రుణాలెప్పుడు రద్దుచేస్తారు..? | When loans are canceled ..? | Sakshi
Sakshi News home page

రుణాలెప్పుడు రద్దుచేస్తారు..?

Jul 20 2014 2:33 AM | Updated on Sep 29 2018 6:06 PM

రుణాలెప్పుడు రద్దుచేస్తారు..? - Sakshi

రుణాలెప్పుడు రద్దుచేస్తారు..?

డ్వాక్రా రుణాలను ఎప్పుడు రద్దు చేస్తారని తెలుగింటి ఆడపడుచులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిలదీశారు. ముఖ్యమంత్రిగా తాను పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతుండగా డ్వాక్రా మహిళలు అడ్డుకుని,

నెల్లూరులో సీఎం చంద్రబాబును నిలదీసిన డ్వాక్రా మహిళలు
 
నెల్లూరు: డ్వాక్రా రుణాలను ఎప్పుడు రద్దు చేస్తారని తెలుగింటి ఆడపడుచులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిలదీశారు. ముఖ్యమంత్రిగా తాను పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతుండగా డ్వాక్రా మహిళలు అడ్డుకుని, రుణాలను ఎప్పుడు రద్దుచేస్తారని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సమాధానం దాటవేశారు. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా కేంద్రంలో జరిగింది. నెల్లూరులో శనివారం సాయంత్రం ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలను చంద్రబాబునాయుడు ప్రారంభించగా, ఈ సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని మహిళలు నిలదీశారు. తప్పకుండా తల్లీ ఆలోచిస్తున్నా.. తొందరలో నిర్ణయం తీసుకుంటానంటూ సీఎం సమాధానం చెప్పారు.

వెంకయ్యా అంతా నీదే భారం

చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులను తీసుకు ని వచ్చే బాధ్యత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై పెట్టా రు. విభజన తర్వాత రావాల్సిన నిధులు, అభివృద్ధికి నిధులు, హడ్కో నిధులు అన్నీ వెంకయ్య తీసుకుని రావాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement