లోకేష్‌ ఇంటికి ఒకేసారి టీడీపీ మంత్రుల క్యూ.. ‘కూటమి’లో ఏం జరుగుతోంది? | 18 TDP MLAs Went To Nara Lokesh House At Same Time | Sakshi
Sakshi News home page

లోకేష్‌ ఇంటికి ఒకేసారి టీడీపీ మంత్రుల క్యూ.. ‘కూటమి’లో ఏం జరుగుతోంది?

Published Wed, Nov 6 2024 5:09 PM | Last Updated on Wed, Nov 6 2024 6:18 PM

18 TDP MLAs Went To Nara Lokesh House At Same Time

సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి నారా లోకేష్‌ ఇంటికి ఒకేసారి 18 మంది టీడీపీ మంత్రులు క్యూ కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఈ రోజు ఉదయం మంత్రులందరినీ లోకేష్‌ తన ఇంటికి పిలిపించుకోగా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చినందుకు అభినందనలు తెలిపినట్లు లోకేష్‌ టీం ప్రకటించింది.

లోకేష్‌ పిలవగానే 18 మంది టీడీపీ సీనియర్‌, జూనియర్‌ మంత్రులు హాజరయ్యారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన నారా లోకేష్‌ తనకు విషెస్‌ చెప్పించుకోవడానికి మంత్రులందరిని ఇంటికి రప్పించుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌, బీజేపీ మంత్రి సత్యకుమార్‌ మాత్రం లోకేష్‌ను అభినందించలేకపోవడం కూడా కూటమి వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కాగా, ఒక మంత్రి ఇంటికి ఒకేసారి మంత్రులు వెళ్లడం ఏపీలో ఎప్పుడు ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. రాష్ట్రంలో ఇప్పటికే  లా అండ్‌ ఆర్డర్‌ ఫెయిల్‌ అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో లోకేష్‌ ఎందుకు 18 మంది టీడీపీ మంత్రులను ప్రత్యేకంగా పిలిపించుకున్నారనే సందేహాలు కలుగుతున్నాయి.

లోకేష్ ఇంటికి టీడీపీ మంత్రులు..

ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement