peddireddi Mithun Reddy
-
కుప్పంలో ఎవరినీ అరెస్ట్ చేయలేదు: ఎంపీ మిథున్‌రెడ్డి
-
సామాన్యుడిపై కక్ష సాధింపు
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తిరువతి: ప్రభుత్వం సామాన్యుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వం కరెంటు చార్జీలు, డీజిలు, పెట్రోలు ధరల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తోంది. బొగ్గు ధరలు తగ్గినా విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోంది. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతున్నా, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోలు, డీజిలు ధరలపై లీటరుకు *4 ఆధారిత పన్ను (వ్యాట్) విధించింది. దీని ప్రభావం నిత్యావసర పస్తువులతో పాటు అన్ని వర్గాలపై పడుతుంది. ఎస్సీ కాలనీల్లో విద్యుత్ మీటర్లు ఉన్నా బకాయిలు చెల్లించలేదని కేసులు పెడుతున్నారు. 2004 నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. రైతులంటే ఈ ప్రభుత్వానికి విలువ లేదు. రైతులు, సామాన్య ప్రజలపైన కక్ష సాధింపు చర్యలకు ఒడిగడుతోంది. అన్నదాతలపై కక్షసాధింపు చర్యలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజల తరపున పోరాటాలు చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదు’’అని హెచ్చరించారు. -
ఢిల్లీలో పర్యటించి ఏం సాధించారు?
సీఎం చంద్రబాబుపై ఎంపీ మిథున్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవటంలో ఏపీ సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసిన సీఎం ఏం సాధించారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని చంద్రబాబు గద్దె నెక్కినప్పటి నుంచీ పదేపదే చెబుతున్నారు. మరో నెలలో కేంద్రం కొత్త బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతోంది. ప్రధాని, ఆర్థిక మంత్రిని కలిసినపుడు నిర్దిష్టమైన తేదీలోగా రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని ఏమైనా హామీ ఇచ్చారా? కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో ఈ రూ. 16 వేల కోట్లు తేగలరా? లేదా?’ అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీల విషయంలో ఎలాంటి పురోగతి లేదన్నారు. చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద మంజూరైన మన్నవరం బీహెచ్ఈఎల్ ప్రాజెక్టు నిర్మాణం ప్రహరీ గోడ ఏర్పాటుకే పరిమితమైందన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అతీగతీ లేకుండా పోయిందన్నారు. చిత్తూరులో చక్కెర కార్మాగారాన్ని మూసి వేస్తున్నట్లు రైతులకు నోటీసులు ఇవ్వటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హామీ మాట దేవుడెరుగు సీఎం సొంత జిల్లాలోనే ఫ్యాక్టరీ కాపాడుకోలేకపోవడం దారుణమని విమర్శించారు. ఒక్క ప్రాజెక్టైనా సాధించారా? ‘విభజన చట్టంలో గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీని నెలకొల్పుతామన్నారు. దానిపై ఎలాంటి పురోగతి లేదు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏమైందో తెలియదు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మిస్తామన్నారు. విమానయాన మంత్రి మన రాష్ట్రానికి చెందినవారైనా ఫలానా తేదీలోగా అంతర్జాతీయ హోదా కల్పిస్తామని చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కాగితాలకే పరిమతిమైంది. దీనికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నిధులివ్వలేదు’ అని మిథున్ విమర్శించారు. వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్నా చంద్రబాబు కేంద్రం నుంచి ఏమీ సాధించలేకపోయారని విమర్శించారు. -
వైఎస్సార్ సీపీ నేతలను చంపడం ఆటవిక చర్య
