కృష్ణా(మైలవరం): డ్వాక్రా రుణ మాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మైలవరం మండల కేంద్రంలో పలువురు డ్వాక్రా సంఘాల మహిళలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వం తమ ఖాతాలో వేసిన రూ.3 వేలు కూడా తీసుకునే అవకాశం లేదంటూ వారు అధికారులను అడ్డుకున్నారు. ఏపీఎం, పీవో, ఎంపీడీవోలను డ్వాక్రా లబ్ధిదారులు అడ్డుకుని తమ సమస్యలు వివరించి ఆవేదన వ్యక్తం చేశారు.