సాక్షి, చిత్తూరు: ఇసుకను మీ-సేవ, ఆన్‌లైన్ ల ద్వారా వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఒక టి రెండు రోజుల్లోనే ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం జిల్లావ్యా ప్తంగా 25 ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు కేటాయించారు. ఇరిగేషన్ అధికారుల సూచనల మేరకు జిల్లా స్థాయి కమిటీ 37 ఇసుక రీచ్‌లను గుర్తించినా మొదటి విడతలో 25 రీచ్‌లను మాత్రమే ఆయా పంచాయతీల పరిధిలోని డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. వినియోగదారుడు ట్రాన్స్‌పోర్ట్ చార్జీల సహా ధరను మీ-సేవ ద్వారా చెల్లిస్తే ప్రభుత్వమే ఇసుకను అతడి ఇంటికి సరఫరా చేస్తుంది. వినియోగదారుడు 9 క్యూబిక్ మీటర్ల ఇసుక వరకూ మీ-సేవలో... ఆ పైన ఇసుక కావలసి వస్తే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుకను సరఫరా చేయనున్నారు.
ఇసుక ధర :ఒక్క క్యూబిక్ మీటరు ఇసుక ధర *300లుకాగా, సీనరీస్ చార్జెస్ *40తో కలిపి మొత్తం 340 రూపాయలు అవుతుంది. ఈ లెక్కన ట్రాక్టర్ ఇసుక (3 క్యూబిక్ మీటర్లు) ధర 1,020 రూపాయలు. కొన్ని చెరువులు,కాలువలు,చెక్‌డ్యామ్‌లలో దొరికే నాసిరకం ఇసుకను(సిల్ట్) మాత్రం క్యూబిక్ మీటర్ *260 చొప్పున విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. ఇక ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించి 5 కిలోమీటర్లలోపు దూరంలో అయితే ట్రాక్టర్ ఇసుకకు *350 బాడుగగా నిర్ణయించారు. ఆ పైన 10 కిలోమీటర్లలోపు ఉంటే 550 రూపాయలు,10 కిలోమీటర్ల పైన ఉంటే మాత్రం ప్రతి కిలోమీటర్‌కు అదనంగా *28 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్‌లు :
చిత్తూరు,జీడీ నెల్లూరు మండలాల్లో గయారాంపల్లి,నందనూరు, అంగళ్లు, బీఎన్నార్‌పేట తదితర ప్రాం తాల పరిధిలో ఉన్న నీవా నదిలో 7 ఇసుక రీచ్‌లను గుర్తించగా, చిత్తూరు, పూతలపట్టు మండలాల పరిధిలో మరో 4 రీచ్‌లు, తొట్టంబేడు మండల పరిధిలో స్వర్ణముఖి నదిలో 3 రీచ్‌లు,బీఎన్ కండ్రిగ మండలం కాళంగి నదిలో 3 రీచ్‌లు, కలికిరి మండలంలో 6 రీచ్‌లు చొప్పున మొత్తం 37 రీచ్‌లను గుర్తించినట్లు జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకరరావు. తెలిపారు. తొలుత 25 రీచ్‌లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నేడో రేపే మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఇసుక రీచ్‌లను ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఆన్‌లైన్ ఇసుక రెడీ !
Published Fri, Nov 28 2014 2:37 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM
Advertisement