గుంటూరు నగరంలో రౌడీ షీటర్ బసవల భారతి వాసు (39) అలియాస్ వాసును నలుగురు దుండగులు అతి దారుణంగా నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో.. అరండల్ పేట 12వ లైన్‌లో ఆది వారం రాత్రి సుమారు 8–26 గంటలకు అంతా చూస్తుండగా నడి రోడ్డుపై వాసును హతమార్చారు. గుంటూరులోని విద్యానగర్ 4వ లైన్‌లో నివాసం ఉంటున్న వాసు మరి కొందరితో కలసి ఆదివారం రాత్రి అరండల్‌పేట 12వ లైన్‌లో ఉన్న అన్వర్ బిర్యానీ పాయింట్‌కు వెళ్లాడు.