TDP Ministers
-
కూటమి ప్రభుత్వం కమీషన్ల దందా
-
ఆపరేషన్ బుడమేరు ఎప్పుడు..?
-
ఏపీ అసెంబ్లీలో మంత్రుల తీరుపై TDP MLA కూన రవి విమర్శలు
-
లోకేష్ ఇంటికి ఒకేసారి టీడీపీ మంత్రుల క్యూ.. ‘కూటమి’లో ఏం జరుగుతోంది?
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి నారా లోకేష్ ఇంటికి ