ఇద్దరు రౌడీషీటర్ల అరెస్ట్
Published Thu, Aug 25 2016 6:14 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
మద్యం తాగేందుకు డబ్బుల కోసం టెంట్‌హౌజ్‌లో పని చేస్తున్న వర్కర్‌పై కత్తితో దాడి చేసి గాయపర్చిన ఘటనలో కార్మిక నగర్‌కు చెందిన ఇద్దరు రౌడీషీటర్లు లక్ష్మణ్, ఖాలిద్‌లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 15వ తేదీన కార్మికనగర్ సమీపంలోని బ్రహ్మంగారి టెంపుల్ వద్ద ఉన్న టెంట్‌హౌజ్ వద్దకు రౌడీషీటర్లు లక్ష్మణ్, ఖాలిద్‌లు వచ్చి ’ 5 వేలు ఇవ్వాలంటూ టెంట్‌హౌజ్ యజమానిని అడిగారు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో టెంట్‌హౌజ్‌లోసామాన్లు అన్నీ ధ్వంసం చేసి భీభత్సం సష్టించి అక్కడ పని చేస్తున్న వాళ్లను తీవ్రంగా కొట్టి అడ్డు వచ్చిన కె. సురేష్‌కుమార్‌పై కత్తితో దాడి చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Advertisement
Advertisement