Strength
-
సంతోషమే బలం
మానవుడు ఆనంద స్వరూపుడు. ఆనందం కోసమే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చిత్రంగా ఆ ప్రయత్నంలో దానినే విస్మరించటం, కోల్పోవటం జరుగుతుంది. ఆనందంగా ఉండటం సహజ స్థితి. అప్పుడే పుట్టిన పిల్లలు చూడండి. ఆనందంగా నవ్వుతూ ఉంటారు. ఆకలి వేసినప్పుడో ఇబ్బంది కలిగినప్పుడో మాత్రమే ఏడుస్తారు. అది వాళ్ళు తమ భావాలను ప్రకటించగల ఒకే ఒక భాష. ఎవరికైనా కష్టం వస్తే బ్రహ్మాండంగా ఓదారుస్తాం – కష్టాలు మనుషులకి కాక మాకులకి వస్తాయా? కలకాలం ఉండవు, మంచి కాలం ముందు ఉంది అని. తనదాకా వస్తే ధైర్యానికి మూలకారణమైన జ్ఞానం నశిస్తుంది. చదివిన చదువంతా నట్టేట్లో కలిసి΄ోతుంది. తెలివి΄ోయాక ఏమి ఉంటుంది? అందువల్ల శోకాన్ని మించిన శత్రువు లేదు అన్నది కౌసల్య. నిజమే కదా! ఆనందాన్ని క్రమక్రమంగా వయసుతోపాటు కోల్పోతున్నాడు మానవుడు. దానికి కారణం శోకం. అందుకే అర్జునుడు విషాదంలో కూరుకుపోయినప్పుడు శ్రీ కృష్ణుడు ‘‘నీకు శోకించే అధికారం లేదు’’ అని వరుసగా ఎన్నో శ్లోకాలలో నొక్కి వక్కాణించాడు. శోకం మనిషిని మానసికంగా క్రుంగదీస్తుంది. మనోబలం తగ్గటంతో శరీరం కూడా సరిగా సహకరించదు. అది అన్ని రుగ్మతలకి ఆహ్వానం. ‘‘ఈడుపు కాళ్ళు ఏడుపు మొఖం’’ అన్ని పనులకు ఆటంకం కలిగిస్తాయి. ఏడుపుగొట్టు ముఖం దరిదాపుల్లోకి ఏ శుభాలు రావు. ఎందుకంటే ఏడుపు మొహం రాగానే కాళ్ళు ఈడవటం జరుగుతుంది. ఇంక పనులు ఏమవుతాయి? విజయానికి మూలం ఉత్సాహం. శోకం ఉత్సాహాన్ని తరిమికొడుతుంది. ఇంకా ఏం చేస్తుందో తెలుసా? ‘‘శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్ శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమో రిపుః’’ ఎప్పుడూ జీవితంలో ఎవరినీ పల్లెత్తు మాట అనని కౌసల్య రాముడు వనవాసం చేయటానికే నిశ్చయించుకున్నాడు అని తిరిగి వచ్చిన సుమంత్రుడు చెప్పగానే శోకోపహతచేతస అయి దశరథుడితో నిష్ఠురంగా మాట్లాడుతుంది. దశరథుడు ఆమెను బ్రతిమాలుతుంటే తన తప్పు తెలుసుకుని ఈ మాటలు అంటుంది. తాను ఆ విధంగా కఠినంగా మాట్లాడటానికి శోకమే కారణం అని దానిని మించిన శత్రువు లోకంలో లేదు అంటుంది. నొప్పి వేరు, బాధ వేరు, శోకం వేరు. నొప్పి భౌతిక మైనది. శరీర సంబంధం. బాధ మనస్సుకి సంబంధించినది. శోకం మనస్సు లోలోపలి ΄÷రలలోకి చొచ్చుకొని ΄ోయి జీవుణ్ణి వేదనకి గురి చేస్తుంది. తనకో తనవారికో కష్టం కలిగింది అనే భావన జోడించబడి ఉంటుంది. ఎప్పుడైతే నేను, నా అన్న భావన కలిగిందో మనస్సు నిర్మలంగా, నిష్పక్ష΄ాతంగా ఆలోచించలేదు. ఎదుటివారి సమస్యలని తేలికగా పరిష్కరించగలవారు తమకి వచ్చిన చిన్న సమస్యని కూడా పరిష్కరించ లేక΄ోవటానికి ఇదే కారణం. అది తమది కాదు ఎవరిదో అని ఆలోచించగానే తాము అందులో ఉండరు గనుక వెంటనే పరిష్కారం లభిస్తుంది. శోకంలో ముందుగా వచ్చేదే ‘నేను’ అన్నది. దానితో ముందుగా ధైర్యం జారిపోతుంది. అర్జునుడికి వచ్చింది కూడా శోకమే. ధైర్యం కోల్పోవటం వల్ల శరీరం వణకటం, చేతిలో ఉన్న గాండీవం జారిపోవటం వంటివి జరిగాయి. ఆ శోకాన్ని పోగొట్టి ధైర్యాన్ని, దానికి మూలమైన జ్ఞానాన్ని ఇచ్చే ముందు నీకు శోకించే అర్హత, అధికారం లేదు అని గట్టిగా చె΄్పాడు. మరేం చేయాలి అంటే ‘‘సమస్యలు వస్తే క్రుంగి΄ోక వాటితో యుద్ధం చేయాలి.’’ అని ఆదేశించాడు. అది అర్జునుడికి మాత్రమే కాదు. భారతీయులు అందరూ. మనం అన్నివిధాల సమస్యలతోను ΄ోరాడి విజయం సాధించాలి. – డా. ఎన్. అనంతలక్ష్మి -
టీడీపీ నేతల అమానుష చర్చ
-
అన్నీ మనసులోనే ఉంచుకుంటున్నారా?
అంతర్ముఖుల శక్తి వారి నిశ్శబ్దంలోనే ఉంటుంది. కాని అదే వారి బలహీనత కూడా కావచ్చు. అంతర్ముఖత్వం వల్ల కచ్చితంగా చెప్పాల్సినవి చెప్పకపోవచ్చు. మనసులో ఏముందో ఎదుటివారికి తెలియకపోవడం వల్ల అనుకోని సమస్యలు రావచ్చు. అంతర్ముఖులుగా ఉన్న స్త్రీలు తమ కుటుంబ, ఉద్యోగ, సామాజిక జీవనంలో ఎలా మెలగాలో తెలుసుకుందాం. కొందరు అన్నింటికీ స్పందిస్తారు. కొందరు మౌనంగా ఉంటారు. కొందరిని చూసి ఇతరులు ‘వాళ్లు మనసులో ఏమీ దాచుకోరు’ అంటారు. మరికొందరిని చూసి ‘వీళ్ల మనసులో ఏముందో తెలుసుకోలేము’ అంటారు. బహిర్ముఖులదే (ఎక్స్ట్రావర్ట్స్) ఈ లోకం అని ఎక్కువ మంది విశ్వాసం. ఎందుకంటే తప్పో ఒప్పో ఏదో ఒకటి మాట్లాడి నలుగురి దృష్టిని ఆకర్షించేవాళ్లే గెలుపు సాధిస్తారని ఎక్కువమంది అభిప్రాయం. అలా కాకుండా కేవలం తమ పని ఏదో తాము చేసుకుంటూ అవసరమైతే తప్ప తమ అభిప్రాయాలను వెల్లడించని అంతర్ముఖులు (ఇంట్రోవర్ట్స్) సాధించే విజయాలు తక్కువ కాదు. ఇవాళ (జనవరి 2) ప్రపంచ అంతర్ముఖుల దినోత్సవం. మీరు అంతర్ముఖులా? ఎలా తెలుస్తుంది. ఈ ప్రశ్నలకు ‘అవును’/ ‘కాదు’లలో ఏది చెప్పగలరో చూడండి. 1. మీరు గుంపులో ఉండటానికి ఇష్టపడరా? 2. చాడీలు, పుకార్లు కాకుండా మీకు ఇష్టమైన అంశం గురించే మాట్లాడటానికి ఇష్టపడతారా? 3. మీ చిన్నప్పుడు బంధువులొచ్చినా, ఫంక్షన్ల సమయంలో ఎక్కువగా మీరెక్కడున్నారో తెలియనట్టు మసలేవారా? 4. అప్పుడప్పుడు ఒంటరిగా మీ ఆలోచనల్లో మీరుండాలనిపిస్తుందా? 5. మీకు తక్కువగా, మృదువుగా మాట్లాడే మనిషి అనే పేరుందా? వీటి జవాబులు ‘అవును’ అయితే మీరు ఇంట్రావర్ట్ కిందే లెక్క. అయితే మానసిక నిపుణుల ప్రకారం ఎవరూ పూర్తిగా అంతర్ముఖత్వంతో, పూర్తిగా బహిర్ముఖత్వంతో ఉండరు. ఇరు స్వభావాలూ అందరిలో ఉంటాయి. అయితే ఒకటి ఎక్కువ పాళ్లల్లో ఉంటుంది. అంతర్ముఖత్వం ఎక్కువ పాళ్లల్లో ఉంటే మీరు అంతర్ముఖుల కిందే లెక్క. ఇవీ ప్లస్ పాయింట్స్ అంతర్ముఖులు తమ లోపలి నుంచి తాము శక్తిని పొందుతారు. వీరు ఎప్పుడూ తమ మనోభావాలను, ఆలోచనలను గమనించుకుంటూ ఉంటారు. నడిచి వచ్చిన దారిని బేరీజు వేసుకుని సరి చేసుకుంటూ ఉంటారు. ఒక పని మీద లక్ష్యం ఉంటుంది. చాలామటుకు నిరుపయోగమైన పనుల్లో కాలం వృథా చేయరు. మైనస్ పాయింట్స్ ఏ పనైనా సమర్థంగా చేయగలిగే శక్తి, నైపుణ్యం, ప్రతిభా ఉన్నా అది చేతలతో మాత్రమే చూపుతారు. మాటల వల్ల తెలియచేసి ముందుగా అవకాశం దొరకబుచ్చుకోరు. ఒకరిని పొగడటం, ఒకరితో పొగడ్త వినడం వీరికి దాదాపుగా రాదు. గుంపులను ఇష్టపడరు. వీరి నిశ్శబ్దాన్ని ఎదుటివారు పొగరుగా, నిర్లక్ష్యంగా భావించవచ్చు. నలుగురినీ తమ మాటలతో ఆకర్షించే ఎక్స్ట్రావర్ట్స్ను చూసి, వీరు అలా ఉండకపోవడం లోపమేమో అని బాధపడవచ్చు. స్త్రీలు ఇంట్రోవర్ట్స్ అయినప్పుడు ప్రపంచంలో బహిర్ముఖులు ఎంతమందో అంతర్ముఖులు అంతమంది ఉంటారు. అమ్మాయిలు తమ బాల్యంలో ఇంట్రోవర్ట్లుగా ఉంటే వీరికి తక్కువమంది స్నేహితులయ్యే అవకాశం ఉంది. తల్లితో, తోబుట్టువులతో తప్ప ఎక్కువమందితో మాట్లాడకపోవచ్చు. కాలేజీలో ఇలాంటి వారు కాలేజీలో ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంటారు. ఉద్యోగాల్లో వీరు చెప్పిన పని చేసుకునిపోయే వారవుతారు. గృహిణిగా ఎక్కువ మౌనంతో, తక్కువ మాటలతో సంసారాన్ని నిర్వహిస్తారు. అయితే వీటివల్ల ఏ నష్టమూ లేకపోయినా అనేక విషయాలు వీరికి నచ్చనప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తారు. వారు ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారో ఎదుటివారికి తెలియక సతమతమయ్యే స్థితి ఉంటుంది. కుటుంబ పరంగా, వృత్తిగతంగా, పిల్లల భవిష్యత్తు విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీరి నిర్ణయం బాగా ఆలస్యమయ్యి లేదా వెంటనే తేలక చిక్కులు రావచ్చు. ఏం చేయాలి? సుసాన్ కెయిన్ అనే అమెరికన్ రచయిత్రి ‘క్వైట్: పవర్ ఆఫ్ ఇంట్రావర్ట్’ అనే పుస్తకం రాసింది. అంతర్ముఖుల మౌనంలోనే వారి శక్తి ఉంటుంది. అదే సమయంలో భర్తతో/పిల్లలతో/ ఆఫీసు పరివారంతో కచ్చితమైన అభిప్రాయాలు వెల్లడి చేయాల్సి వచ్చినప్పుడు తప్పక వెల్లడి చేయాలి. ఇంట్లో కాసేపు ఒంటరిగా ఉండాలనిపించినప్పుడు ‘అలక/కోపం’ అనే భావన ఇతరులకు కలగకుండా ‘కాసేపు పుస్తకం చదువుకుంటాను’ అని చెప్పి ఏదో ఒక పుస్తకం పట్టుకుని గదిలో మీ ఆలోచనల్లో మీరు నిమగ్నం కావచ్చు. కుటుంబ సభ్యులు అందరూ కూడినప్పుడు మీరు తక్కువ మాట్లాడినా పూర్తి సమయం వారి సమక్షంలో ఉండేలా చూసుకోవాలి. -
'స్వార్థం కోసం సిద్దాంతాల్ని వదిలేశారు'.. విపక్ష భేటీపై ప్రధాని మోదీ ఫైర్..
ఢిల్లీ: దేశాభివృద్ధే తమ అజెండా అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశం కోసం పనిచేయడంలో వెనకడుగు వేయబోమని అన్నారు. తన శరీరంలో ప్రతి కణం.. ప్రతీ క్షణం దేశం కోసమే కేటాయించానని ప్రధాని చెప్పారు. ఎన్డీఏ భేటీ అనంతరం మాట్లాడిన మోదీ.. విపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగారు. తనను తిట్టేందుకు కేటాయించే సమయం.. దేశం కోసం కేటాయిస్తే బాగుండునని అన్నారు. చిన్న చిన్న స్వార్థాలతో విపక్షాలు సిద్ధాంతాలను పక్కన పెడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. నిత్యం విమర్శించుకునే వీళ్లంతా ఒక్కదగ్గరికి చేరుతారేమో గానీ ముందుకు సాగలేరని ప్రతిపక్షాలనుద్దేశించి ప్రధాని మోదీ చెప్పారు. కశ్మీర్లో ఎన్సీ, పీడీపీ రోజూ తిట్టుకుంటాయని అన్నారు. బంగాల్లో టీఎంసీ, కాంగ్రెస్, కమ్యునిస్టుల మధ్య ఎప్పుడూ గొడవలేనని చెప్పారు. PM Narendra Modi garlanded by National Democratic Alliance (NDA) leaders at the NDA meeting in Delhi. pic.twitter.com/jtGJ9XvFiF — ANI (@ANI) July 18, 2023 ఎన్డీఏ హిస్టరీ, కెమిస్ట్రీ తెలుసు.. ఎన్డీఏ హిస్టరీ, కెమిస్ట్రీ ప్రజలకు తెలుసని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో 250 చోట్ల తమకు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. నిజాయితీగా పనిచేశామని చెప్పిన మోదీ.. ఈ సారి కూడా అలాంటి ఓట్ షేర్‌నే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ హయాంలోనే దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని తెలిపారు. ఎన్నికల ఏడాది దేశ రాజకీయాలను విదేశాలు కూడా గమనిస్తాయని తెలిపిన మోదీ.. అధికారం ముగిసిపోయే పార్టీలతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పారు. కానీ భారత్‌తో అమెరికా, ఫ్రాన్స్ దేశాలు స్నేహం చేస్తున్నాయని తెలిపారు. ఇదీ చదవండి: కళ్లముందు కూటమి కనిపిస్తున్నా.. కలిసుండేది కష్టమే.. ఎవరి లెక్కలు వారివి.. ఎన్డీఏ భేటీ.. 2024కు ముందు దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నేడు బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రోజు ఢిల్లీలోని అశోక హోటల్లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. National Democratic Alliance (NDA) leaders pose for a group photograph ahead of their meeting in Delhi. A total of 38 political parties are attending the meeting. pic.twitter.com/KVG1j6QIwj — ANI (@ANI) July 18, 2023 భారతావని అంతటా విస్తరించి ఉన్న తమ కూటమి భాగస్వాములతో నేడు సమావేశం జరగనుండటం సంతోషంగా ఉందని భేటీకి ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరడానికి, దేశ అభివృద్ధికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముందు కూటమిలో ఉన్న పార్టీల నేతలు ప్రధాని మోదీకి పూల మాలతో సత్కరించారు. PM Narendra Modi garlanded by National Democratic Alliance (NDA) leaders at the NDA meeting in Delhi. pic.twitter.com/jtGJ9XvFiF — ANI (@ANI) July 18, 2023 అయితే.. ఎన్డీఏ కూటమికి హాజరైన పార్టీలు చాలావరకు చిన్న పార్టీలు. తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలు కాగా.. మరికొన్నింటికి అసలు ఎంపీలే లేరు. ఏదైమైనా.. ఈ భేటీతో వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో తేల్చుకునే అవకాశంగా ఈ భేటీని చిన్న పార్టీలు భావిస్తున్నాయి. #WATCH | National Democratic Alliance (NDA) meeting to chalk out a joint strategy to take on opposition alliance 'INDIA' in the 2024 Lok Sabha polls, begins in Delhi A total of 38 political parties are attending the meeting. pic.twitter.com/MDogidlRc6 — ANI (@ANI) July 18, 2023 దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతదేశంతో సహా ప్రధాన రాష్ట్రాల్లో తన స్థానం నిలుపుకుంది. ఉత్తరప్రదేశ్, బిహార్‌లాంటి రాష్ట్రాల్లో పట్టు నిలుపుకోవడానికి తగిన అన్ని చర్యలు చేపడుతోంది. NDA meeting in Delhi. #NDAMeeting pic.twitter.com/SmNCx8aW6c — Sai Meghana Maddela (@MeghanaMaddela) July 18, 2023 ఇదీ చదవండి: విపక్షాల కూటమికి నాయకుడు ఎవరు..? తేల్చేది ఎవరు..? పెదవి విప్పిన ఖర్గే.. -
Karnataka CM Race: సిద్ధూ వర్సెస్ డీకే
బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేసులో ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలన్న ఆకాంక్షను వారిద్దరూ ఏమాత్రం దాచుకోవడం లేదు. పరస్పరం గట్టిగా పోటీ పడుతున్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏమున్నదో అంతుబట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకుల బలాలు, బలహీనతలు, వారికి ఉన్న అవకాశాలు ఏమిటో చూద్దాం.. సిద్ధరామయ్య బలాలు ► మాస్ లీడర్‌గా రాష్ట్రవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు. ► మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు. ► 2013 నుంచి 2018 పూర్తిస్థాయిలో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం. ► ఏకంగా 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిపాలనలో విశేష అనుభవం ఉంది. ► మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితుల్లో ఆదరణ. ► బీజేపీ, జేడీ(ఎస్)లను గట్టిగా ఎదుర్కొనే సామర్థ్యం. ► రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం. ► రాహుల్ గాంధీ నుంచి లభిస్తున్న అండదండలు. బలహీనతలు ► కాంగ్రెస్ పార్టీతో సంస్థాగతంగా పెద్దగా అనుబంధం లేకపోవడం. ► 2018లో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించలేకపోవడం. ► జేడీ(ఎస్) నుంచి వచ్చిన ఆయన్ను బయటి వ్యక్తిగానే ఓ వర్గం చూస్తుండటం. ► వయసు 75 ఏళ్లు. ► వృద్ధాప్యం సమీపిస్తుండడం. అవకాశాలు ► ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపే, అందిరినీ కలుపుకొనేపోయే తత్వం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలంటే సిద్ధూ వంటి అనుభవజ్ఞుడు కావాలని అధిష్టానం భావిస్తుండడం. ► డీకే శివకుమార్‌పై ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు. ► తనకు ఇదే చివరి ఎన్నిక అని సిద్ధూ ప్రకటించినందున మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇదే చివరి అవకాశం కావడం. డీకే శివకుమార్ బలాలు ► సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. బలమైన సంస్థాగత సామర్థ్యాలు. ► అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించి పెట్టడం. ► పార్టీ నాయకత్వానికి విధేయుడిగా పేరు. ► కష్ట కాలంలో ట్రబుల్ షూటర్‌గా అందించిన సేవలు. ► పుష్కలమైన ఆర్థిక వనరులు కలిగిన నాయకుడు. ► బలమైన తన సొంత సామాజిక వర్గం ఒక్కళిగల మద్దతు. ► సోనియా కుటుంబంతో సాన్నిహిత్యం. ► వయసు కేవలం 61 ఏళ్లు. ఆరోగ్యం మెరుగ్గా ఉండడం. ► మంత్రిగా శాఖలను నిర్వర్తించిన అనుభవం. బలహీనతలు ► వెంటాడుతున్న ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు. న్యాయ పోరాటం చేయాల్సి రావడం. ► తిహార్ జైలులో కొన్నిరోజులపాటు శిక్ష అనుభవించడం. ► రాష్ట్రమంతటా కాకుండా పాత మైసూర్కే తన ప్రాబల్యం పరిమితం కావడం. ► ఒక్కళిగలు మినహా ఇతర సామాజిక వర్గాల మద్దతు ఆశించిన స్థాయిలో లేకపోవడం. అవకాశాలు ► పాత మైసూర్లో కాంగ్రెస్‌కు ప్రజాదరణ దక్కడం వెనుక కృషి శివకుమార్‌దే. ► కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండడం. ఎస్ఎం కృష్ణ, వీరేంద్ర పాటిల్ పీసీసీ అధ్యక్షులుగా ఉంటూ ముఖ్యమంత్రులయ్యారు. ► కాంగ్రెస్‌లోని పాత తరం నాయకుల ఆశీస్సులు లభిస్తుండడం. -
నమ్మకం ఉంటే చాలు: ఆనంద్ మహీంద్ర మోటివేషనల్ వీడియో
సాక్షి, ముంబై: మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్, పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర మరో స్ఫూర్తి దాయకమైన వీడియోను షేర్ చేశారు. ఎపుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆయన విజ్ఞాన, వినోద, ఆధునిక టెక్నాలజీ.. ఇలా ఒకటేమిటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోను, విషయాలను తన ఫోలోవర్స్‌తో పంచుకోవడం అలవాటు. తాజాగా ఆయన చేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. (మహీంద్రా ఇ-రిక్షా నడిపిన బిల్ గేట్స్ వీడియో వైరల్, ఆనంద్ మహీంద్ర స్పందన) నీటిపై ఒక గుర్రం శరవేగంతో పరుగులు తీస్తున్న అందమైన వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విటర్లో పోస్ట్ చేశారు. ఏ పని చేయాలన్నా మన మీద మనకి నమ్మకం ఉండాలి. విశ్వాసం ఉంటే మీరు నీటిపై కూడా నడవవచ్చు. అంతా మన సంకల్పంలోనే ఉంది. మన మనసులోనే ఉంది. సో.. మీ కలసాకారం కోసం ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేయండి అంటూ మండే మోటివేషన్ సందేశాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. అయితే దీనిపై కొంతమంది విభిన్నంగా స్పందించారు. అలాంటి ఒక యూజర్ కమెంట్, వీడియోకు స్పందించిన ఆయన నీటిపై నడవడానికి ప్రయత్ని స్తున్నప్పుడు మల్టీ టాస్కింగ్ చేయవద్దు అంటూ చురకలంటించారు. You too can walk on water if you believe you can. It’s all in the mind. 😊 Start your week believing in yourself and your aspirations. #MondayMotivation pic.twitter.com/qh6h3mEVtw — anand mahindra (@anandmahindra) March 6, 2023 😄 Moral of the story: Don’t Multi-task when trying to walk on water. https://t.co/pHLTrHQhTZ — anand mahindra (@anandmahindra) March 6, 2023 -
శతక నీతి – సుమతి: క్షణంలో పిడికెడు బూడిదగానే మిగిలిపోవచ్చు !!!
శంకర భగవత్పాదులు అంటారు..‘‘మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలస్సర్వం, మాయామయమితి సర్వం హిత్వా బ్రహ్మ పదం త్వాం ప్రవిశ విదిత్వా’’. మా కురుధన... డబ్బు ఉంటుంది, లక్షాధికారులు భిక్షాధికారులయిన రోజులున్నాయి. ఎంతో ఐశ్వర్యవంతులు కటిక దరిద్రాన్ని అనుభవించిన వారున్నారు. జనం నా వెనుక ఇంతమంది ఉన్నారు అన్నవాడి వెనుక ఉండేవారులేక.. జారిపోయిన వారు ఎక్కువమంది ఉన్నారు. యవ్వన సర్వం... ఇంత బలవంతుణ్ణి–యవ్వనంలో ఉన్నానంటాడు. గిర్రున పాతికేళ్ళు తిరిగేసరికి పటుత్వం సడలి, సంధిబంధములు జారిపోయి వృద్ధాప్యం ఆవహిస్తుంటుంది. హరతి నిమేషాత్ కాలస్సర్వం – కాలం చాలా తినేస్తుంది. నాకు తిరుగులేదు అన్న ఆరడుగుల నిండు మనిషి చివరకు రుద్రభూమిలో పిడికెడు బూడిద కింద మారిపోతాడు. ఎందుకీ అతిశయం? వినయంగా ఉండడం నేర్చుకో.. నీలో ఎన్ని మంచి గుణాలున్నా, నిస్సహాయ స్థితిలో ఉండి నీ వల్ల బాధలకు గురయినవారందరూ ఒకనాడు నీ పని పడతారు. అపకీర్తి మూటగట్టుకుని వెళ్లిపోతావు. భారతంలో దుర్యోధనుడి సంగతే చూడండి... ‘ఆ పాండవులెంత, ఆ భీముడెంత, ఆ అర్జునుడెంత... చిటికెలో చంపేస్తా... నాదగ్గర భీష్ముడున్నాడు, కర్ణుడు, ద్రోణుడున్నాడు, నాకింతమంది సోదరులున్నారు. నాకిన్ని అక్షౌహిణుల సైన్యం ఉంది...’ అంటూ విర్రవీగేవాడు. ఆయనకు మంచి మాటలు చెప్పనివారెవరు, అందరూ చెప్పారు. కానీ వినలేదు. వినకపోగా చెప్పేవాళ్ళను అవమానించేలా ప్రవర్తించేవాడు. చివరికి రాయబారం చేయడానికి వచ్చిన కృష్ణుడిని కూడా బంధించబోయాడు. ఒకరోజు మైత్రేయ మహర్షి వచ్చాడు. ‘తప్పు దుర్యోధనా! పాండవులు ధర్మమార్గంలో ఉన్నవాళ్ళు. వాళ్ళతో నీకు గొడవలెందుకు, వాళ్లకివ్వాల్సిన రాజ్యభాగం ఇచ్చేయి.’’ అని నచ్చచెప్పబోయాడు. ప్రతిరోజూ ఎవడో ఒకడు రావడం ధర్మపన్నాలు వల్లించడం అలవాటయిపోయిందంటూ మహర్షి మాట్లాడుతున్నప్పుడు వెటకారంగా తొడల మీద తాళం వేస్తున్నట్లు చెయ్యి తిప్పుతున్నాడు. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘‘నేను వ్యయప్రయాసలకోర్చి నీ మంచి కోరి నీకు నాలుగు మంచిమాటలు చెప్పిపోదామని వస్తే శ్రద్ధతో వినకపోగా ఎగతాళి చేస్తూ, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు. ఏ తొడలను తక్కువగా భావించి వాటిమీద వెకిలిచేష్టలు చేసావో ఆ తొడలే భీమసేనుడి చేతిలో చితికిపోయి యుద్ధభూమిలో పడిపోయెదవుగాక!’’ అని శపించాడు. హడిలిపోయి ధృతరాష్ట్రుడు వెళ్ళి మైత్రేయ మహర్షి కాళ్ళమీద పడ్డాడు, శాపాన్ని ఉపసంహరించుకోమని కోరుతూ. ‘‘పాండవులతో నీ కొడుకు సంధి చేసుకుంటే ఆ శాపం అన్వయం కాదు, చేసుకోకపోతే ... చెప్పిన మాట వినలేదు కాబట్టి జరగాల్సింది జరుగుతుంది’’ అన్నాడు మహర్షి. ఏమయింది... అదే జరిగింది. బలవంతుడ నాకేమని విర్రవీగినందుకు ఫలితం అది...తన బలం, బలగం అనుకొన్నవారిలో ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, సోదరులు అందరూ వెళ్ళిపోయారు.. ఓ నలుగురు తప్ప. యుద్ధభూమిలో భీముడి గదాఘాతానికి తొడలు విరిగిపోయి, నెత్తురు ఓడుస్తుండగా అప్పుడు ఏడ్చాడు. రుషులు చెబితే వినలేదు, విదురుడు చెప్పినా వినలేదు... చివరకు అందర్నీ చంపేసుకొన్నా...అంటూ తన దుస్థితిని తలుచుకుని విలపించాడు. ఎందుకంత పొగరుబోతుతనం... ధనం కానీ, అధికారం గానీ, ఇతరత్రా నైపుణ్యాలు, పాండిత్యం కానీ నీకు భగవంతుడేదో ఇచ్చి ఉండవచ్చు.. అది కాస్త ఎక్కువే ఇచ్చి ఉండవచ్చు. అవి ఇచ్చినందుకు భగవంతుడిపట్ల వినయ విధేయతలతో కృతజ్ఞుడిగా ఉండడానికి బదులు, నీ బలం చూసుకొని అహంకారంతో వదరి మాట్లాడడం అత్యంత ప్రమాదకరం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ వాటా ఇదీ.. ప్రత్యేకతలెన్నో.. ఎన్నిక ఇలా..
సాక్షి, అమరావతి: భారతదేశంలో అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి ఎన్నిక అంటే ఓటింగ్‌పైనే అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నిక సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉండడంతో పాటు పార్లమెంటు సభ్యులు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉండడం గమనార్హం. పైగా అన్ని రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా పాలుపంచుకునే రాష్ట్రపతి ఎన్నికలు త్వరలో జరగనున్నందున అందులో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏమిటనే దానిపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చదవండి: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇందులో 151 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, 23 మంది టీడీపీకి చెందినవారు కాగా, ఒకరు జనసేనకు చెందిన వారు. ఇక ఎంపీల విషయానికొస్తే రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 25 ఉండగా, ఇందులో 22 మంది వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీలు, ముగ్గురు టీడీపీకి చెందిన ఎంపీలున్నారు. రాజ్యసభ స్థానాలు 11 ఉండగా ఇందులో వైస్సార్సీపీకి చెందిన ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఇలా.. దేశాధ్యక్షుడి ఎన్నిక ఇతర సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన ఎంపీలు, రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలకు కూడా ఓటు ఉంటుంది. ఒక ఎంపీ ఓటు విలువను మొత్తం ఎన్నికైన రాష్ట్ర ఎమ్మెల్యేలు/ఎన్నికైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో లెక్కిస్తారు. ఆ లెక్కన ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా ఉంది. ఏపీలో 36 మంది ఎంపీలు (లోక్‌సభ+రాజ్యసభ) ఉండగా వారి మొత్తం ఓటు విలువ 25,488గా ఉంది. ఎమ్మెల్యే ఓటు విలువను రాష్ట్జ జనాభా/మొత్తం ఎమ్మెల్యేలు 1000గా (జనాభాను 1971 లెక్కల ప్రాతిపదికగా తీసుకున్నారు) లెక్కిస్తారు. ఆ లెక్కన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159గా ఉంది. రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 27,825గా ఉంది. అంటే రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ 53,313గా ఉంది. ఇక జమ్మూ అండ్ కశ్మీర్ అసెంబ్లీని రద్దుచేయడంతో ఆ మేరకు ఎంపీ ఓటు విలువ తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 708 నుంచి 700కు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధాన పాత్ర వైఎస్సార్సీపీదే.. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధికంగా ఓటు వేసేది అధికార వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే. ఈ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు 22 మంది, రాజ్యసభలో మరో 9 మంది ఎంపీలకు కలిపి మొత్తం ఓటు విలువ 21,948 కాగా, 151 మంది ఎమ్మెల్యేలకు 24,009 ఓటు విలువ ఉంది. అంటే రాష్ట్రం నుంచి ఉన్న మొత్తం 53,313 ఓటు విలువలో వైఎస్సార్సీపీ 45,957 ఓటు విలువ పంచుకోనుంది. -
పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో, దేశ అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో 34 మంది జడ్జీలతో పనిచేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు కేంద్ర న్యాయశాఖ రెండు రోజుల్లోనే ఆమోదం తెలిపింది. ఈ మేరకు.. గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాన్షు ధులియా, గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ జంషెడ్ బి పార్దివాలాల నియామకాలను ఆమోదిస్తూ శనివారం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వచ్చే వారం వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యంతో 34 మంది జడ్జీలతో పనిచేయనుంది. 1965లో జన్మించిన జస్టిస్ పార్దివాలా 1990లో గుజరాత్ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని ఓ కుగ్రామంలో 1960లో పుట్టిన జస్టిస్ ధులియా 1986లో అలహాబాద్ హైకోర్టులో లాయర్‌గా జీవితం ప్రారంభించారు. చదవండి: (భారత్ ప్రతిష్టను దెబ్బతీసేయత్నం.. డబ్ల్యూహెచ్ఓ ప్రకటనపై మంత్రుల ఆగ్రహం) -
Russia vs Ukraine: బాహుబలితో తలపడగలదా?
Military Strengths of Russia and Ukraine, Compared: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక బలం కలిగిన దేశాల్లో ఒకటైన రష్యా ముందు ఉక్రెయిన్ నిలబడడమే కష్టం. రెండు దేశాల మిలటరీ బలాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రష్యా బాహుబలి అయితే, దాని ముందు ఉక్రెయిన్ ఒక మరుగుజ్జు కిందే లెక్క. 2014లో రష్యా క్రిమియాని ఆక్రమించుకున్నప్పటితో పోల్చి చూస్తే ఉక్రెయిన్ మిలటరీ బాగా బలపడింది. సైన్యం బాగా శిక్షణ పొంది గట్టి పోరాట పటిమను ప్రదర్శిస్తోంది. గత కొద్ది వారాలుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యాన్ని మూడు వైపుల నుంచి మోహరించారు. క్షిపణి వ్యవస్థలో ప్రపంచంలోనే రష్యా కింగ్. ఉక్రెయిన్ రక్షణ స్థావరాలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే క్షిపణులు రష్యా దగ్గర ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయుధ మార్కెట్‌ను పరిశీలించే స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) గణాంకాల ప్రకారం రక్షణ బడ్జెట్‌పై ఉక్రెయిన్ వ్యయంతో పోల్చి చూస్తే రష్యా 10 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తోంది. 2020లో రష్యా రక్షణ రంగంపై 6,170 కోట్ల డాలర్లు ఖర్చు పెడితే, ఉక్రెయిన్ 590 కోట్ల డాలర్లు వెచ్చించింది. ప్రపంచ దేశాల సైనిక బలాబలాలను విశ్లేషించే గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం మిలటరీ పవర్లో 140 దేశాల్లో రష్యాది రెండో స్థానమైతే, ఉక్రెయిన్ 22వ స్థానంలో ఉంది. యుద్ధ భయంతో ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీ ఈ మధ్య కాలంలో మిలటరీ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఉక్రెయిన్ సైనిక సిబ్బందిని 3,61,00కి పెంచారు. చదవండి: ('ఇది వినాశనానికే.. రష్యాకు ఏ మాత్రమూ మేలు చేయదు') ఉక్రెయిన్‌కి పశ్చిమ దేశాల అండ ఇలా.. పశ్చిమాది దేశాలు రష్యాపై విమర్శలు గుప్పిస్తూ ఉక్రెయిన్‌కి అండగా ఉంటామని చెబుతున్నాయి. అయితే ఉక్రెయిన్ ఆయుధాలతో పాటుగా సైనిక బలగాలను ఇతర దేశాల నుంచి ఆశిస్తోంది. అమెరికా 2014 నుంచి ఉక్రెయిన్ మిలటరీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సహకారం అందిస్తూ వస్తోంది. 250 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ఇప్పటివరకు చేసింది. గత డిసెంబర్ నుంచి జావెలిన్ యాంటీ ట్యాంకు క్షిపణులు, నిఘా నౌకలు, హమ్వీస్, స్నిపర్ రైఫిల్స్, డ్రోన్లు, రాడార్ వ్యవస్థ, నైట్ విజన్, రేడియో పరికరాలు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్స్ , ఆయుధాలు, మరబోట్లు వంటివి సరఫరా చేసింది. ప్రస్తుతం తమ దేశం నుంచి ఎలాంటి బలగాలు పంపించబోమని అమెరికా స్పష్టం చేసింది. గత మూడు నెలల్లో దాదాపుగా 90 టన్నుల ఆయుధాలను అమెరికా పంపింది. దీంతో ఉక్రెయిన్ దగ్గరున్న మిలటరీ ఆయుధాలు 1300 టన్నులకు చేరుకున్నాయి. బ్రిటన్ 2,000 షార్ట్ రేంజ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్‌ని పంపడంతో పాటు వాటిని వినియోగించడంలో శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక నిపుణుల్ని కూడా పంపించింది. టర్కీ బేరట్కార్ టీబీ2 డ్రోన్లను విక్రయించింది. ఎస్టోనియా జావెలిన్ యాంటీ ఆర్మర్ క్షిపణులు, లుథానియా స్ట్రింగర్ క్షిపణులు, చెక్ రిపబ్లిక్ 152ఎంఎం ఫిరంగులు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. జర్మనీ ఆయుధాలు సరఫరా చేయడానికి నిరాకరించినప్పటికీ, యుద్ధభూమిలో ఆస్పత్రులు, ఇతర శిక్షణ కోసం 60 లక్షల డాలర్ల ఆర్థిక సాయం చేయడానికి అంగీకరించింది. చదవండి: (Russia- Ukraine war: తెల్లవారుతూనే నిప్పుల వాన) -
రష్యా ముందు పసికూన ఉక్రెయిన్ నిలుస్తుందా?.. బలబలాలు ఇవే..!
రష్యా ఉక్రెయిన్ల మధ్య పరిస్థితులు తీవ్ర రూపం దాల్చి సమస్య సద్ధమణిగిందని అనుకునేలోపే యుద్ధం వరకు వెళ్లింది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయన్‌పై మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నట్లు ప్రకటించి యుద్ధానికి తెర లేపారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుంటే సహించేది లేదంటూ గట్టి సంకేతాలే పంపారు. చర్చలతో ముగుస్తుందనుకున్న ఈ సమస్య కాస్త వార్ వరకు వెళ్లింది. సాధారణంగా యుద్ధమంటే ఇద్దరు సమ ఉజ్జీలుగా మధ్యనో లేదా కాస్త అటు ఇటు బలం ఉన్న వారి మధ్య జరుగుతుంది. కానీ ఈ దేశాల బలబలాను పరిశీలిస్తే.. రష్యా ఉక్రెయిన్ మధ్య అంతర్యం చాలానే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వాటిని ఓ లుక్కెద్దాం! -
ఫిజియోతో కండరాలకు బలం పెంచుకోవడం ఎలా?
కొందరు కరోనా రోగులు తమ చికిత్సతో భాగంగా హాస్పిటల్లో ఒకింత ఎక్కువ రోగులు గడపాల్సి రావచ్చు. ఆ తర్వాత కూడా తాము కోలుకునేవరకు ఇంట్లోనూ చాలాకాలం పాటు బెడ్ రెస్ట్‌లో ఉండి... కేవలం మంచానికే పరిమితం కావాల్సి రావచ్చు కూడా. ఇలాంటివారు తమ కండరాల శక్తిని తాత్కాలికంగా కోల్పోయే అవకాశం ఉంది. వారు మునుపటిలా తమ శక్తిని పెంచుకునేందుకూ, పుంజుకునేందుకు డాక్టర్లు ఫిజియోధెరపీ వ్యాయామాలను సిఫార్సు చేస్తారు. అలాంటి వారు చేయాల్సిన ఫిజియో వ్యాయామాలలో ప్రధానమైనవి ఇవే... వీటిని కరోనా రోగులే గాక ఆరోగ్యవంతులు కూడా చేయవచ్చు. సీటెడ్ నీ ఎక్స్టెన్షన్ కుర్చీలో నిటారుగా ఉంటూ... కాళ్లు కిందకు వేలాడేలా కూర్చోవాలి. ∙ఒక కాలిని మోకాలిని మెల్లగా పైకి లేపుతూ కాలు స్ట్రెయిట్‌గా ఉండేలా లేపాలి. ఇలా లేపి ఉంచిన కాలిని 10 సెకండ్లపాటు అలాగే నిలబెట్టి ఉంచాలి. ∙ఆ తర్వాత రెండో కాలినీ లేపి, దాన్ని కూడా 10 సెకండ్లపాటు నిలబెట్టి ఉంచాలి. ఈ వ్యాయామాన్ని 10 రిపిటేషన్లతో చేయాలి. సీటెడ్ హిప్ ఫిక్సేషన్... కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. రెండుకాళ్లూ నేలకు ఆనించి ఉంచాలి. ∙ఒక కాలిని తొడ దగ్గర బలం ఉపయోగిస్తూ లేపుతూ... మోకాలి కిందిభాగం నుంచి కాలు అలాగే వేలాడుతూ ఉంచేలా... కేవలం తొడ భాగం మాత్రమే కుర్చీ నుంచి పైకి లేపాలి. ∙ఇప్పుడు రెండో కాలినీ ఇలాగే లేపాలి. ∙ఇలా రెండు కాళ్లూ మార్చి మార్చి లేపుతూ... మార్చ్ఫాస్ట్ చేస్తున్నట్టు తొడల దగ్గర కాళ్లు లేపుతూ ఉండాలి. సిట్ టు స్టాండ్ : ∙వీపును నిటారు గా ఉంచుతూ కుర్చీ అంచున కూర్చోవాలి. చేతులు రెండింటినీ నేలకు సమాంతరంగా ఉండేలా పైకి లేపాలి. ∙అలాగే నెమ్మదిగా పైకి లేవాలి. ∙ఇలా చేయడం చాలా తేలిగ్గా ఉందని మీకు అనిపిస్తూ మీరు మరింత తక్కువ ఎత్తు ఉండే కుర్చీని ఎంచుకుని అందులోంచి కూర్చుని పైకి లేస్తూ ఉండే వ్యాయామాన్ని రిపిటీషన్లతో చేయాలి. షోల్డర్ ప్రెస్ : మీరు కూర్చుని గానీ లేదా నిల్చుని గానీ ఈ వ్యాయామాన్ని చేయవచ్చు. మీ రెండు చేతులూ పై వైపునకు ఉండేలా ఎత్తాలి. ∙ఆ తర్వాత రెండు చేతులను మోచేతుల దగ్గర మడుస్తూ పై వైపునకు గాలిలో బలంగా కదిలిస్తూ గాలిలో పంచ్‌లు ఇవ్వాలి. ∙మీకు ఈ వ్యాయామం తేలిగ్గా అనిపిస్తే చేతిలో కొంత బరువు ఉండేలా తేలికపాటి డంబెల్స్తోనూ చేయవచ్చు. కష్టంగా అనిపిస్తే తేలికపాటి డంబెల్స్ లేకుండా / పంచ్‌లు కూడా ఇవ్వకుండా తేలిగ్గా మోచేతుల దగ్గర ముడిస్తూ, మళ్లీ చేతులు స్ట్రెయిటెన్ చేస్తూ కూడా వ్యాయామం చేయవచ్చు. షోల్డర్ స్ట్రెంతెనింగ్ : కుర్చీలో నిటారుగా కూర్చోండి. ∙రెండు అరచేతులూ ఒకదానికి మరొకటి ఎదురుగా వచ్చేలా చేతులు స్ట్రెయిట్ గా ముందుకు చాచండి. ముందుకు ఉన్న ఆ రెండు చేతులనూ క్రమంగా పక్కలకు తెండి. మళ్లీ ముందుకు తెండి. ∙ఈ వ్యాయామం తేలిగ్గా అనిపిస్తే... రెండు చేతుల్లోనూ తేలికపాటి డంబెల్స్ ఉంచుకుని కూడా చేయవచ్చు. సీటెడ్ ట్రైసెప్ డిప్స్ హ్యాండ్ రెస్ట్ ఉన్న ఓ కుర్చీని తీసుకుని ఆ కుర్చీలో నిటారుగా కూర్చోండి. ఇప్పుడు మీ చేతులతో హ్యాండ్ రెస్ట్‌ను పట్టుకుని... దానిపై ఒత్తిడి వేస్తూ చేతులు రెండూ మోచేయి దగ్గర స్ట్రెయిట్ అయ్యేంతవరకు కుర్చీలో లేవండి. ∙ఆ తర్వాత మళ్లీ కూర్చుని మళ్లీ లేస్తూ... మీకు వీలైనన్ని రిపిటీషన్లు చేయండి. బ్రిడ్జింగ్ : మీ పడక మీద లేదా నేల మీద వెల్లకిలా పడుకోండి. మోకాళ్లను కొంత మడిచి ఉంచండి. మీ అరికాళ్లతో నేలను బలంగా తంతున్నట్లుగా బలం ఉపయోగించి మీ నడుము భాగాన్ని పైకి ఎత్తుండి. పైకెత్తిన నడుము భాగాన్ని దించుతూ... మళ్లీ ఎత్తుతూ... రిపిటీషన్స్‌తో ఈ వ్యాయామాన్ని చేయండి. సైడ్–వే లెగ్ లిఫ్ట్ : ఓ పక్కకు తిరిగి పడుకుని నేలకు ఆని ఉన్న కాలిని మోకాలి దగ్గర సౌకర్యంగా కాస్త ఒంచి ఉంచండి. ∙నేలకు దూరంగా ఉన్న కాలిని మెల్లగా వీలైనంతవరకు పైకి ఎత్తండి. ఇలా కాలిని ఎత్తుతూ... దించుతూ మీకు వీలైనన్ని రిపిటీషన్స్ చేయండి. ∙ఇప్పుడు మరో వైపునకు ఒరిగి మళ్లీ అనే రిపిటీషన్స్‌తో రెండోకాలితో వ్యాయామాన్ని చేయండి. స్ట్రెయిట్ లెగ్ రెయిజ్ : ∙నేల మీద లేదా పడక మీద వెల్లకిలా పడుకోండి. ఒక కాలిని మోకాలి దగ్గర ఒంచి... మరో కాలిని స్ట్రెయిట్‌గా ఉంచండి. ∙స్ట్రెయిట్‌గా ఉన్న కాలిని మెల్లగా వీలైనంతవరకు పైకి ఎత్తండి. ఆ తర్వాత దించండి. ఇలా ఎత్తుతూ... దించుతూ వీలైనన్ని రిపిటీషన్స్ చేయండి. ∙ఇప్పుడు మరో కాలిని వంచి అలాగే... ఇంకో కాలిని స్ట్రెయిట్ చేసి ఇదే వ్యాయామాన్ని అన్నే సార్లు రిపీట్ చేస్తూ... అనే రిపిటీషన్స్‌తో చేయండి. - డాక్టర్ వినయ్‌కుమార్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ -
బాధితుడిగా భావించడం లేదు!
న్యూఢిల్లీ: పదునైన వేగం, అన్ని పిచ్‌లపై చెలరేగే సత్తా ఉన్నా ఉమేశ్ యాదవ్‌కు ఇతర భారత పేస్ బౌలర్లతో పోలిస్తే తగినన్ని అవకాశాలు రావడం లేదు. వన్డేల్లో చాలా కాలంగా జట్టుకు దూరమైన అతను టెస్టుల్లో కూడా ఇషాంత్, షమీ, బుమ్రాల జోరులో రిజర్వ్ స్థానానికే పరిమితం కావాల్సి వస్తోంది. చాలా సందర్భాల్లో అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదు. అయితే తానేమీ బాధ పడటం లేదని, అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవడం తన పని అని అతను వ్యాఖ్యానించాడు. 2018నుంచి చూస్తే ఉమేశ్ 10 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. వీటిలో అతను 45 వికెట్లు పడగొట్టాడు. ‘ఈ విషయంలో నన్ను నేను బాధితుడిగా భావించుకోవడం లేదు. కొన్ని సార్లు ఆడతాం. కొన్ని సార్లు ఆడలేమంతే. నిజాయితీగా చెప్పాలంటే మానసికంగా నేను చాలా దృఢంగా ఉంటాను. ఇలాంటి సమయంలో అది ఎంతో ముఖ్యం. మ్యాచ్‌లో ఎవరికైన్నా అవకాశం దక్కవచ్చు. ఫామ్, పిచ్, వాతావరణ పరిస్థితులు... ఇలా ఒక బౌలర్‌ను తీసుకునేందుకు ఎన్నో కారణాలుంటాయి. కాబట్టి దాని గురించి అతిగా ఆలోచించను. మ్యాచ్‌లో అవకాశం దక్కనప్పుడు కూడా నా ఆటను మరింత మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెడతా. ఇలాంటి సమయంలో ఎవరి దగ్గరికో వెళ్లి సలహాలు అడగను’ అని ఉమేశ్ యాదవ్ చెప్పాడు. లాక్డౌన్ సమయంలో శరీర దారుఢ్యాన్ని పెంచుకునేందుకు స్ట్రెంత్ ట్రైనింగ్‌పైనే దృష్టి పెట్టినట్లు అతను వెల్లడించాడు. -
కోహ్లి దళం... గెలుస్తుందా హృదయం?
ఔను... కప్ అంచనాల్లో కోహ్లి సేనకు సరిగ్గా సరిపోయే పదం ఇది. అదరగొట్టే ఆటకు తోడు సొంతగడ్డ కాబట్టి ఇంగ్లండ్ భీకరంగా కనిపిస్తోంది. అనూహ్యంగా పుంజుకొన్న ఆస్ట్రేలియా సరైన సమయానికి ఊపులోకొచ్చింది. ప్రపంచ అత్యుత్తమ ఓపెనర్లు, నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి, విశేష అనుభవజ్ఞుడైన ధోనిలాంటి వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్, పేస్ ఆల్‌రౌండర్లు, నాణ్యమైన పేస్ త్రయం, మణికట్టు స్పిన్నర్ల కూర్పు కారణంగా భారత్ మాత్రం మొదటి నుంచి ఒకే తరహా ప్రదర్శనతో పోటీలో ఉంది. ఈ జట్టు కప్ కొట్టాలంటే కావాల్సిందల్లా... అలసత్వానికి తావివ్వకుండా, చిన్నచిన్న లోపాలు సరిచేసుకుంటూ పోవడమే. ఈ క్రమంలో గత అనుభవాలు, మరీ ముఖ్యంగా ఇక్కడే జరిగిన 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పరాజయాన్ని గుణపాఠంగా తీసుకుని పొరపాట్లకు అవకాశం లేకుండా ముందుకెళ్లాలి. అన్ని రంగాల్లో బలంగా ఉన్నామని... నిలకడగా ఆడుతున్నామని... ఇలా పైకి ఎంత చెప్పుకొన్నా... 1983 నాటి (వేదిక ఇంగ్లండ్) సమష్టి గెలుపును మినహాయిస్తే విదేశంలో ప్రపంచ కప్ అనగానే టీమిండియా టైటిల్ నెగ్గే అవకాశాలు కొంచెం అనుమానమే అన్నట్లుంటాయి. 2003 (దక్షిణాఫ్రికా)లో ఫైనల్ చేరినా ఆటతీరులో ఆస్ట్రేలియాను అందుకోలేక చేతులెత్తేసింది. 2015 (ఆస్ట్రేలియా)లో సెమీఫైనల్స్‌లోనూ ఇదే పరిస్థితి. ఇవికాక విదేశాల్లో జరిగిన మిగతా కప్‌లలో మన ప్రదర్శన సాదాసీదానే. దీన్నిబట్టి చూస్తే ఇంగ్లండ్‌లో జరుగబోయే ప్రపంచకప్ టోర్నీలో కోహ్లి సేన కప్ సాధిస్తే చరిత్ర తిరగరాసినట్లే. ఈ నేపథ్యం లో భారత జట్టు బలాబలాలు, బలహీనతలు, సరిదిద్దు్దకోవాల్సిన లోపాలు ... ప్రత్యర్థులపై పైచేయికి ఏం చేయాలి? అనే దానిపై సభ్యుల వారీగా విశ్లేషణ... –సాక్షి క్రీడా విభాగం విరాట్ కోహ్లి బలాలు: భూతద్దం పెట్టి వెదికినా లోపాలు కనిపెట్టలేని టెక్నిక్, తిరుగులేని సాధికారత, దూకుడు కలగలిసిన బ్యాట్స్‌మన్. జట్టు బ్యాటింగ్ మూలస్తంభం. లక్ష్యాల ఛేదనలో మొనగాడు. కెప్టెన్‌గానూ బాధ్యతలు మోస్తున్నా ఆ ప్రభావం బ్యాటింగ్‌పై ఏమాత్రం లేనట్లు ఆడతాడు. బలహీనతలు: ఎప్పుడో ఒకసారి విఫలం కావడం తప్ప పెద్దగా ఏమీ లేవు. అయితే, ఈ వైఫల్యం కప్‌లో కీలక మ్యాచ్‌ల సందర్భంగా కాకుండా చూసుకోవాలి. ఏం చేయాలి?: సలహాలు ఇవ్వడంలో, వ్యూహాలు పన్నడం లో ధోని, రోహిత్ అండగా ఉంటారు కాబట్టి... అనవసర ఒత్తి డిని కొనితెచ్చుకోకుండా బ్యాటింగ్‌పై మరింత శ్రద్ధ చూపాలి. రోహిత్ శర్మ బలాలు: కుదురుకున్నాడంటే... ప్రపంచంలోనే ప్రమాదకర బ్యాట్స్‌మన్. ముఖ్యంగా వన్డేల్లో. ఓపెనర్‌గా అద్భుత రికార్డుంది. మైదానం నలువైపులా బంతిని బాదుతూ అతి భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. బలహీనతలు: అత్యున్నత శ్రేణి బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో చేతులెత్తేస్తాడు. దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ ఇచ్చేస్తాడు. ఏం చేయాలి?: క్రీజులో దిగిన వెంటనే బాదేసేయాలన్న ఆలోచన నుంచి బయటకు రావాలి. కాసేపు నిలిస్తే పరుగులు అవే వస్తాయని గ్రహించి సంయమనం చూపాలి. శిఖర్ ధావన్ బలాలు: జట్టులోని ఏకైక ఎడంచేతి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్. ఇంగ్లండ్‌లో జరిగిన గత ఐసీసీ టోర్నీల్లో విశేషంగా రాణించాడు. బలహీనతలు: టెక్నిక్ గొప్పదేమీ కాదు. కొన్నిసార్లు తేలిగ్గా వికెట్ ఇచ్చేస్తాడు. శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేడు. తన వికెట్‌కు తానే విలువివ్వడం లేదన్నట్లు ఉంటుంది ఇతడి బాడీ లాంగ్వేజ్. ఏం చేయాలి?: రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో జరుగుతున్న ఈ ప్రపంచ కప్‌లో నిలకడ ముఖ్యమని తెలుసుకోవాలి. ఓపెనర్‌గా తాను నిలదొక్కుకుంటే జట్టుకు ఎంత ప్రయోజనమో గ్రహించి భారీ స్కోర్లకు ప్రయత్నించాలి. కేఎల్ రాహుల్ బలాలు: క్లాస్, మాస్ కలగలిసిన నాణ్యమైన బ్యాట్స్‌మన్. తనదైన శైలి షాట్లతో పరుగులు రాబడతాడు. భారీ స్కోర్లు చేయగలడు. బలహీనతలు: జట్టులో చోటు అనుమానాస్పదం కారణంగానో, మరే ఇతర అంశాల రీత్యానో మానసిక దృఢత్వం తక్కువ. ఏం చేయాలి?: ఓపెనింగ్ తప్ప మరే స్థానంలో ఆడలేనన్నది రాహుల్ ఉద్దేశంగా కనిపిస్తుంటుంది. ఆటతీరూ అంతే ఉంటుంది. ఈ భావన నుంచి అతడు బయటపడాలి. ఒకటి, రెండు మ్యాచ్‌లు విఫలమైనా స్థయిర్యం కోల్పోకుండా ఉండాలి. మహేంద్రసింగ్ ధోని బలాలు: వికెట్ల వెనుక మహా మేధావి. బ్యాట్స్‌మెన్ కదలికలను చదువుతూ బౌలర్లకు ఇతడిచ్చే సలహాలు మ్యాచ్‌లను మలుపు తిప్పుతాయి. ముఖ్యమైన మ్యాచ్‌ల్లో ఇతడు ఆడే ఇన్నింగ్స్‌లు జట్టు ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి. బలహీనతలు: బ్యాటింగ్‌లో... మరీ చెప్పుకోవాలంటే ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఎలా రాణిస్తాడనేది కీలకం. ఐపీఎల్ ఫామ్ ఎంతవరకు కొనసాగిస్తాడో చూడాలి. ఏం చేయాలి?: చివరి ప్రపంచ కప్ ఆడబోతున్నందున దానిని మరపురానిదిగా మార్చుకోవాలి. ఫినిషర్‌గా పూర్వ ఫామ్‌ను అందుకోవాలి. తను దూకుడుగా ఆడలేకపోయినా... హార్దిక్ పాండ్యా వంటి యువకులను స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించాలి. విజయ్ శంకర్ బలాలు: అచ్చం హార్దిక్‌లానే మూడు అంశాల్లోనూ ఉపయోగపడగల ఆటగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దింపాలని చూస్తున్నారు. ఇంగ్లండ్ వాతావరణం కలిసొస్తే బౌలింగ్‌లోనూ ప్రభావవంతం అవుతాడు. బలహీనతలు: బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా ఇతడి ప్రతిభపై భరోసా ఉంచలేని పరిస్థితి. ఒక మ్యాచ్‌లో రాణించకుంటే మళ్లీ అవకాశం వస్తుందో లేదో చెప్పలేం. ప్రస్తుత భారత జట్టులో ఇంగ్లండ్ గడ్డపై ఆడిన అనుభవం లేని ఏకైక ఆటగాడు. ఏం చేయాలి: ఇప్పుడు వేగంగా చేస్తున్న 40–50 పరుగులనే మరింత భారీ స్కోర్లుగా మలచాలి. క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ బౌలర్‌గానూ ఓ చెయ్యేస్తే జట్టు వనరులు మరింత మెరుగుపడతాయి. కేదార్ జాదవ్ బలాలు: మంచి బ్యాట్స్‌మన్. అనూహ్యంగా బౌలర్‌గానూ ఓ చేయి వేస్తున్నాడు. చివరి ఓవర్లలో భారీ షాట్లతో స్కోరు పెంచగలడు. ఐదో నంబరు బ్యాట్స్‌మన్‌గా స్థానం ఖాయం చేసుకున్నాడు. లక్ష్యం ఎంత ఉన్నా నిబ్బరంగా ఆడగలడు. బలహీనతలు: తొందరగా గాయపడే శరీరం జాదవ్‌ది. గత మూడేళ్లలో ఐపీఎల్ సహా సీజన్‌కు కనీసం ఒక సిరీస్‌కైనా ఇతడు ఈ కారణంగానే దూరమయ్యాడు. ఫిట్నెస్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. తాజాగా గాయం నుంచి కోలుకుంటూనే ప్రపంచ కప్‌కు వచ్చాడు. ఏం చేయాలి?: మెగా టోర్నీలో బంతితోనూ ఉపయోగపడగల విలువైన ఆటగాడు జాదవ్. జట్టు వ్యూహాల్లో కీలకం అవుతాడు కాబట్టి ఫిట్నెస్ కాపాడుకుంటూ ఉండాలి. దినేశ్ కార్తీక్ బలాలు: రిజర్వ్ కీపర్ అయినా పరిస్థితులను బట్టి బ్యాట్స్‌మన్ గా నాలుగో స్థానంలో దింపగల సత్తా ఉన్నవాడు. మధ్య ఓవర్లలో కీలకమవుతాడు. బ్యాటింగ్ టెక్నిక్, దూకుడు రెండూ ఉన్నాయి. బలహీనతలు: మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు అవకాశాలు రాకపోవడం, అంచనాలు పెరిగి అవకాశం వచ్చినపుడు విఫలమవడం కార్తీక్‌లోని లోపం. ఏం చేయాలి?: ప్రపంచ కప్‌లో చాలా దూరం ప్రయాణించాలి కాబట్టి నాలుగో స్థానంలోనో, ధోని బదులుగానో కార్తీక్‌కు అవకాశం తప్పకుండా ఉంటుంది. దీనిని అతడు ఆత్మ విశ్వాసంతో తీసుకోవాలి. హార్దిక్ పాండ్యా బలాలు: హార్డ్ హిట్టర్. మంచి పేస్ ఆల్‌రౌండర్. దీంతో మూడో పేసర్ స్థానాన్ని ఇతడితో భర్తీ చేసే వీలు కలుగుతోంది. బలహీనతలు: పూర్తిగా కాకున్నా, గాయాల బెడద కొంత ఉంది. బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు ఇవ్వకుండా చూసుకోవాలి. ఏం చేయాలి?: చేదు జ్ఞాపకాలు మర్చిపోయి... ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకున్న హార్దిక్ మంచి లయలో ఉన్నాడు. లోయరార్డర్లో స్కోరు పెంచే బాధ్యతను తీసుకోవాలి. రవీంద్ర జడేజా బలాలు: హార్దిక్ తర్వాత జట్టులో ఉన్న మరో ఆల్‌రౌండర్. చకచకా ఓవర్లు వేస్తాడు. బలహీనతలు: పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే బంతిని స్పిన్ చేయలేడు. వికెట్లు తీయలేకపోవడం మరో పెద్ద లోపం. ఏం చేయాలి?: పరుగులు నిరోధిస్తూనే వికెట్లు పడగొట్టాలి. బ్యాటింగ్‌లో మెరిపించాలి. ఫీల్డింగ్‌లో హార్దిక్‌తో కలిసి పరుగులు నిరోధించాలి. భువనేశ్వర్ బలాలు: 140 కి.మీ.పైగా వేగం కొనసాగిస్తూనే స్వింగ్ రాబట్టగల పేసర్. ప్రారంభ ఓవర్లలో వికెట్ తీస్తూ, చివరి ఓవర్లలో పరుగులు నిరోధిస్తాడు. ఇంగ్లండ్ వాతావరణంలో కీలకం కాగలడు. బలహీనతలు: ఇటీవల ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు. ఈ కారణంగానే ఆస్ట్రేలియా సిరీస్ లో టెస్టు ఆడే అవకాశం ఇవ్వలేదు. తర్వాత వన్డేల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు.ప్రస్తుతం ఫామ్ కొంత డోలాయమానంగా ఉంది. ఏం చేయాలి?: తన బౌలింగ్‌కు నప్పే ఇంగ్లండ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటే జట్టుకు మేలు అవుతుంది. యజువేంద్ర చహల్ బలాలు: మణికట్టు స్పిన్నర్. కప్‌లో మిగతా జట్లలో చాలావాటికి సవాల్ విసరగలడు. లయ దొరికితే చహల్‌ను తట్టుకోవడం కష్టం. బలహీనతలు: కొన్ని సిరీస్‌ల నుంచి చహల్‌ను ప్రత్యర్థులు చదివేస్తున్నట్లు కనిపిస్తోంది. అతడి బౌలింగ్‌ను తేలిగ్గా ఎదుర్కొంటుండటమే దీనికి నిదర్శనం. ఏం చేయాలి?: ప్రత్యర్థులు మెరుగైనంత మాత్రాన బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. చక్కటి వ్యూహాలతో వారిని కట్టడి చేయగలిగితే చహల్ విజయవంతమైనట్లే. కుల్దీప్ యాదవ్ బలాలు: ప్రపంచ కప్‌లో ఏకైక చైనామన్ బౌలర్. ప్రత్యర్థులకు ఇతడి బౌలింగ్ అర్ధమయ్యేలోపే చేయాల్సినంత నష్టం చేస్తాడు. గతేడాదిగా నిలకడగా రాణిస్తున్నాడు. బలహీనతలు: ఐపీఎల్లో వైఫల్యంతో కాస్త ఇబ్బందిపడ్డాడు. జట్టు నుంచి తప్పించడం మానసికంగా ప్రభావం చూపింది. ఏం చేయాలి?: అనవసర అంశాల జోలికి పోకుండా ఆటపై దృష్టి పెడితే బాగుటుంది. ఫీల్డింగ్‌లోనూ మెరుగుపడాలి. జట్టు యాజమాన్యం అండ ఉంది కాబట్టి మనో నిబ్బరంతో మైదానంలో రాణించాలి. జస్ప్రీత్ బుమ్రా బలాలు: యార్కర్లు, అంతుచిక్కని బంతుల కారణంగా ఈ కప్‌లో అందిరి కళ్లూ ఇతడి పైనే ఉన్నాయి. విశేషంగా రాణిస్తాడని అంచనాలు వేస్తున్నారు. ప్రశాంతంగా ఉంటూనే పని ముగిస్తాడు. బలహీనతలు: బౌలింగ్ పరంగా పెద్దగా పొరపాట్లు చేయకున్నా... చిన్నచిన్న తప్పులే బుమ్రాను విలన్‌ను చేస్తాయి. రెండేళ్ల క్రితం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ‘నో బాల్’ ఇలాంటిదే. ఏం చేయాలి?: పరిణతి సాధించిన బుమ్రా ప్రస్తుతం కెరీర్ అత్యున్నత స్థితిలో ఉన్నాడు. పరిపూర్ణ బౌలర్‌గా ఎదుగుతున్నాడు. కప్‌లో భారత బౌలింగ్ భారాన్ని మోస్తున్న స్పృహతో రాణిస్తే జట్టు అవకాశాలు మరింత పెరుగుతాయి. మొహమ్మద్ షమీ బలాలు: కచ్చితత్వంతో ఆరంభంలో, చివర్లో యార్కర్లతో చెలరేగే షమీని ఎదుర్కొనడం సవాలే. సరిగ్గా బంతులేస్తే బుమ్రా కంటే ఇతడే ప్రమాదకారి. బలహీనతలు: బైస్ రూపంలో కానీ, బ్యాట్స్‌మన్ ద్వారా కానీ పరుగులివ్వడం షమీ బలహీనత. గాయపడకుండా చూసుకోవడమూ ముఖ్యమే. ఏం చేయాలి?: షమీ ఇప్పుడు మెరుగుపడ్డాడు. గాయాల బెడద కూడా లేదు. బుమ్రాకు తోడుగా షమీ ప్రత్యర్థిపై విరుచుకుపడితే చాలావరకు బ్యాట్స్‌మెన్‌కు భారం తగ్గినట్లే. -
సహనం బలం... సహన ఫలం
బ్రహ్మ దేవుడు పంచభూతాలను పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు. వరం కోసం తొందర పడిన ఆకాశం అందరికంటే పైన ఉండాలని కోరింది. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మ. ఆకాశం మీద కూర్చునే వరాన్ని సూర్యుడు కోరడంతో నేటికీ ఆకాశం మీద విహరిస్తున్నాడు. వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన జలం మేఘాల రూపంలో మారి ఆకాశం మీద పెత్తనం చలాయిస్తూనే కొన్నిసార్లు సూర్యుడుని కప్పేస్తుంది. పై ముగ్గురినీ జయించే శక్తిని వాయువు కోరడంతో పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవడం, సూర్యుడు, ఆకాశం కనుమరుగవడం జరుగుతాయి. చివరివరకు సహనంగా వేచి చూసింది భూదేవి. పై నలుగురూ నాకు సేవ చేయాలని కోరడంతో బ్రహ్మ అనుగ్రహించాడు. అప్పటినుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది. వేడి, వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు. వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం. సమస్త జీవకోటికీ ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు. సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి మిగతా భూతాలు సేవకులయ్యాయి. సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ కథ చాలు. సహనానికి ప్రతిరూపం స్త్రీ. అందుకే భూదేవిని ఓర్పు, సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు. సహనం అంటే నిగ్రహం పాటించడం. కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం. బాధను అధిగమించడమే సహనం. సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరమవుతాయి. కొన్ని సార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది. సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది. – నారంశెట్టి ఉమామహేశ్వరరావు -
తగిన యుక్తి