రుణమాఫీపై పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారు రూ.5 వేల కోట్లు ఏ మూలకు సరిపోతాయి జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం దుర్మార్గం పీలేరు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయకులను చంపడం ఆటవిక చర్య అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీపై రాష్ట్ర మంత్రులు పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన పీలేరులో పర్యటించారు. మిథున్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఓట్లకోసం అమలుకు వీలుకాని హామీలను గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక వాగ్దానాలు విస్మరించి జీవోలతో సరిపెట్టుకుంటున్నారని ఆరోపిం చారు. రాష్ట్ర బడ్జెట్ రూ.1.11 లక్షల కోట్లు ప్రవేశపెట్టి అందులో రుణమాఫీకి కేవలం రూ.ఐదు వేల కోట్లు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసే దమ్ములేక ఆర్బీఐపై సాకులు చెప్పడం టీడీపీ చేతగానితనానికి నిదర్శనమన్నారు. రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుంటే రాష్ట్రంలో టీడీపీ నేతలు, మంత్రులు తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఎటువంటి షరతులూ లేకుండా రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను టీడీపీ నాయకులు టార్గెట్ చేసి హత్యలకు పురమాయిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలలుగా రా ష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయని తెలిపారు. దీనిపై శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ములేక ఆయనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సమయం వ చ్చినపుడు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్ని ఇబ్బందు లు ఎదురైనా వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యలపై పోరాడుతుందని తెలిపారు. పీలేరు, కేవీపల్లె జెడ్పీటీసీలు ఎం.రెడ్డిబాషా, జీ.జయరామచంద్రయ్య, పార్టీ మండలాధ్యక్షుడు నారే వెంకట్రమణారెడ్డి, ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యు డు కడప గిరిధర్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యు డు ఎస్.హబీబ్‌బాషా, స్టాంప్‌ల మస్తాన్, పార్టీ నాయకులు కే.ఆనంద్, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, వెంకట్రమణ, అల్లాబక్షు, గౌస్‌బాషా, రంగన్న, జయపాల్‌రెడ్డి, గాయం భాస్కర్‌రెడ్డి, బాబ్జిరెడ్డి, ద్వారకనాథరెడ్డి, నవాజ్, మునికృష్ణ, రాజేష్, హరిరాయల్, ఆనంద్‌రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు. -
అన్నదాతకు ఆసరా ఇవ్వండి
నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజి నిర్మించండి పట్టణ, గ్రామీణ ప్రజల దాహార్తి తీర్చండి లోక్‌సభలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్ సాక్షి ప్రతినిధి, తిరుపతి : దుర్భిక్షంతో తల్లడిల్లుతోన్న రైతులను ఆదుకోవాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం లోక్‌సభలో కరవుపై జరిగిన చర్చలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ గత ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇప్పటిదాకా ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం మంజూరు కాలేదన్నారు. తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్ని మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని.. రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. వర్షాభావం వల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఉపాధిహామీ పథకం కింద రైతులు, రైతు కూలీలకు భారీ ఎత్తున పని కల్పించాలని సూచించారు. వరుస కరవుతో భూగర్భజలాలు అడుగంటిపోయాయని.. కనీసం తాగునీళ్లు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లె, రాయచోటి, రాజంపేట వంటి పట్టణాల్లో 15 రోజులకు ఒకసారి నీళ్లందిస్తున్న విషయాన్ని లోక్‌సభ దృష్టికి తెచ్చారు. రాజంపేట నియోజకవర్గం పరిధిలోనే కాకుండా చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో అనేక గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. తక్షణమే చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ మండలాల్లో, వైఎస్సార్ జిల్లాలో టమాటా వంటి కాయగూర పంటలు విస్తారంగా సాగుచేస్తారన్నారు. టమాటా అధికంగా దిగుబడి వచ్చినప్పుడు ధర దక్కక.. తక్కువ దిగుబడి ఉన్నప్పుడు ఎక్కువగా ధర ఉండటం వల్ల రైతులు లాభపడటం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నా.. ప్రజలకు కూరగాయల ధరలు అందుబాటులో ఉండాలన్నా తక్షణమే నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజీ గోదాము నిర్మించాలని డిమాండ్ చేశారు.