
పోలవరం ఎమ్మెల్యేకు చేదు అనుభవం
పోలవరం: పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ కు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం గూటాల వద్ద ఇసుక ర్యాంపును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను డ్వాక్రా మహిళలు అడ్డుకున్నారు. ఇసుక ర్యాంపు కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు.
మహిళలతో టీడీపీ కార్యకర్తలు వాగ్వదానికి దిగారు. మహిళలను పక్కకు తోసేశారు. తర్వాత ఎమ్మెల్యేతో ఇసుక ర్యాంపును ప్రారంభింపజేశారు. తమపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యానికి నిరసనగా మహిళలు అక్కడే బైఠాయించారు.