
‘తమ్మినేని’ భార్యపై దాడి కేసులో నిందితుల రిమాండ్
గోల్నాక: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భార్యపై దాడి చేసిన రబ్బాని అలియాస్ యయా, అతని అన్న సందానిలను అంబర్‌పేట పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో సందాని భార్య వస్రత్ పరారీలో ఉంది. ఇన్‌స్పెక్టర్ పి.వెంకటరమణ కథనం ప్రకారం.. డీడీకాలనీలోని జిలాని మీడోస్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బి.సరోజరెడ్డి, ఆమె భర్త బి.రామ్మోహన్‌రెడ్డి, మిగతా ప్లాట్ల యజమానులైన తమ్మినేని వీరభద్రం భార్య ఉమాదేవి, శైలజ, శిరీషా, పూర్ణిమ, డాక్టన్ ఎల్.నిర్మల, తిరుమల తదితరులు ఆదివారం రాత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లో నిలబడి అపార్ట్‌మెంట్ నిర్వహణ విషయమై చర్చించుకుంటున్నారు. అదే సమయంలో అపార్ట్‌మెంట్ రెండో అంతస్తు నుంచి కిందకు వచ్చిన రబ్బాని, అతని అన్న సందాని, సందాని భార్య వస్రత్‌లు ఆకస్మాత్తుగా రామ్మోహన్‌రెడ్డిపై దాడి చేసి కొట్టారు. అడ్డువెళ్లిన సరోజరెడ్డి, ఉమాదేవిలను పక్కకు తోసివేసి ఇటుకలతో కొట్టడానికి యత్నించారు.
రబ్బాని రామ్మోహన్‌రెడ్డి కడుపులో తీవ్రంగా గుద్డాడు. సరోజరెడ్డి, ఉమాదేవిల జుత్తు పట్టుకొని ముఖంపై కొట్టాడు. ఇటుకలతో కూడా గాయపర్చారు. అంతేకాకుండా రబ్బాని చంపుతానని వారిని బెదిరించాడు. ఆందోళనకు గురైన బి.సరోజరెడ్డి, ఉమాదేవి పోలీసులను కలిసి రబ్బాని, సందాని, వస్రత్‌ల నుంచి తమ ప్రాణ హాని ఉందని, అతన్ని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రబ్బాని, సందానిలను అదుపులోకి తీసుకొని సోమవారం అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 354, 324,323,506/34 వంటి కేసులు నమోదు చేశారు. కాగా, రబ్బానిపై పీడీ యాక్ట్ నమోదుకు ప్రతిపాదనలు పంపిస్తామని ఇన్‌స్పెక్టర్ పి.వెంకటరమణ తెలిపారు.