వైఎస్సార్ సీపీ నేతలను చంపడం ఆటవిక చర్య
- రుణమాఫీపై పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారు
- రూ.5 వేల కోట్లు ఏ మూలకు సరిపోతాయి
- జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం దుర్మార్గం
పీలేరు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయకులను చంపడం ఆటవిక చర్య అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీపై రాష్ట్ర మంత్రులు పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన పీలేరులో పర్యటించారు. మిథున్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఓట్లకోసం అమలుకు వీలుకాని హామీలను గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక వాగ్దానాలు విస్మరించి జీవోలతో సరిపెట్టుకుంటున్నారని ఆరోపిం చారు.
రాష్ట్ర బడ్జెట్ రూ.1.11 లక్షల కోట్లు ప్రవేశపెట్టి అందులో రుణమాఫీకి కేవలం రూ.ఐదు వేల కోట్లు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసే దమ్ములేక ఆర్‌బీఐపై సాకులు చెప్పడం టీడీపీ చేతగానితనానికి నిదర్శనమన్నారు. రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుంటే రాష్ట్రంలో టీడీపీ నేతలు, మంత్రులు తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఎటువంటి షరతులూ లేకుండా రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ నాయకులను టీడీపీ నాయకులు టార్గెట్ చేసి హత్యలకు పురమాయిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలలుగా రా ష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయని తెలిపారు. దీనిపై శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ములేక ఆయనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సమయం వ చ్చినపుడు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్ని ఇబ్బందు లు ఎదురైనా వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యలపై పోరాడుతుందని తెలిపారు.
పీలేరు, కేవీపల్లె జెడ్పీటీసీలు ఎం.రెడ్డిబాషా, జీ.జయరామచంద్రయ్య, పార్టీ మండలాధ్యక్షుడు నారే వెంకట్రమణారెడ్డి, ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యు డు కడప గిరిధర్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యు డు ఎస్.హబీబ్‌బాషా, స్టాంప్‌ల మస్తాన్, పార్టీ నాయకులు కే.ఆనంద్, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, వెంకట్రమణ, అల్లాబక్షు, గౌస్‌బాషా, రంగన్న, జయపాల్‌రెడ్డి, గాయం భాస్కర్‌రెడ్డి, బాబ్జిరెడ్డి, ద్వారకనాథరెడ్డి, నవాజ్, మునికృష్ణ, రాజేష్, హరిరాయల్, ఆనంద్‌రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.