హైదరాబాద్: అంబర్పేట డీడీకాలనీలో ఓ అపార్ట్మెంట్లో ఆదివారం రాత్రి ఓ రౌడీషీటర్ హల్ చేసి మహిళలపై దాడికి పాల్పడ్డాడు. కాలనీలో నివాసముంటున్న వారిపై చేయి చేసుకన్నాడు. దీన్ని అడ్డుకునేందుకు వచ్చిన లాయర్‌పై దాడి చేసి నోటికొచ్చినట్టు దూషించాడు. ఈ సంఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
స్థానికంగా నివాసం ఉండే రబ్బానీ అనే రౌడీషీటర్ తన ఇంట్లో పనిచేసే పనిమనిషి నివసించేందుకు అపార్ట్మెంట్ సెల్లార్లో ఓ గదిని నిర్మిస్తున్నాడు. ఈ విషయంలో అపార్ట్మెంట్ వాసులు ఇటీవల మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో మున్సిపల్ సిబ్బంది ఈ నిర్మాణాన్ని నిలిపివేశారు. దీంతో రబ్బానీ కోర్టును ఆశ్రయించాడు.
కోర్టు సూచన మేరకు అపార్ట్మెంట్ వాసులు సమావేశమై తీర్మానం చేసుకురమ్మని సూచించగా నిన్న సాయంత్రం అపార్ట్మెంట్లో నివాసం ఉండే సభ్యులంతా సమావేశం కాగా...విషయం తెలుసుకున్న రబ్బానీ అక్కడికి వచ్చి ఎందుకు సమావేశం నిర్వహిస్తున్నారంటూ బెదరించడంతో పాటు మహిళలపైనా దాడి చేశారు.
పలువురు మహిళలు గాయపడ్డారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. కాలనీ వాసులపై తరచూ దాడులకు పాల్పడుతున్న రబ్బానీపై వెంటనే తీసుకోవాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కాగా పోలీసులు రబ్బానీపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
మహిళలపై రౌడీషీటర్ దాడి, అరెస్ట్
Published Mon, Dec 8 2014 9:10 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement