
సాక్షి, ఎన్టీఆర్: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ రావుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా గ్రూప్‌కు సంబంధించి మాట్లాడేందుకు వెళ్లిన మహిళలతో ఎమ్మెల్యే కొలికిపూడి అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. దీంతో, మహిళలకు ఎమ్మెల్యే ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.
తమను బూతులతో దూషించారని మహిళలు ఆరోపించారు. డ్వాక్రా గ్రూప్‌నకు సంబంధించి బుక్ కీపర్‌లుగా పాతవారినే కొనసాగించాలని ఎమ్మెల్యే కొలికిపూడి వద్దకు వెళ్లిన మహిళలు. ఈ సందర్భంగా మహిళలను తీవ్ర పదజాలంతో దూషించిన కొలికపూడి. మిమ్మల్ని ఎవడు ఇక్కడికి పంపించాడు? అంటూ ఊగిపోయిన ఎమ్మెల్యే. మహిళలు అని కూడా వారిని బూతులు తిట్టాడని సదరు మహిళలు తెలిపారు. అనంతరం, పోలీసులను పిలిపించి మహిళలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి స్టేషన్‌లో తమకు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కూటమి ప్రభుత్వంలో మహిళల్ని గౌరవించే విధానం ఇదేనా అంటూ మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment