breaking news
rabbani
-
‘తమ్మినేని’ భార్యపై దాడి కేసులో నిందితుల రిమాండ్
గోల్నాక: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భార్యపై దాడి చేసిన రబ్బాని అలియాస్ యయా, అతని అన్న సందానిలను అంబర్‌పేట పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో సందాని భార్య వస్రత్ పరారీలో ఉంది. ఇన్స్పెక్టర్ పి.వెంకటరమణ కథనం ప్రకారం.. డీడీకాలనీలోని జిలాని మీడోస్ అపార్ట్మెంట్లో ఉంటున్న బి.సరోజరెడ్డి, ఆమె భర్త బి.రామ్మోహన్‌రెడ్డి, మిగతా ప్లాట్ల యజమానులైన తమ్మినేని వీరభద్రం భార్య ఉమాదేవి, శైలజ, శిరీషా, పూర్ణిమ, డాక్టన్ ఎల్.నిర్మల, తిరుమల తదితరులు ఆదివారం రాత్రి గ్రౌండ్ ఫ్లోర్లో నిలబడి అపార్ట్మెంట్ నిర్వహణ విషయమై చర్చించుకుంటున్నారు. అదే సమయంలో అపార్ట్మెంట్ రెండో అంతస్తు నుంచి కిందకు వచ్చిన రబ్బాని, అతని అన్న సందాని, సందాని భార్య వస్రత్లు ఆకస్మాత్తుగా రామ్మోహన్‌రెడ్డిపై దాడి చేసి కొట్టారు. అడ్డువెళ్లిన సరోజరెడ్డి, ఉమాదేవిలను పక్కకు తోసివేసి ఇటుకలతో కొట్టడానికి యత్నించారు. రబ్బాని రామ్మోహన్‌రెడ్డి కడుపులో తీవ్రంగా గుద్డాడు. సరోజరెడ్డి, ఉమాదేవిల జుత్తు పట్టుకొని ముఖంపై కొట్టాడు. ఇటుకలతో కూడా గాయపర్చారు. అంతేకాకుండా రబ్బాని చంపుతానని వారిని బెదిరించాడు. ఆందోళనకు గురైన బి.సరోజరెడ్డి, ఉమాదేవి పోలీసులను కలిసి రబ్బాని, సందాని, వస్రత్ల నుంచి తమ ప్రాణ హాని ఉందని, అతన్ని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రబ్బాని, సందానిలను అదుపులోకి తీసుకొని సోమవారం అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 354, 324,323,506/34 వంటి కేసులు నమోదు చేశారు. కాగా, రబ్బానిపై పీడీ యాక్ట్ నమోదుకు ప్రతిపాదనలు పంపిస్తామని ఇన్స్పెక్టర్ పి.వెంకటరమణ తెలిపారు. -
మహిళలపై రౌడీషీటర్ దాడి, అరెస్ట్
హైదరాబాద్: అంబర్‌పేట డీడీకాలనీలో ఓ అపార్ట్మెంట్లో ఆదివారం రాత్రి ఓ రౌడీషీటర్ హల్ చేసి మహిళలపై దాడికి పాల్పడ్డాడు. కాలనీలో నివాసముంటున్న వారిపై చేయి చేసుకన్నాడు. దీన్ని అడ్డుకునేందుకు వచ్చిన లాయర్‌పై దాడి చేసి నోటికొచ్చినట్టు దూషించాడు. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికంగా నివాసం ఉండే రబ్బానీ అనే రౌడీషీటర్ తన ఇంట్లో పనిచేసే పనిమనిషి నివసించేందుకు అపార్ట్మెంట్ సెల్లార్లో ఓ గదిని నిర్మిస్తున్నాడు. ఈ విషయంలో అపార్ట్మెంట్ వాసులు ఇటీవల మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో మున్సిపల్ సిబ్బంది ఈ నిర్మాణాన్ని నిలిపివేశారు. దీంతో రబ్బానీ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు సూచన మేరకు అపార్ట్మెంట్ వాసులు సమావేశమై తీర్మానం చేసుకురమ్మని సూచించగా నిన్న సాయంత్రం అపార్ట్మెంట్లో నివాసం ఉండే సభ్యులంతా సమావేశం కాగా...విషయం తెలుసుకున్న రబ్బానీ అక్కడికి వచ్చి ఎందుకు సమావేశం నిర్వహిస్తున్నారంటూ బెదరించడంతో పాటు మహిళలపైనా దాడి చేశారు. పలువురు మహిళలు గాయపడ్డారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. కాలనీ వాసులపై తరచూ దాడులకు పాల్పడుతున్న రబ్బానీపై వెంటనే తీసుకోవాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కాగా పోలీసులు రబ్బానీపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
కాలనీవాసుల పై రౌడీ షీటర్ హల్చల్