జంగారెడ్డిగూడెంలో చంద్రబాబుకు చేదు అనుభవం!
జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మహిళల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం-కొయ్యలగూడెం రోడ్‌షోలో చోటు చేసుకుంది.
రైతు రుణమాఫీ వ్యవహారంపై సీఎం చంద్రబాబును రైతులు నిలదీశారు. రైతుల ప్రశ్నలకు కంగుతిన్న చంద్రబాబు పలు సమాధానాలతో దాట వేసేందుకు ప్రయత్నించారు. కేవలం రైతుల నుంచే కాకుండా డ్వాక్రా రుణాల మాఫీపై మహిళలు చంద్రబాబును నిలదీశారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు స్వంత నియోజకవర్గం కుప్పంలో కూడా చంద్రబాబు తీరుపై మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.