సంఘాలను పటిష్టం చేద్దాం
సంఘాలను పటిష్టం చేద్దాం
Published Tue, Oct 18 2016 1:10 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM
గుంటూరు వెస్ట్ : స్వయం సహాయక సంఘాలు మరింత బలోపేతం కావడానికి కృషిచేయాల్సిన అవసరం ఉందని సెర్ప్ రాష్ట్ర డైరెక్టర్ (సంస్థాగత నిర్మాణం) ఉషారాణి చెప్పారు. సోమవారం జిల్లా సమాఖ్య కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉషారాణి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు పటిష్టం కావడం ద్వారానే స్త్రీనిధి నుంచి మరిన్ని రుణాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 2200 మంది స్వయం సహాయక సభ్యుల ఆధార్ సీడింగ్‌ను తక్షణమే పూర్తిచేయాలని సూచించారు. రాజధాని ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సంఘాలను పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ హబీబ్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి బ్రిక్స్ తయారీ పనులను స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం గొప్ప అవకాశమన్నారు. వీటిని సక్రమంగా నిర్వహించడం ద్వారా సంఘాలు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ రాష్ట్ర అధికారులు రామకృష్ణ, మాధవీలత, డీఆర్‌డీఏ ఏపీడీ జి.నాగేశ్వరరావు, డీపీఎం అశోక్‌కుమార్, నారాయణ, శారదాంబ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కె.సౌభాగ్యం, ఏపీఎం సాంబశివరావు, జేడీఎం శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement