అనంతపురం జిల్లాలోని గుత్తిలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది.
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుత్తిలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. రుణమాఫీపై టీడీపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘనాథరెడ్డి, పరిటా సునీతలను గురువారం అనంతపురంలో ఓ డ్వాక్రా మహిళ నిలదీసింది. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు.. టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లైన ఒక్క రూపాయి మాఫీ కాలేదని సాలమ్మ అనే డ్వాక్రా మహిళ మంత్రులను నిలదీసింది.