ఇశ్రాయేలీయులను పరిపాలించిన కనాను రాజు సేనాధిపతి సీసెర చాలా క్రూరుడు. ఇశ్రాయేలీయులను బహుగా హింసించేవాడు. ఒకసారి యుద్ధం జరిగినప్పుడు ఈ సీసెర ఇనుప రథాలతో ఇశ్రాయేలీయులను, వారి పక్షంగా యుద్ధం చేసే బారాకుని చంపాలని బయలుదేరాడు. అయితే ఎంతటి సేనాధిపతి అయినా అవతలి వ్యక్తి బలాన్ని తక్కువ అంచనా వేస్తే ఓడిపోక తప్పదు కదా. సీసెర విషయంలో కూడా ఇదే జరిగింది. తన సైన్యాన్నంతా కోల్పోయి తన రథాలను విడిచి బారాకు తరుముతున్నప్పుడు కాలినడకన అక్కడినుండి పారిపోవడం మొదలు పెట్టాడు. అలా వెళ్లిన సీసేరాకు ఒక స్త్రీ కనిపించింది. స్త్రీనే కదా, తనకు ఇక ప్రాణహాని ఉండదు.. నిశ్చింతగా ఉండొచ్చు అనుకుని దాహం ఇమ్మని ఆ స్త్రీని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ స్త్రీ నీళ్లకు బదులుగా పాలిచ్చి అతడిని నమ్మించింది. ఇక ఈ స్త్రీ వల్ల తనకు హాని లేదని అనుకుని ఆ స్త్రీని గుడారానికి కాపలాగా ఉంచి ‘‘ద్వారంలో నిలిచి ఎవరైనా వచ్చి అడిగితే ఎవరూ లేరని చెప్పు’’ అని ఆదేశించి, తాను లోపల పడుకున్నాడు. ఇశ్రాయేలీయులను హింసిస్తున్న సీసెర మీద కోపంతో ఉన్న ఈ స్త్రీ ఈ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదు. పాలు తాగి గాఢ నిద్రలో ఉన్న సీసెరాని గుడారపు మేకుతో సుత్తి చేత పట్టుకుని పొడిచి చంపేసింది. సీసెరా పీడ నుండి ఇశ్రాయేలీయులను విడిపించింది. ఎంతో గర్వంగా ప్రవర్తించిన ఒక రాజ్య సేనాధిపతి దారుణంగా చనిపోయాడు. ఇక్కడ ఈ స్త్రీ గొప్పతనాన్ని గురించి మనం చెప్పుకోవాలి. అవకాశం దొరకగానే చాలా తెలివిగా ప్రవర్తించి నీళ్లడిగితే పాలిచ్చి అతడిని గాఢ నిద్రలోనికి జారుకునేటట్లు చేసింది. అతడి బలాన్ని చూసి భయపడకుండా అతడు పడుకోగానే ఎవరికైనా చెబుదామని వెళ్లలేదు. తాను వెళితే అతడు లేస్తే మళ్లీ బలం తెచ్చుకుంటాడేమోనని ఆలోచించింది. తన ప్రాణానికి తెగించి అతడిని మట్టు్టబెట్టింది, చాలా యుక్తిగా, తెలివిగా ప్రవర్తించి తన జాతిని ఆ క్రూరుడి నుండి రక్షించింది. ఇలాంటి స్త్రీలు చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. – రవికాంత్ బెల్లంకొండ -
పొగడ్త...ప్రోత్సహించేలా ఉండాలి
ఆత్మీయం ఈ ప్రపంచంలో పొగడ్తలకు లొంగని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, ఎవరైనా సరే, తాము చేసిన పనిని ఇతరులు మెచ్చుకుంటే ఆనందించాలని కోరుకుంటారు. అందులో తప్పేమీ లేదు. చేసిన మంచి పని లేదా మంచి రాత లేదా సృజనాత్మకతను మెచ్చుకోవడం వల్ల వారిలో మరల ఆ పనిని చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనిపిస్తుంది. అందుకే మంచిమాటను మందిలో చెప్పు, చెడ్డమాటను చెవిలో చెప్పు అన్నారు పెద్దలు. అయితే పొగడ్త అనేది సత్యంగా ఉండాలి. అందులో ఎటువంటి మొహమాటమూ ఉండకూడదు. ప్రతి మనిషిలోనూ మంచీ, చెడూ రెండూ ఉంటాయి. మంచిని మెచ్చుకోవడం మాని, చెడునే ఎత్తి చూపడం సరి కాదు. దానివల్ల వారిలో చెడే ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మంచినే చూడటం వల్ల తమకు తెలియకుండానే మంచి పనులు చేయడానికి అలవాటు పడతారు. మన పొగడ్త అవతలి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. భుజం తట్టి ప్రోత్సహించేలా, మరిన్ని విజయాలను సాధించే లా ఉండాలి. హనుమంతుడు తాను అంతటి మహాసముద్రాన్ని ఎలా దాటగలనా? అన్న నిరాశలో కూరుకుపోయినప్పుడు జాంబవంతుడు, సుగ్రీవుడు, ఇతర వానర వీరులు ఆయనతో ‘‘నువ్వు అందరిలా సాధారణమైన వానరానివి కాదు. మహాబలశాలివి, బుద్ధిశాలివి కాబట్టే కదా, సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఆయన నుంచి విద్యలన్నీ నేర్చుకోగలిగావు. ఇప్పుడు ఈ సముద్రాన్ని దాటటం నీకో లెక్క కాదు... ప్రయత్నం చేయి’’ అంటూ పొగుడుతూనే ఆయన శక్తిసామర్థ్యాలను గుర్తు చేశారు. ఆ తర్వాత హనుమ సాధించిన విజయం అందరికీ తెలిసిందే! -
బాధలూ బలమే!
ఆత్మీయం ఆపదలు, కష్టాలు రానివారుండరు. దేవుడు ఇచ్చే ప్రతి కష్టమూ మనకు అనుభవాన్ని నేర్పిస్తుంది. మరింత గట్టిపడేలా చేస్తుంది. అదే విధంగా ప్రతికూల భావనల స్థానంలో సానుకూల భావనలను నింపుకుంటే, ఇక ఏ సంఘటనా బాధించదు.దేనినైనా సరే, అది మనకు ఇబ్బందికరమైనదనో, దాని ద్వారా భరించలేనంతటి బాధ కలుగుతుందనో ముందే అనుకోకూడదు. అసలు ఆ భావనే దుర్భరమైన స్థితిలోకి నెడుతుంది. కాబట్టి ఆ జరగబోయే దానిలో లేదా అప్పటికే జరిగిన దాని ద్వారా కలగబోయే మేలును మాత్రమే తలచుకోవాలి. మనల్ని పరీక్షించడం కోసం ఆ బాధను లేదా సమస్యను సృష్టించిన దేవుడే దానిని పరిష్కరించగలడన్న నమ్మకాన్ని మనసులో నింపుకోవాలి. అప్పుడే ఎంతటి గడ్డు పరిస్థితులనయినా సరే, ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. అప్పుడే బాధే బలంగా మారుతుంది. కుంతీదేవి ఎప్పుడూ శ్రీకృష్ణుని తనకు ఏదైనా సమస్య లేదా కష్టాన్ని ఇమ్మని కోరుకునేదట. ఎందుకంటే, కష్టసమయంలోనే కదా, దేవుడు గుర్తుండేది! -
రూపాయి మరోసారి హై జంప్
ముంబై: ఒకవైపు దేశీయ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతుండగా డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రుపీ దూసుకుపోతోంది. రూ. 64 స్థాయిని తొలిసారి బ్రేక్ చేసి 0.48పైసల లాభంతో రూ.63.96 వద్ద రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే రూ. 63.93 వద్ద 20 నెలల గరిష్టాన్ని తాకి మరోసారి హైజంప్ చేసింది. ఆరంభంలో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 20 పైసలు(0.31 శాతం) బలపడింది. 64.07 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంతక్రితం రూపాయి 2015 ఆగస్ట్ 10న మాత్రమే 64.10 కంటే దిగువన నిలిచింది. మంగళవారం డాలరుతో మారకంలో రూపాయి 17 పైసలు పుంజుకుని 64.27 వద్ద ముగిసింది. కాగా దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల హైజంప్ చేయడంతోపాటు ఎగుమతి సంస్థలు, బ్యాంకులు డాలర్లను విక్రయించడంతో రూపాయికి బలమొచ్చినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయ సంకేతాలతో రూపాయికి మంచి మద్దతు లభించినట్టు భావిస్తున్నారు. ఇక బంగారం విషయానికి వస్తే ఫ్యూచర్స్ లో మరింత బలహీనపడింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. రూ. 305 నష్టపోయిన పుత్తడి రూ. 28,826 వద్ద వుంది. -
బంగారం @రూ.30 వేలు
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు వరుస సెషన్లలో పరుగులు పెడుతున్న డాలర్ బలపడటంతో బుధవారం గరిష్టస్థాయి నుంచి కొద్దిగా క్షీణించాయ. ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల కారణంగా డాలర్ విలువ నేలచూపులు చూస్తుండడంతో ఈ విలువైన మెటల్ కు డిమాండ్ పుంజుకోవడంతో మంగళవారం మూడునెలల గరిష్టాన్ని తాకింది. స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్ బంగారం ధర 1,234 డాలర్లు గా నమోదైంది. అయితే అమెరికా, యూరోప్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్తితుల కారణంగా డాలర్ బుధవారం కొద్దిగా బలపడింది. డాలర్ ఇండెక్స్ 0.2శాతం ఎగిసి 100.510వద్ద ఉంది. అమెరికాలో గోల్డ్ ఫ్యూచర్స్ లో 0.2 శాతం క్షీణించి 1,231డాలర్ల వద్ద ఉంది. వెండి ధరలు కూడా ఇటీవలి గరిష్టంనుంచి స్వల్పంగా 0.1శాతంక్షీణించి 17.69 డా డాలర్లుగా ఉంది. ప్లాటినం 0.6శాతం ఎగిసి 1,007.20 డాలర్లుగా ఉండగా పల్లాడియం 0.1 శాతం బలహీనంగా ఉంది. ట్రంప్ విధించిన ఏడు ముస్లిం మతం దేశాలనుంచి ప్రజలపై ట్రంప్స్ తాత్కాలిక వీసా బ్యాన్ నిషేధం వివాదం, రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఐరోపాలో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో డాలర్ డిమాండ్ క్షీణిస్తోంది. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిపై బులియన్ మార్కెట్లో ఆసక్తి నెలకొంది. అయితే జనవరి సీపీఐ డాటాపై పసిడి పరుగు ఆధారపడి ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇటు దేశీయం కూడా మూడునెలల గరిష్టాన్ని తాకిన బంగారం ధర పదిగ్రా. రూ.30వేల స్థాయిని తాకింది. బుధవారం డాలర్ బలపడడంతో మూడునెలల గరిష్టం నుంచి బంగారం ధరలు కొద్దిగా వెనక్కి తగ్గాయి. ముంబై మార్కెట్లో 22 కారెట్ల బంగారం ధర పది గ్రా. రూ. 28540 ఉండగా, 24 కారెట్ల ధర రూ. 30524 వద్ద ఉంది. ఢిల్లీలోరూ. 28400 ( 22 కారెట్లు పదిగ్రా.), రూ.30374 (24 కారెట్లు పదిగ్రా.) గా వుంది. హైదరాబాద్‌లో రూ. 28310 (22 కారెట్లు పదిగ్రా.) రూ. 30278 ( 24 కారెట్లు పదిగ్రా.)గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బుధవారం పసిడి పది గ్రా. రూ.47 నష్టపోయి రూ.29,285 పలుకుతోంది. -
సంఘాలను పటిష్టం చేద్దాం
గుంటూరు వెస్ట్ : స్వయం సహాయక సంఘాలు మరింత బలోపేతం కావడానికి కృషిచేయాల్సిన అవసరం ఉందని సెర్ప్ రాష్ట్ర డైరెక్టర్ (సంస్థాగత నిర్మాణం) ఉషారాణి చెప్పారు. సోమవారం జిల్లా సమాఖ్య కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉషారాణి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు పటిష్టం కావడం ద్వారానే స్త్రీనిధి నుంచి మరిన్ని రుణాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 2200 మంది స్వయం సహాయక సభ్యుల ఆధార్ సీడింగ్‌ను తక్షణమే పూర్తిచేయాలని సూచించారు. రాజధాని ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సంఘాలను పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఆర్డీఏ పీడీ హబీబ్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి బ్రిక్స్ తయారీ పనులను స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం గొప్ప అవకాశమన్నారు. వీటిని సక్రమంగా నిర్వహించడం ద్వారా సంఘాలు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ రాష్ట్ర అధికారులు రామకృష్ణ, మాధవీలత, డీఆర్డీఏ ఏపీడీ జి.నాగేశ్వరరావు, డీపీఎం అశోక్‌కుమార్, నారాయణ, శారదాంబ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కె.సౌభాగ్యం, ఏపీఎం సాంబశివరావు, జేడీఎం శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
జీవితమంతా రంధ్రాన్వేషణమే!
నరుడి శరీరానికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఈశ్వరుడు తనకి ఏ విభూతినిచ్చాడో దాన్ని మాత్రమే కాక, ప్రపంచం మొత్తం మీద ఏ ప్రాణిలో ఏ గొప్ప విభూతి ఉన్నా దానిని తనదిగా వాడుకోగలిగిన శక్తి ఒక్క నరుడికే ఉంటుంది. మరే ఇతర ప్రాణికీ ఉండదు. వేగంగా పరిగెత్తగల, పర్వతాలు ఎక్కగల గుర్రాన్ని మచ్చిక చేసుకుని తాను కూడా అదేవేగంతో వెళ్లగలడు, పర్వతాలు సునాయాసంగా ఎక్కగలడు. నీళ్ళలో ఈదగలిగిన చేపను చూసి తానూ నేర్చుకోవడమేగాక, ఓడలు చేసుకుని సముద్రాలు దాటి వెళ్ళగలడు. ఎగరగలిగిన శక్తిని ఆ పరమేశ్వరుడు ఒక్క పక్షికే ఇచ్చాడు. దాని గమనాన్ని ఆకళింపుచేసుకున్న మనుష్యుడు విమానాలు ఎక్కి ఎగురుకుంటూ వెళ్ళగలుగుతున్నాడు. మొక్కలోని ఓషధీ శక్తిని తీసుకుని తన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి వినియోగించుకుంటున్నాడు. ఈశ్వరుని సృష్టిలోని సమస్త ప్రాణుల ైవభవాన్ని తన అభ్యున్నతికి వాడుకోగల శక్తి ఒక్క నరుడికే ఉంది. ఆ బుద్ధి ఒక విస్ఫోటనా శక్తి. ఆ శక్తిని మనుష్యునిలో ఉంచిన పరమేశ్వరుడు దానికి తోడుగా ఐదు ఇంద్రియాలు ఇచ్చాడు. వీటితో మనుష్యజన్మకున్న పరమ ప్రమాదకరమైన లక్షణం కానీ, తననితాను ఉద్ధరించుకోగలిగిన శక్తికానీ నిలబడతాయి. అపారమైన తెలివితేటలకు పక్కన ఐదు ఇంద్రియాలను అనుభవించడానికి కొన్ని కోట్ల భోగాలను కూడా పెట్టాడు. ప్రధానంగా శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములని ఐదు భోగములను మనుష్యుడు అనుభవిస్తాడు. శబ్దమంటే చెవితో వినడం. చెవితో విని అనుభవించేవి ఎన్నో ఉంటాయి. ఓ వీణానాదం, ఓ ఉపన్యాసం, పక్షుల కలకూజితాలు... తెల్లవారిలేస్తే ఎన్నో శబ్దాలు విని పరవశించ గల శక్తి మనుష్యునికి ఉంది. ఇది మిగిలిన ప్రాణులకు లేదు. వాటికి చెవి ఉపయోగం ఎంతవరకు అంటే... కొన్ని కొన్ని శబ్దాల చేత అవి ప్రీతి పొందుతాయి. ఇవి మనకు హాని చేయవన్న నమ్మకం పొందుతాయి. మరికొన్ని శబ్దాలను ప్రమాదకరమని గుర్తిస్తాయి. అంతవరకే వాటి ప్రయోజనం. అంతకుమించి దానికి మరే ఉపయోగం ఉండదు. మిగిలిన ప్రాణులు పొందలేని ఇటువంటి సుఖాలు మనుష్యుడు పొందుతున్నాడు. అన్నిటికంటే పెద్ద సుఖం ఏమిటంటే... ఈ చెవులగుండా విని కొన్ని కోట్ల జన్మలనుండి తరుముకొస్తున్న వాసనా బలాన్ని వదలిపెట్టేస్తాడు. ఇది మనుష్యజన్మకున్న ప్రత్యేకమైన గొప్పతనం. వాసనాబలం అని ఒకటుంటుంది. అది శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు జీవుడు పైకి వెళ్ళి పోతున్నప్పుడు ఇక్కడ అన్నీ చక్కబెట్టుకుని వెళ్ళిపోతాడు. మృత్యుకాలం ఆసన్నమయిందను కోండి. సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఐదు జ్ఞానేంద్రియాల శక్తులను తీసి మూటకట్టుకుంటుంది. కంటిలోంచి చూసే శక్తిని, చెవినుంచి వినికిడి శక్తిని, నాలుకకు రుచి చెప్పే శక్తిని, చర్మానికి స్పర్శశక్తిని, ముక్కుకి ఉన్న వాసనా శక్తిని తీసి మూటకడుతుంది. ఇప్పుడు ఎటునుంచి బయటికి వెళ్ళాలా అన్ని ప్రయత్నిస్తుంది.దానికి ఒక తీర్పు ఏర్పాటు చేసాడు పరమేశ్వరుడు. జీవించి ఉన్నంతకాలం తొమ్మిది రంధ్రాలు పనిచేయాలి. పుట్టేవరకు ఒక రంధ్రం, వెళ్ళిపోయేటప్పుడు మరొక రంధ్రం పనిచేయాలి. పదకొండు రంధ్రాల మీద ఉంటుంది. మనకు తత్త్వంలో ఒకమాట అంటుంటారు.’వాడికి రంధ్రాన్వేషణ’ అలవాటురా !’ అని. అసలు జీవితంలో వేదాంత తత్త్వమంతా ఆ ఒక్కమాటలోనే ఉంది. వాస్తవంగా కూడా వాడి జీవితమంతా రంధ్రాన్వేషణమే. అమ్మకడుపులో చీకట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళడానికి రంధ్రాన్ని వెతుక్కుంటాడు. బయటికి వచ్చాక పసితనంలో ఎక్కడ ఉన్నాడో అక్కడే మలమూత్ర విసర్జన చేస్తాడు. కొంచెం పెద్దయిన తర్వాత సైగలతో చెప్తే అమ్మ వాడిని మరుగుదొడ్డికి తీసుకుని వెళ్ళి వస్త్రం విప్పేయగానే విసర్జన ఎక్కడెక్కడినుంచి అవుతున్నదో తెలుసుకుంటాడు. ఆ తరువాత వాటిని తన నియంత్రణలో ఉంచుకుంటాడు. యవ్వనం వచ్చిన తరువాత రంధ్రాన్వేషణమే మనిషి ప్రవృత్తి. ఆ తరువాత ఉద్యోగంలో డబ్బు ఎందుకిస్తారంటే రంధ్రాన్వేషణకే. తప్పులు వెతికి పట్టుకున్నందుకే. ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపన చేయాలి కదా.. అంటే రంధ్రం వేయాలి. చిట్టచివరివరకు ఎవరియందు రంధ్రాన్వేషణమనే బుద్ధి నిలబడుతుందో వాడు తరించి పోయాడని గుర్తు. రెండుకళ్ళు, రెండు ముక్కులు, రెండు చెవులు, నోరు, మలమూత్ర ద్వారాలు. ఈ తొమ్మిది రంధ్రాల్లోంచి శరీరంలోనుంచి ఎప్పుడు ఏది ఎక్కడ బయటికి వెళ్ళాలో, బయటినుంచి ఏది లోపలకు వెళ్ళాలో ఈ జీవుడు వాటిని చక్కగా వినియోగించుకుని, 10 రకాల వాయువులను- ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, క్రికర, కూర్మ, ధనంజయ, దేవదత్తములనే వాటిని లోపల కుంభించగల శక్తితో ఉంటే... వాడు ఉన్నాడని గుర్తు. ఒకసారి పీలిస్తే అది పది వాయువులవుతుందని శాస్త్రం చెపుతుంది. అవి లోపల ఈ తోలుతిత్తిలో నిలబడాలి. ఈ తిత్తికి తొమ్మిది కన్నాలు. ఇవి చిట్టచివర మూటగట్టుకుని ఏ రంధ్రంలోంచి బయటికి వెళ్ళాలా... అని రంధ్రాన్వేషణ చేసే సమయంలోనే... అక్కడ మనుష్య జన్మను ఎవడు ఎలా వాడుకున్నాడన్న విషయాన్ని పరమేశ్వరుడు పరీక్షగా చూస్తాడు. ఈశ్వరుడు ఎప్పుడూ మనిషి పునర్జన్మలో వేలు పెట్టడు. మనిషి తన కర్మలచేత తానే తన పునర్జన్మను నిర్ణయించుకుంటాడు. నేను నిర్ణయించుకోనిది పరమేశ్వరుడు ఇవ్వడు. ఎందుకో తెలుసా? అక్కడే వాసన అన్న మాట వస్తుంది. వాడు శాస్త్రాన్ని, గురువుగారి పాదాలను, భగవంతుని బాగా పట్టుకున్నవాడయితే వాడు ఊర్ధ్వలోక చలనం చేస్తాడు. మాడు దగ్గర బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. దానిని మూతవేసి ఉంచుతాడు పరమేశ్వరుడు. అలా ఆ సమయానికి శరీరంలోని వాయువులను పైకి తీసుకొచ్చి బ్రహ్మరంధ్రాన్ని బద్దలు కొట్టుకుని ఎవరు అక్కడినుంచి నిర్గమిస్తారో వారు మళ్ళీ ఇక ఈ శరీరంలోకి రారు. వివేకానందుడి వంటి మహాత్ములు వారి నిష్ర్కమణ ముహూర్తాన్ని వారే పెట్టుకున్నారు. అలా వెళ్లలేని వాడు... దొంగదారుల్లో వెడతాడు. అంటే అధోముఖంగా వెడతాడని గుర్తు. -
భారత్ కు అపార శక్తిసామర్థ్యాలు..!
• సింగపూర్ డిప్యూటీ ప్రధాని షణ్ముగరత్నం • అయితే అవి మరింత పరిపుష్టి కావాలని వ్యాఖ్య • 8 నుంచి 10% వృద్ధి సాధించాలి • తలసరి ఆదాయ వ్యత్యాసాలు తొలగాలని సూచన న్యూఢిల్లీ: భారత్‌కు అపార శక్తిసామర్థ్యాలు ఉన్నట్లు సింగపూర్ డిప్యూటీ ప్రధానమంత్రి తార్మాన్ షణ్ముగరత్నం పేర్కొన్నారు. అయితే ఈ శక్తిసామర్థ్యాలను ఇంకా పూర్తిగా వెలికితీయాల్సి ఉందని పేర్కొన్నారు. తద్వారా ఆర్థిక పరిపుష్టి జరగాలని సూచించారు. ఈ దిశలో 20 సంవత్సరాలపాటు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 8 నుంచి 10 శాతం వృద్ధి సాధించాలని అన్నారు. తద్వారానే తలసరి ఆదాయానికి సంబంధించి చైనా వంటి దేశాలతో వ్యత్యాసాన్ని తగ్గించుకునే వీలుందని అన్నారు. ఇందుకు సంస్కరణల బాటలో మరింత ముందుకు సాగాల్సి ఉంటుందని సూచించారు. ‘ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా’ అనే అంశంపై ఆయన నీతి ఆయోగ్ సదస్సు తొలి ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలను చూస్తే... ⇔ భారత్ 8 నుంచి 10 శాతం వృద్ధి శాతం సాధించేయడం ఒక ‘విలాసవంతమైన’ అంశం ఏదీ కాదు. అలాంటి శ్రేణి వృద్ధి రేటును వరుసగా 20 ఏళ్లు సాధిస్తేనే కనీసం చైనా తలసరి ఆదాయంలో భారత్ తలసరి ఆదాయం 70 శాతానికి చేరుతుంది. చైనా తలసరి ఆదాయంకన్నా రెండున్నర రెట్లు తక్కువగా భారత్ తలసరి ఆదాయం ఉంది. అయితే తగిన ప్రణాళికల ద్వారా ఈ వ్యత్యాసాన్ని తగ్గించుకునే సామర్థ్యం భారత్‌కు ఉంది. ఉపాధి అవకాశాల పెంపునకు చర్యలు ఇందులో కీలకమైనవి. ⇔ ’పూర్తిగా వెలికిరాని’ శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటలైజేషన్ గుర్తింపు ఇన్ఫ్రా... ‘ఆధార్’ ఇందులో ఒకటి. ⇔ భారత్ నుంచి ఎగుమతులు మరింత పెరగడానికి తగిన విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ⇔ ఫోర్బ్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ 100 కంపెనీల్లో హిందుస్తాన్ యునీలీవర్, టీసీఎస్, సన్ ఫార్మా వంటి సంస్థలు ఉన్నాయి. సన్‌ఫార్మా 70 శాతం ఆదాయం భారత్ యేతర దేశాల నుంచే వస్తోంది. ఇక్కడ చెప్పేదేమిటంటే... ప్రపంచదేశాలతో పోటీపడి పనిచేయగలిగే కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. అయితే ఈ సంస్కృతి మరింత విస్తృతం కావాలి. ⇔ ఆసియాలో ఆర్థిక వ్యవస్థ సమన్వయ సహకారం మరింత మెరుగుపడాలి. దేశాల మధ్య అత్యున్నత స్థాయి ఆర్థిక సంబంధాలు వృద్ధి బాటలో కీలకం. భవిష్యత్ ప్రపంచ వృద్ధిలో ఆసియా పాత్ర కీలకం. దీనిని ఆసియా దేశాలు వృద్ధికి ఒక అవకాశంగా మలచుకోవాలి. -
సమయోచితంగా...
