కర్ణాట బీజీపీ నాయకులు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో పేరు మోసిన నేరస్తుడు సునీల్ దర్శనమిచ్చాడు. అతను బెంగుళూరులో అత్యంత భయంకరమైన కాంట్రాక్ట్ కిల్లర్‌గా పరిగణించే సునీల్. ప్రస్తుతం అతను నేర కార్యకలపాలకు దూరంగా ఉంటున్నానని, సమాజ సేవ చేస్తున్నాని చెబుతుండటం విశేషం. ఆ నేరస్తుడు బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య, చిక్‌పేట ఎమ్మెల్యే ఉదయ్ గరుడహర్, బెంగళూరు సౌత్ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌ఆర్ రమేష్ తదితరులతో ఆదివారం నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో కనిపించాడు.
దీంతో అతను బీజేపీలోకి చేరతాడంటూ రకరకాల ఊహాగానాలు హల్‌చల్ చేశాయి. ఈ మేరకు కర్ణాట బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్పందిస్తూ... ఈ మిషయమై పార్టీ నేతలను వివరణ కోరతానని అన్నారు. అంతేగాక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నేతలను ఆదేశించామని, అన్ని విషయాలు పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాదులను, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వారిని, నేర నేపథ్యం ఉన్న వారిని పార్టీలోకి తీసుకోమని, ఇలాంటి వాటిని పార్టీ ఎప్పటికీ సహించదని నొక్కిచెప్పారు.
ఇదిలా ఉండగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శులు ఎక్కుపెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ కర్ణాటక ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్విట్టర్ వేదికగా..పోలీసుల దాడిలో దొరకని రౌడిషీటర్ బీజేపీ నేతల వద్ద దర్శనమిచ్చారు. గతంలో బెట్టింగ్‌లకు, నేరాలకు పాల్పడినవారు నేడు బీజేపీ పార్టీలో చేరి, మోదీ నుంచి స్ఫూర్తి పొందుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య కూడా బీజేపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.
దీంతో బీజేపీ శివకుమార్ ఒకప్పుడూ గ్యాంగ్‌స్టర్ కొత్వాల్ రామచంద్రకు అభిమాన శిష్యుడంటూ సెటైరికల్ కౌంటర్ ఇచ్చింది. ఒకప్పుడూ కొత్వాల్ అభిమాన శిష్యుడు తీహార్ జైలు నుంచి కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదోన్నతి పొందాడని, ప్రస్తుతం అతను పార్టీ అద్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజులను మరిచిపోయారా అంటూ బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. అండర్ వరల్డ్‌లో పెరిగిన శివకుమార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, హత్య నిందితులు వినయ్ కులకర్ణి, గూండాయిజంలో పేరుగాంచిన మహ్మద్ నలపాడ్‌లు కర్ణాటక కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారంటూ మొత్తం లిస్ట్ పేర్కొంది బీజేపీ.
కాగా, ఇరు పార్టీ మాటల తుటాల దాడి నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ...పాత రౌడీషీటర్ల సంఖ్యను తేల్చి చెప్పమని గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు. ఈ సందర్భంగా పోలీసులపై కూడా పలు విమర్శలు వచ్చాయి. దీంతో క్రైం బ్రాంచ్ కమిషనర్ ఎన్‌డీ శరణప్ప ఈ విషయమై వివరణ ఇచ్చారు. పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేవని స్పష్టం చేశారు. అలాగే రౌడీ షీటర్ సునీల్‌పై ఎలాంటి పాత పెండింగ్ కేసులు లేవని స్పష్టం చేశారు. అంతేగాదు అతను విచారణకు హాజరు కావాల్సిన అవసరం కూడా లేకపోవడంంతోనే ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే రౌడీషీటర్ సునీల్‌ని అదుపులోకి తీసుకులేదని తెలిపారు.
(చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment