ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత మండల, గ్రామ స్థాయి అధికారులపై ఉందని...
నర్సింహులపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత మండల, గ్రామ స్థాయి అధికారులపై ఉందని గ్రామీణ పేదరిక నిర్మూలన(సెర్ఫ్) సీఈఓ డాక్టర్ రాజశేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా షెడ్యూల్డు కులాలు, సహకార సంఘం ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాలకు ఏర్పాటు చేసిన సమావే శంలో ఆయన మాట్లాడారు. అధికారుల లోపంతో కొన్ని స్కీంలు పెదవారికి సక్రమం గా అందడం లేదన్నారు.
రాష్ట్రంలో 1.17 కోట్ల మహిళలు డ్వాక్రా సంఘాల్లో ఉండగా, వారికి రూ.60వేల కోట్లు రుణాలుగా ఇచ్చామని, ఎలాం టి షరతులు లేకుండా బ్యాంకుల ద్వారా ఇస్తు న్న రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలని సూచించా రు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఉపయోగించుకుంటే పేదరిక నిర్మూలన జరుగుతుందని పేర్కొన్నారు. పెద్దముప్పారంలో ఐకే పీ సిబ్బంది పనితీరు బాగోలేదని, సంఘాల తో ప్రతీవారం సమావేశం ఎర్పాటు చేసి సక్రమంగా రుణాలు జమచేసి, డి-గ్రేడ్‌లో ఉన్న సంఘాలను ఎ-గ్రేడ్‌లోకి తీసుకురావాలని ఆదేశించారు.
డ్వాక్రా సంఘాల ద్వారానే మహిళలకు సమాజంలో గుర్తింపు వచ్చిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ ఎండీ బి.జయరాజు మాట్లాడుతూ చిత్తశుద్ధి, క్రమశిక్షణ, తపన, కృషి, పట్టుదల ఉంటే మహిళలు అన్ని రంగాలలో రాణించవచ్చని పేర్కొన్నారు. గ్రా మంలో ఎస్‌బీఐతోపాటు స్త్రీ నిధి బ్యాంక్ ద్వారా రుణాలు ఇవ్వాలని మహిళా సంఘాల సభ్యులు సెర్ఫ్ సీఈఓను కొరారు.
అడిషనల్ జేసీ సం జీవయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ కిషన్, డీఆర్‌డీఏ పీడీ విజయగొపాల్, హౌసింగ్ పీడీ లక్ష్మణ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, ఆర్‌డీఓ మధుసూదన్‌నాయ క్, తహసీల్దార్ బత్తుల సుమతి, ఎంపీడీఓ అశోక్‌కుమార్, సీడీపీఓ ధనమ్మ, గ్రామ సర్పంచ్ వెలుగు ఉపేందర్, ఉప సర్పంచ్ నుగునూతల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.