బద్వేలుఅర్బన్: ఉషారాణి ఆత్మహత్యకేసును సీఐడీకి అప్పగించిన నేపథ్యంలో కర్నూలు సీఐ నాగభూషణ్ బుధవారం పుట్టాయపల్లె గ్రామానికి చేరుకుని ఉషారాణి తల్లిదండ్రులను, సోదరిని, విచారించారు. ఇందులో భాగంగా ఉషారాణి కుటుంబ సభ్యులతో ఎలా ఉండేది, కళాశాలలో జరిగే విషయాలపై చర్చించేదా అని ఆమె తల్లిదండ్రులు జయరామిరెడ్డి, జయమ్మలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. సోదరి బీరం శిరీషతో కూడా మాట్లాడారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇప్పటికే కేసుకు సంబంధించి కళాశాల యాజమాన్యాన్ని, విద్యార్థులను విచారించి కొన్ని ఆధారాలు సేకరించామని నివేదికగా తయారుచేసి నేడు హైదరాబాద్‌లోని సీఐడీ ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉషారాణి తల్లిదండ్రులు , సోదరి తమ కుమార్తె మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని సీఐడీ అధికారికి విన్నవించారు.
ఉషారాణి తల్లిదండ్రులను విచారించిన సీఐడీ
Published Wed, Nov 23 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
Advertisement