రుణమాఫీకి ఆధార్ గండం | The loan waiver scheme saved | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి ఆధార్ గండం

Published Mon, Jul 28 2014 2:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రుణమాఫీకి ఆధార్ గండం - Sakshi

రుణమాఫీకి ఆధార్ గండం

  •    రైతులు, డ్వాక్రా మహిళల ఉరుకులు, పరుగులు
  •    కిటకిటలాడుతున్న బ్యాంకులు
  •    జాడలేని ఆధార్ కేంద్రాలు
  •    మీ-సేవా కేంద్రాల్లో ఆధార్ అదృశ్యం
  • విజయవాడ : రుణమాఫీ వర్తింపజేయాలంటే తప్పనిసరిగా ఆధార్ నంబరుతో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాల్సిందేనన్న నిబంధన విధించడంతో రైతులు, డ్వాక్రాగ్రూపు సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ నంబర్లు సమర్పించకుంటే మాఫీ, రీ షెడ్యూలు చేసే సమస్యే లేదని బ్యాంకర్లు చెబుతుండడంతో చేసేదేమీ లేక రైతులు, డ్వాక్రా మహిళలు ఆధార్ కార్డుల కోసం ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. అప్పులు తీసుకున్న రైతులు, మహిళలు బ్యాం కుల వద్ద బారులు తీరి ఆధార్ నంబర్లు సమర్పిస్తున్నారు.

    ఆధార్ లేని వారు నానా అగచాట్లు పడుతున్నారు. గతంలో ఆధార్  తీయించుకున్న వారిలో కొందరికి ఇంకా కార్డులు రాలేదు. దీంతో వారు ఏమి చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల వారు విజయవాడ లబ్బీపేటలో కార్వే ఆధార్ కే్రందం వద్దకు వెళ్లి గత కొద్ది నె లలుగా ఫొటోలు తీయించుకుంటున్నారు. అక్కడి సిబ్బంది వారంలోనే ఆధార్ కార్డు వస్తుందని చెప్పి పంపిస్తున్నారు. అయితే నెలలు గడుస్తున్నా కార్డు రావటం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. కార్డుల కోసం మీ-సేవ కేంద్రాలను సంప్రదించాలని పౌరసరఫరాల అధికారులు సలహా ఇస్తున్నారు. అయితే అక్కడ కూడా ఆధార్ కార్డులు, లేదా దానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదని ప్రజలు వాపోతున్నారు.  
     
    రుణమాఫీకి బ్యాంకర్ల కసరత్తు
     
    జిల్లాలో 425 సహకార సంఘాలు, ఇతర వాణిజ్య బ్యాంకుల నుంచి గత మార్చి వరకు రూ.5,628 కోట్ల రుణాలు తీసుకున్నారు. వీటిలో బంగారం తాకట్టు పెట్టి 2,60,737 ఖాతాల ద్వారా రూ.3,276కోట్లు, 1,89,587ఖాతాల ద్వారా రూ.2,3 52కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.1.50 లక్షలు చొప్పున లెక్కిస్తే రూ.700 కోట్ల రుణమాఫీ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా డ్వాక్రా సంఘాలకు గ్రూపునకు రూ.లక్ష చొప్పన దాదాపు రూ.300 కోట్ల రుణమాఫీ వస్తుందని భావిస్తుస్తున్నారు.  
     
    లక్షమందికిపైగా అవస్థలు
     
    జిల్లాలో 45,17,398 మంది జనాభా ఉన్నారు. వీరిలో 43,83,120 మంది ఆధార్ తీయించుకున్నారు. ఇంకా 1,34,278 మంది ఆధార్ ఫొటోలు దిగాల్సి ఉంది. గత జనవరి నుంచి ఆధార్ కేంద్రాలు మూత పడ్డాయి. మళ్లీ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయినా కార్యరూపం దాల్చడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ జోక్యం చే సుకుని ఆధార్ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement