BJP 38 Party Grand Show Of Strength In Delhi - Sakshi
Sakshi News home page

'చిన్న చిన్న స్వార్థాల కోసం సిద్ధాంతాల్ని వదిలేశారు'.. విపక్ష భేటీపై ప్రధాని మోదీ ఫైర్‌..

Published Tue, Jul 18 2023 7:06 PM | Last Updated on Tue, Jul 18 2023 10:00 PM

BJP 38 Party Grand Show Of Strength In Delhi  - Sakshi

ఢిల్లీ: దేశాభివృద్ధే తమ అజెండా అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశం కోసం పనిచేయడంలో వెనకడుగు వేయబోమని అన్నారు. తన శరీరంలో ప్రతి కణం.. ప్రతీ క్షణం దేశం కోసమే కేటాయించానని ప్రధాని చెప్పారు. ఎన్డీఏ భేటీ అనంతరం మాట్లాడిన మోదీ.. విపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగారు. తనను తిట్టేందుకు కేటాయించే సమయం.. దేశం కోసం కేటాయిస్తే బాగుండునని అన్నారు.

చిన్న చిన్న స్వార్థాలతో విపక్షాలు సిద్ధాంతాలను పక్కన పెడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. నిత్యం విమర్శించుకునే వీళ్లంతా ఒక్కదగ్గరికి చేరుతారేమో గానీ ముందుకు సాగలేరని ప్రతిపక్షాలనుద్దేశించి ప్రధాని మోదీ చెప్పారు. కశ్మీర్‌లో ఎన్సీ, పీడీపీ రోజూ తిట్టుకుంటాయని అన్నారు. బంగాల్‌లో టీఎంసీ, కాంగ్రెస్, కమ్యునిస్టుల మధ్య ఎప్పుడూ గొడవలేనని చెప్పారు.

ఎన్డీఏ హిస్టరీ, కెమిస్ట్రీ తెలుసు..
ఎన్డీఏ హిస్టరీ, కెమిస్ట‍్రీ ప్రజలకు తెలుసని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో 250 చోట్ల తమకు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. నిజాయితీగా పనిచేశామని చెప్పిన మోదీ.. ఈ సారి కూడా  అలాంటి ఓట్ షేర్‌నే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

ఎన్డీఏ హయాంలోనే దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని తెలిపారు. ఎన్నికల ఏడాది దేశ రాజకీయాలను విదేశాలు కూడా గమనిస‍్తాయని తెలిపిన మోదీ..  అధికారం ముగిసిపోయే పార్టీలతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పారు. కానీ  భారత్‌తో అమెరికా, ఫ్రాన్స్ దేశాలు స‍్నేహం చేస్తున్నాయని తెలిపారు. 

ఇదీ చదవండి: కళ్లముందు కూటమి కనిపిస్తున్నా.. కలిసుండేది కష్టమే.. ఎవరి లెక్కలు వారివి..

ఎన్డీఏ భేటీ..
2024కు ముందు దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నేడు బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశం  కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రోజు ఢిల్లీలోని అశోక హోటల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది.  

భారతావని అంతటా విస్తరించి ఉన్న తమ కూటమి భాగస్వాములతో నేడు సమావేశం జరగనుండటం సంతోషంగా ఉందని భేటీకి ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరడానికి, దేశ అభివృద్ధికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముందు  కూటమిలో ఉన్న పార్టీల నేతలు ప్రధాని మోదీకి పూల మాలతో సత్కరించారు. 

అయితే.. ఎన్డీఏ కూటమికి హాజరైన పార్టీలు చాలావరకు చిన్న పార్టీలు. తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలు కాగా.. మరికొన్నింటికి అసలు ఎంపీలే లేరు. ఏదైమైనా.. ఈ భేటీతో వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో తేల్చుకునే అవకాశంగా ఈ భేటీని చిన్న పార్టీలు భావిస్తున్నాయి. 

దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతదేశంతో సహా ప్రధాన రాష్ట్రాల్లో తన స్థానం నిలుపుకుంది. ఉత్తరప్రదేశ్, బిహార్‌లాంటి రాష్ట్రాల్లో పట్టు నిలుపుకోవడానికి తగిన అన్ని చర్యలు చేపడుతోంది. 

ఇదీ చదవండి: విపక్షాల కూటమికి నాయకుడు ఎవరు..? తేల్చేది ఎవరు..? పెదవి విప్పిన ఖర్గే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement