. అలా నెలపాటు కనిపించకుండాపోయిన ఉషారాణి అనూహ్యంగా వచ్చి తన ఇళ్లును మార్చే ప్రయత్నం చేస్తుండగా పెద్ద మూకతో వచ్చిన రౌడీ షీటర్ యశశ్వినీ ఆమెపై దాడి చేసింది. ఆమెను కర్రలతో కొడుతూ..'నన్ను నమ్మి ఎంతోమంది నీదగ్గర పెట్టుబడి పెడితే వారందరినీ మోసం చేశావ్.. ఇప్పుడు నా పేరు, పరువు మొత్తం పోయింది' అని గట్టిగా అరుస్తూ ఆమెను చితక్కొట్టింది. -
మనీలా సదస్సుకు ఉషారాణి
ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఈ నెల 6 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్స్ (ఏషియన్ పొలిటిక్స్) సదస్సుకు గుంటూరులోని పాత గుంటూరుకు చెందిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్స్ ఉమెన్స్ వింగ్ జనరల్ సెక్రటరీ, బ్యాడ్మింటన్ కోచ్ గారా ఉషారాణి ఎంపికైంది. ఉషారాణి మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు సదస్సు దోహదపడుతుందన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి మనీలాకు వెళుతున్నట్లు ఆమె చెప్పారు. ఉషారాణికి జిల్లా అధ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి జి.శేషయ్య, క్రీడాకారులు, నాయకులు అభినందనలు తెలిపారు. -
హరిపురం వీఆర్వో నివాసంపై ఏసీబీ దాడి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో వీఆర్వో ఉషారాణి నివాసంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. ధ్రువీకరణ పత్రాల కోసం లంచం డిమాండ్ చేశారంటూ ఉషారాణిపై బాధితులు ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు చేసింది. కాగా ఉషారాణి సోంపేట మండలం మామిడిపల్లి వీఆర్వోగా పని చేస్తున్నారు. -
వాళ్లంతే!
అనంతపురం ఎడ్యుకేషన్ : ఈనెల 15 నుంచి నిర్వహించే అర్ధ సంవత్సర పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల తయారీ పెద్ద సమస్యగా మారింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలులో భాగంగా పాఠశాల స్థాయిలోనే ప్రశ్నపత్రాలు తయారు చేసుకోవాల్సి ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రాలు ముద్రణ ఉండకూడదు. ఆయా స్కూళ్లలో సబ్జెక్టు నిపుణులతో ప్రశ్నపత్రాలు తయారు చేయించి వాటితో పరీక్షలు నిర్వహించాలి. 1-10 తరగతులకు పాఠశాల స్థాయిలో ప్రశ్నపత్రాలు తయారు చేసుకోవాలని ఎస్పీడీ ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాలో కొందరు హెచ్ఎంలు ఈ నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఏళ్ల తరబడి అలవాటుపడ్డ ఉపాధ్యాయులు ఇప్పుడు స్వయంగా ప్రశ్నపత్రాలు తయారు చేసుకోడానికి అయిష్టత చూపుతున్నారు. ఇదే సందర్భంలో కొందరు ఆఫ్సెట్ ప్రింటర్ల యాజమాన్యాలు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. పెరిగిన టెక్నాలజినీ ఉపయోగించుకుని ఎవరికీ అనుమానం రాకుండా ముద్రణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయా స్కూళ్ల హెచ్ఎంల నుంచి ఇండెంట్ తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రం తయారు చేసి బ్లాక్ బాల్ పారుుంట్ పెన్నుతో తెల్లటి కాగితంపై రాసి స్కానింగ్ చేస్తారు. ఆ కాగితాన్ని ఆఫ్సెట్ ప్రింట్ యజమానులకు చేరవేస్తున్నారు. తద్వారా జిల్లా అంతటా ప్రశ్నపత్రం ఒకే మాదిరి ఉండకూడదనే నిబంధనకు నీళ్లొదులుతున్నారు. ఫలితంగా జిల్లాలో అధిక శాతం పాఠశాలల్లో ప్రశ్నపత్రాలు సాధారణ రీతిలోనే ఉండబోతున్నాయి. అయితే సదరు ఆఫ్సెట్ ప్రింటర్లకు విద్యాశాఖలో ఓ ఉద్యోగి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహరం వెనుక డబ్బు చేతులు మారినట్లు తెలిసింది. ఒక్కో సెట్టు రూ. 3-5 జిల్లాలో 3,992 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. ఆయూ స్కూళ్లలో 4,13,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురంలోని ఆఫ్సెట్ ప్రింటర్ల యజమానులు ఇద్దరు ప్రశ్నపత్రాల తయారీకి ధర ఫిక్స్ చేశారు. 6,7,8 తరగతులకు సంబంధించి ఒక్కో సెట్టు 3 రూపాయలు, 9,10 తరగతులకు సంబంధించి ఒక్కో సెట్టు రూ.5గా ధర నిర్ణయించారు. ఈ మేరకు స్వయంగా ప్రధానోపాధ్యాయులకు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. ఇప్పటికే పలువురు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిసింది. ప్రశ్నపత్రాలు తయారు చేయాలన్నా, బోర్డుమీద రాయాలన్నా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. విద్యా శాఖ ఉద్యోగి పర్సేంటేజీ మాట్లాడుకున్నట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వైనంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించక పోవడం దారుణం అని ఓ ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అలా చేస్తే ఇబ్బంది పడతారు అర్ధ సంవత్సర పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రశ్నపత్రాల తయారీ విషయమై చాలా స్పష్టంగా చెప్పాం. ఎవరి స్కూల్లో వారే తయారు చేసుకోవాలి. వారి వీలును బట్టి జిరాక్స్ చేయించుకోవచ్చు లేదా బోర్డుపై రాసుకోవచ్చు. అంతేకాని ఎక్కడైనా ముద్రించినట్లు తెలిస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఈ విషయంలో ఎస్పీడీ ఉషారాణి చాలా సీరియస్‌గా ఉన్నారు. పరీక్షల సమయంలో వివిధ పాఠశాలలు తనిఖీ చేస్తాం. ఎక్కడైనా ముద్రించిన ప్రశ్నపత్రాలు కాని, వివిధ స్కూళ్లలో కామన్‌గా ఉన్నట్లుకాని తేలితే చర్యలు తీసుకుంటాం. - అంజయ్య, డీఈఓ -
దసరా సెలవులపై తర్జన భర్జన
ఒంగోలు వన్‌టౌన్: రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించే విషయంలో విద్యాశాఖ తర్జన భర్జన పడుతోంది. ప్రభుత్వానికి ఈ విషయంపై స్పష్టత లేకుండా పోవడం ... పూటకో ఉత్తర్వులు జారీ అవుతుండడంతో ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే మూడు తేదీలు మారాయి. పాఠశాలలకు మహాళాయ అమావాస్య రోజు నుంచి దసరా సెలవులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి తిలోదకాలిచ్చింది. ఈ సారి మహాళాయ అమావాస్యకు ఈ నెల 23న ఆప్షనల్ హాలీడేగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యా వార్షిక ప్రణాళికలో ఎస్సీఈఆర్టీ వారు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆ ప్రణాళికలో పేర్కొన్నారు. తరువాత ఆ తేదీలను మార్చారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఇటీవల ప్రకటించారు.అయితే తెలంగాణ ప్రభుత్వం నెల ఈ నెల 23 నుంచి సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మళ్లీ గందరగోళం నెలకుంది. ఆంధ్రకు కూడా ఈ నెల 24 నుంచి సెలవులను ప్రతిపాదిస్తూ ఎస్సిఈఆర్టి ప్రభుత్వానికి నివేదించింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా గత ఆనవాయితీని కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొందరు తమకు తోచిన విధంగా ఉపాధ్యాయులకు మెసేజ్‌లు పంపడంతో మరింత అయోమయం ఏర్పడింది. ఈ చర్చ ఇలాకొనసాగుతుండగానే శనివారం కొన్ని టి.వి. ఛానెళ్ళలో ఈ నెల 23 నుంచి దసరా సెలవులుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి ప్రకటించినట్లు స్క్రోలింగ్‌లు వచ్చాయి. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మెయిల్ వచ్చింది. ఆ వెంటనే ఆ మెయిల్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని దసరా సెలవుల విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని జిల్లా విద్యాశాఖాధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. రోటీన్‌గా పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించే విషయంలో ఏమిటీ గందరగోళమో అర్థంకావడం లేదని ఉపాధ్యాయులే కాదు విద్యార్థుల తల్లిదండ్రులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారానికి గానీ ఓ స్పష్టత వచ్చేటట్టు కనిపించడం లేదు. పరీక్షల్లో కూడా...: దసరా సెలవులు అనంతరం పాఠశాలలో విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు నిర్వహించే విషయంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లోపించింది. జిల్లాలో అక్టోబర్ 9 నుంచి త్రైమాసిక పరీక్షలు సమ్మెటివ్-1 పరీక్ష నిర్వహించేందుకు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మేరకు పరీక్షల కాలనిర్ణయ పట్టికను కూడా ప్రకటించారు. తాజాగా అక్టోబర్ 7 నుంచి త్రైమాసిక పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పరీక్షల తేదీలు మళ్ళీ మారే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ డైట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అక్టోబర్ 8 నుంచి 13 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 20 హైస్కూళ్ళలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ పాఠశాలలో పరీక్షల నిర్వహణ కష్టసాధ్యమవుతుంది. దీంతో అక్టోబర్ 14 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాలన్న ప్రతిపాదనను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి
గుత్తి, న్యూస్‌లైన్ : మూడు రోజుల క్రితం అదృశ్యమైన పట్టణంలోని కోట వీధికి చెందిన డిగ్రీ విద్యార్థిని స్వాతి(20) బుధవారం తన ఇంటి పక్కనున్న పాడుబడిన బావిలో శవమై తేలింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోట వీధిలో నివసిస్తున్న మాజీ సైనికోద్యోగి దస్తగిరి, వరలక్ష్మి దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు కాగా ముగ్గురికి పెళ్లిళ్లు చేశాడు. మిగతా ఇద్దరిలో స్వాతి పట్టణంలోని ఎంఎస్ డిగ్రీ కాలేజ్‌లో దూరవిద్య ద్వారా డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. మరో కూతురు కూడా స్థానిక శ్రీసాయి డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ అభ్యసిస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి నుంచి స్వాతి కనిపించడం లేదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పలుచోట్ల వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్వాతి అక్క నీరజ తమ ఇంటి పక్కన ఉన్న పాడుబడిన బావిలోకి కసువు వేసేందుకు వెళ్లింది. అందులో కసువు వేస్తూ తొంగి చూడగా స్వాతి శవం తేలి ఉండడాన్ని చూసింది. ఆమె కేకలు విన్న బావి పక్కనే ఉన్న ఇళ్లలోని వారు, మృతురాలి కుటుంబ సభ్యులు పరుగున వచ్చారు. స్వాతి మృతదేహం చూసి బోరున విలపించారు. స్థానికుల సమాచారంతో ట్రెయినీ డీఎస్పీ ఉషారాణి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్వాతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదనిస్నేహితులు, సన్నిహితులు అంటున్నారు. కాగా పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడాల్సి ఉంది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ డీఎస్పీ చెప్పారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఆంధ్రప్రదేశ్‌లోనే కేజీబీవీలు అధికం
అర్వపల్లి, న్యూస్‌లైన్: అన్ని రాష్ట్రాల్లో కన్న ఆంధ్రప్రదేశ్‌లోనే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్వీఎం రాష్ట్ర కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి (సీఎంఓ) డాక్టర్ బండి సాయన్న చెప్పారు. అర్వపల్లి కేజీబీవీని మంగళవారం తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 743 కేజీబీవీలు పని చేస్తున్నాయని తెలిపారు. బాలికలకు కేజీబీవీలలో ఉన్న వసతులు మరే వసతి గృహాల్లో ఉండవన్నారు. ఆర్వీఎం ఎక్కడా రాజీ పడకుండా కేజీబీవీలకు సౌకర్యా లు కల్పిస్తుందని చెప్పారు. అన్ని కేజీబీవీలకు పూర్తి కాలపు ఎస్ఓలను నియమించామన్నారు. ఇక నుంచి కేజీబీవీల్లో ప్రతి ఆదివారం మాంసాహార భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఆర్వీఎం ఎస్పీడీ ఉషారాణి కేజీబీవీల అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి రోజు భోజనంలో కోడిగుడ్లు పెట్టాలని ఎస్ఓలను ఆదేశించారు. కేజీబీవీలకు బెడ్షీట్లు 15 రోజుల్లో రానున్నాయని తెలిపారు. కొత్తగా నిర్మించిన కేజీబీవీ భవనాలలో ఎక్కడైనా సమస్యలు ఉంటె వెంటనే గుత్తేదార్లతో మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. ఏ సమస్యలు ఉన్నా ఇక నుంచి బాలికలు 1800425, 3525 టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఎంఓ లింగయ్య, ఎమ్మార్జీ పగిళ్ల సైదులు, విజయలక్ష్మి, పాల్గొన్నారు. కస్తూరిబా పాఠశాల తనిఖీ తుంగతుర్తి : మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలను ఆర్వీఎం అధికారి డాక్టర్ బండి సాయన్న మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుడడంతో విద్యార్థులకు సరైనా బాత్రూంలు, టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదన్నారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కస్తూరిబా పాఠశాలను పరిశీలించారు. పాఠశాల భవనాన్ని త్వరగా పూర్తి చేసి జనవరి 1వ తేదీ వరకు ప్రారంభించాలని, లేని పక్షంలో సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట కో ఆర్డినేటర్ జి. లింగయ్య తదితరులు ఉన్నారు. -
కేజీబీవీ ఎస్ఓల భర్తీలో గందరగోళం!
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: రాజీవ్ విద్యామిష న్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలిక ల విద్యాలయాల(కేజీబీవీ) ప్రత్యేకాధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న వారిలో కొం దరు ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకూ తమనే కొనసాగించాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పటికే ఎంపిైకై నియామకాలను పూర్తి చేసుకుని విధుల్లో జాయిన్ అయిన నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి విద్యాహక్కు చట్టంప్రకారం... ఉపాధ్యాయులు కచ్చితంగా బడిలోనే ఉండాలని ఆర్వీఎం ఎస్పీడీ ఉషారాణి కొన్ని నిబంధనలు అమలు చేశారు. ఇందులో భాగంగా ఫారెన్ సర్వీసు(సంబంధి త ఇతర శాఖల నుంచి పోస్టును తీసుకోవడం), డె ప్యూటేషన్(సర్దుపాటు)పై కేజీబీవీ స్పెషలాఫీసర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెనక్కి పంపేలా చర్య లు తీసుకున్నారు. వారి స్థానాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్ఓ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇటీవల వారికి రాత పరీక్ష నిర్వహించి, నియామాకాలు చేపట్టారు. అడ్డుపడుతున్న పాత ఎస్ఓలు జిల్లాలోని 33 కేజీబీవీలలో 14 రాజీవ్ విద్యామిషన్, 11ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ, మిగిలినవి గిరిజన సం క్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్నాయి. ఎంఈఓలు, రెసిడెన్షియల్ సొసైటీ ప్రిన్సిపాళ్లుగా ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులతో పాటు ఫారిన్ సర్వీసు కింద డి ప్యూటేషన్ కింద పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయు లు కొందరు ప్రస్తుతం ఎస్‌ఓలుగా పని చేస్తున్నారు. ఈ స్థానాల్లో కొత్త ఎస్ ఓలను భర్తీ చేసే ప్రక్రియను ఇటీవల పూర్తి చేశారు. అయితే గజపతినగరం, గరి విడి, మెరకముడిదాం కేజీబీవీలలో సోమ, మంగళ వారం విధుల్లో చేరేందుకు కొత్త ఎస్ఓలు వెళ్లగా వారి కి చేదు అనుభవం ఎదురైంది. తాము కోర్టుకెళ్లాం... 2014 ఏప్రిల్ వరకు కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నాం... మీరెలా వస్తారంటూ అక్కడున్న పాత ఎస్ఓలు వారిని అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక వారు రాజీవ్ విద్యామిషన్ జిల్లా పీఓను ఆశ్రయించారు. ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన ఎస్పీడీ విద్యా సంవత్సరం మధ్యలో తమను రిలీవ్ చేస్తే ఇబ్బందులు పడతామంటూ కొందరు కోర్టుకెళ్లిన వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల ని ఎస్పీడీ స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫారెన్ సర్వీసుపై ఎస్‌ఓలుగా వచ్చిన ఉపాధ్యాయులకు 2014 ఏప్రిల్ వరకు ఆయా కేజీబీవీల్లో 9, 10 తరగతులు బోధించేలా చర్యలు తీసుకోవాలని తెలి పారు. స్వచ్ఛందంగా రిలీవ్ కావాలనుకునే వారిని రిలీవ్ చేయాలని సూచించారు. ఇది జీర్ణించుకోని కొందరు పాత ఎస్ఓలు ఎలాగైనా కొనసాగాలనే పంథాతో కొత్తవారికి అడ్డు తగులుతున్నారు. పాతవాళ్లను టీచర్లగా కొనసాగిస్తాం కేజీబీవీలకు ఇన్చార్జి ఎస్‌ఓలుగా ఉన్న ఫారెన్ సర్వీ సు మీద వచ్చిన ముగ్గురిని ఆయా విద్యాలయాల్లో 9, 10వ తరగతి ఉపాధ్యాయులుగా కొనసాగిస్తామని రా జీవ్ విద్యామిషన్ పీఓ జి.నాగమణి ‘న్యూస్‌లైన్’కి తె లిపారు.ఎస్ఓలుగానే కొనసాగించాలంటూ కొందరు కోర్టుకెళ్లిన విషయాన్ని ఎస్పీడీకి నివేదించామన్నారు.