పురానీతి వానరరాజు సుగ్రీవుడు, ఆయన మంత్రి హనుమంతుడు. ఇద్దరూ ఋష్యమూక పర్వతం మీద అటూ ఇటూ నడుస్తూ ఏదో విషయం మీద సంభాషించుకుంటున్నారు. ఇంతలో సుగ్రీవుడి దృష్టి దూరంగా నడిచి వస్తున్న ఇద్దరు వ్యక్తుల మీద పడింది. చూడటానికి సాధువుల్లా ఉన్నా, ఎంతో బలిష్టంగా, భుజాన ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. వారి చేతులలో ఉన్న ఖడ్గాలు సూర్యకాంతి పడ్డప్పుడల్లా తళుక్కుమని వజ్రాల్లా మెరుస్తున్నాయి. వారిని చూసి సుగ్రీవుడు భయంతో బిగుసుకుని పోయాడు. మాటలలో తడబాటు, నడకలో తత్తరపాటు మొదలైంది. అది గమనించిన హనుమ, ‘రాజా! నీ భయానికి కారణం నాకు అర్థమైంది. ఆ వ్యక్తులను చూసే కదా నువ్వు కలవరపడుతున్నావు. నీవు అనుకుంటున్నట్టుగా వాలి ఇటు రాలేడు. ఒకవేళ మూర్ఖత్వంతో వస్తే మతంగ మహర్షి శాపం వల్ల తల వక్కలై మరణిస్తాడు. ఆ విషయం వాలికీ తెలుసు. నీకూ తెలుసు. రాజైనవాడు అవతలి వారి నడక, అవయవాల కదలికను బట్టి, మాటతీరును బట్టి, వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనసులో ఏ భావం దాగి ఉందో కనిపెట్టి, అందుకు అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగలడు. అటువంటి సమర్థత నీకుంది. అయినా కూడా నువ్వు భయపడుతున్నావంటే, నీ అన్నగారైన వాలి శక్తిసామర్థ్యాల గురించి నీకు క్షుణ్ణంగా తెలిసి ఉండటమే కారణం అనుకుంటున్నాను. అయినా, వారెవరో. ఎందుకు వస్తున్నారో కనుక్కొని వస్తాను. మంత్రిగా అది నా కర్తవ్యం. అంతవరకూ నువ్వు స్థిమితంగా ఉండు’’ అంటూ సుగ్రీవుడి భుజం తట్టాడు హనుమ. కపిశ్రేష్ఠుడైన హనుమ మాటలతో కొండంత ధైర్యం వచ్చింది సుగ్రీవుడికి. వెంటనే హనుమ తన మనసులో ఇలా అనుకున్నాడు. వారసలే కొత్తవ్యక్తులు. తానేమో వానరుడు. వారేమో నరులు. తనను చూస్తే, వారు సరిగ్గా సమాధానం ఇస్తారో ఇవ్వరో అనే ఉద్దేశంతో వృద్ధబ్రాహ్మణ వేషం ధరించి, వారివద్దకు వెళ్లాడు. నమస్కరించి, ‘‘అయ్యా! మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? చూడటానికి బ్రాహ్మణుల్లా ఉన్నారు. కానీ, ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. బలిష్టంగా ఉన్నారు. మీ నడకను బట్టి, వేషభాషలను బట్టి మీరు ఈ ప్రాంతానికి కొత్తవారని అర్థమవుతోంది. మీరు ఏ పని మీద వచ్చారో తెలిస్తే, నేను మీకు సాయపడగలను’’ అని ఎంతో వినయంగా అన్నాడు. హనుమకు ప్రతినమస్కారం చేశాడు రాముడు. తామెవరో, ఏ పని మీద వచ్చారో క్లుప్తంగా తెలియజేశాడు. తన సోదరుడైన లక్ష్మణుని పరిచయం చేశాడు. వారి మాటలకు ఎంతో ఆనందపడ్డాడు హనుమ. ‘‘మా రాజు సుగ్రీవుడు. ఎంతో బలమైనవాడు. అయితే అంతకన్నా బలశాలి, అన్నగారు అయిన వాలితో విరోధం. వాలికి ఎవరూ ఎదురు నిలిచి పోరాడలేరు. ఎందుకంటే తన ఎదురుగా నిలిచిన వారి బలాన్ని గ్రహించే శక్తి కలిగిన అన్నగారంటే అమిత భయం. అందుకే ఆయన కంట పడకుండా ఈ పర్వతం మీద తలదాచుకుంటున్నాడు. మీరు వచ్చిన కార్యం నెరవేరాలంటే మీరు సుగ్రీవుడితో స్నేహం చెయ్యండి. ఆయనకు అపారమైన వాన రగణం అనుచరులుగా ఉన్నారు. వారి సహకారంతో సీతాన్వేషణ మీకు సులువవుతుంది. అలాగే వాలిని ఎదిరించి పోరాడాలంటే మీవంటి అమిత పరాక్రమశాలురు స్నేహితులుగా ఉండటం సుగ్రీవుడికి కూడా అవసరమే. మీరు నాతో రండి’’ అంటూ ముందుకు దారి తీశాడు. సమయోచిత వేషధారణ, సమయోచితంగా సంభాషించగలిగే సామర్థ్యాన్ని గురించి వ్యక్తిత్వ వికాస తరగతుల్లో కూడా బోధిస్తూ ఉంటారు. అలాంటి సమయోచిత వేషధారణ, సంభాషణా చాతుర్యం హనుమకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతో పెద్ద వాగ్విశారదుడని పేరు తెచ్చుకున్న రాముడంతటివాడు అతను మాట్లాడిన నాలుగు మాటలకే ఎంతో ముచ్చటపడి, ‘‘చూశావా లక్ష్మణా! హనుమ ఎలా మాట్లాడాడో, ఆయన మాట లు విన్నావా? ఇలా మాట్లాడేవాడు మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తుంటే- వేదాలన్నీ క్షుణ్ణంగా ఔపోసన పట్టినట్లు కనిపిస్తోంది. వ్యాకరణం ఈయనకు కొట్టిన పిండి వంటిదనిపిస్తోంది. ఉపనిషత్తుల అర్థం పూర్తిగా తెలుసనుకుంటా. అందుకే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడం లేదు. లలాటమూ కదలడం లేదు. వాక్యం లోపలి నుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నట్లు లేదు. గట్టిగానూ లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలాగే పలుకుతున్నాడు. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి, మన దగ్గరకు వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు’’ అని అన్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు హనుమ ఆనాటి గొప్ప కమ్యూనికేటర్ అని. ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు, ఉద్యోగజీవితంలో, వ్యక్తిగత జీవితాలలో సందర్భోచిత వేషధారణ, మాటలను హనుమంతుడిని చూసి నేర్చుకోవాలి. -
వినేవాళ్లు ఉండాలేగానీ...
సోల్ / చాడీలు వదంతులను వ్యాప్తిలోకి తేవడంలానే చాడీలు చెప్పడం కూడా కొందరికి ఒక కాలక్షేపం. స్వప్రయోజనాల సాధన కోసం కొందరు చాడీలు చెబుతారు. ఇద్దరి మధ్య తగవు పెట్టడానికి ఇంకొందరు చాడీలు చెబుతారు. ఎదుటివారి అభివృద్ధినిఅడ్డుకోవడానికి మరికొందరు చాడీలు చెబుతారు. చెప్పేవారు సరే, ఏమైనా చెబుతారు, ఎన్నయినా చెబుతారు. ‘కుఛ్తో లోగ్ కహేంగే... లోగోంకా కామ్ హై కెహనా...’ వినేవాళ్లు లేకుంటే ఎంతటి చాడీకోర్లయినా ఏం చెప్పగలరు చెప్పండి? వినేవాళ్లకు వివేకం, ఇంగితజ్ఞానం లోపించినప్పుడే చాడీలు చెప్పేవాళ్లు చెలరేగిపోతారు. లోకంలో చాడీకోర్లు వర్ధిల్లుతున్నారంటే అది వాళ్ల తప్పు కాదు, వినేవాళ్లకు కామన్సెన్స్ లేకపోవడమే అందుకు అసలు కారణం. అసూయే మూలం సాటివారి పురోగతిపై అసూయ మితిమీరినప్పుడు, జీవితంలో వారిని అధిగమించే శక్తిసామర్థ్యాలు లోపించినప్పుడు వారిని ఇతరుల ద్వారానైనా సాధించాలనే ఉద్దేశంతో చాలామంది చాడీలు చెబుతారు. ఏమీ చేతగాని అసూయాపరులే చాడీలు చెప్పడాన్ని ఒక లలితకళలా సాధన చేస్తారు. మొహమాటానికో, ముఖస్తుతికో అలవాటుపడిన కొందరు అలాంటి చాడీలను వీనులవిందుగా వింటారు. నిజానికి చాడీల వల్ల చెప్పేవాళ్లకు, వినేవాళ్లకు పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. అదొక తాత్కాలిక మానసికానందం మాత్రమే. మానవులకు గల నానా అవలక్షణాల్లో చాడీలు చెప్పడం కూడా ఒకటని ప్రపంచంలోని అన్ని మతాలూ పరిగణిస్తున్నాయి. ఇతరులపై చాడీలు చెప్పడం అత్యంత నీచమైన అవలక్షణమని, ఇలాంటి అవలక్షణాన్ని విడనాడాలని బోధిస్తున్నాయి. అయితే, ఇలాంటి హితబోధలను పట్టించుకునేవారు ఎందరు? మతాలు మతాలే, మానవ స్వభావాలు మానవ స్వభావాలే! పురాణాల్లో చాడీకోర్లు చాడీలు చెప్పడమేమీ ఆధునిక కళ కాదు. పురాణకాలం నుంచే ఈ కళలో ఆరితేరిన వారు కొందరున్నారు. మన పురాణాల్లోని చాడీకోర్లలో ముఖ్యంగా నారదుడిని, మంథరను, శకునిని గుర్తు చేసుకోవచ్చు. బ్రహ్మమానస పుత్రుడైన నారద మహాముని నారాయణ నామస్మరణ చేసుకుంటూ, మహతిని మీటుకుంటూ త్రిలోక సంచారం చేసేవాడని ప్రతీతి. ముల్లోకాలూ తిరిగే నారద మహామునికి కలహభోజనుడనే పేరు కూడా ఉంది. ఎవరికైనా కయ్యం పెట్టనిదే ఆయనగారికి కడుపు నిండదు. బ్రహ్మదేవుడి ద్వారానో, బోళాశంకరుడి ద్వారానో వరాలు పొంది, బలగర్వంతో విర్రవీగే రాక్షసరాజుల వద్దకు వెళ్లి దేవతల మీద చాడీలు చెప్పి రెచ్చగొట్టేవాడు. బుద్ధితక్కువ రాక్షసరాజులు ఆ మాటలకు అనవసరంగా రెచ్చిపోయేవారు. దేవతలతో కయ్యానికి కాలు దువ్వేవారు. చివరకు ఏ మహావిష్ణువో, ఆదిపరాశక్తో వచ్చి, వాళ్లను సంహరించాక అక్కడికా కథ సుఖాంతమయ్యేది. విష్ణుభక్తుడైన నారద మహాముని ఏం చేసినా లోకకల్యాణానికేనని, ఆయన చెప్పే చాడీలు కూడా అందుకేనని పురాణాల సారాంశం. మంథర చాడీలు ఇక త్రేతాయుగంలో మంథర పేరుమోసిన చాడీకోరు. ఆమె చాడీల దెబ్బకు ఏకంగా రామాయణమే మలుపు తిరిగింది. ‘దశరథ మహారాజు రాముడికి పట్టం కట్టాలనుకుంటున్నాడు. అదే జరిగితే నీ కొడుకు భరతుడి గతేం కాను..?’ అంటూ కైకకు నూరిపోసి, దశరథుడు ఏనాడో ఆమెకు ఇచ్చిన వరాలను గుర్తుచేసి రెచ్చగొట్టింది. కైక ఆ వరాల కోసం దశరథుడిని సాధించింది. ఫలితంగా రాముడు సీతా లక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్లాడు. పుత్ర వియోగంతో దశరథుడు పరలోకానికి పయనించాడు. చాడీకోరు శకుని మహాభారతంలో శకుని ఆరితేరిన చాడీకోరు. కౌరవుల పంచన చేరిన శకుని దుష్టచతుష్టయంలో పెద్దతలకాయ. పాండవులపై చాడీలు చెబుతూ ఎదిగీ ఎదగని వయసు నుంచే మేనల్లుడైన దుర్యోధనుడి బుర్ర పాడు చేసేవాడు. దుర్యోధనుడు చిన్నప్పటి నుంచే అలవిమాలిన అహంకారి. అహంకారికి కన్నూ మిన్నూ కానదు. అలాంటి స్థితిలో ఉన్నవాడికి విదుర, భీష్మాదులు చెప్పే హితవచనాల కంటే, శకుని మామ చెప్పే చాడీలే పసందుగా ఉండేవి. చాడీకోరు శకునిని ఆంతరంగిక బృందంలో పెట్టుకున్న దుర్యోధనుడు ఎలా దుంపనాశనమయ్యాడో మనందరికీ తెలిసిందే. ఇవీ అనర్థాలు చాడీలు చెప్పేవాళ్లందరూ నారద మహామునులు కాదు. అందువల్ల వాళ్లు చెప్పే చాడీల కారణంగా లోకకల్యాణం మాట దేవుడెరుగు గానీ, నానా అనర్థాలు జరగడం మాత్రం తథ్యం. చాడీల వలలో పడితే ప్రాణస్నేహితులు కూడా బద్ధశత్రువులుగా మారిపోతారు. భార్యాభర్తల్లో ఎవరు చాడీలు నమ్మినా ఇద్దరూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం ఖాయం. చాడీల మాయలో చిక్కుకుంటే, తల్లిదండ్రులకు పిల్లలకు నడుమ కూడా కీచులాటలు వస్తాయి. చాడీకోర్ల మాటలను బాసులు నమ్మితే, ఆఫీసుల్లోని అమాయక జీవులు ఉద్యోగాలను పోగొట్టుకుని వీధిన పడతారు. చాడీలు చెప్పేవాళ్లు చెబుతూనే ఉంటారు. వాళ్ల స్వభావాన్ని మార్చడం దుస్సాధ్యం. అయితే, వినేవాళ్లు కాస్త ఇంగితంతో వివేకాన్ని ప్రదర్శించి, ‘వినదగునెవ్వరు చెప్పిన...’ అనే సుమతీ శతకకారుని హితోక్తిని మననం చేసుకుని, సంయమనంతో వ్యవహరిస్తే చాడీల వల్ల తలెత్తే అనర్థాలను నివారించుకోవచ్చు.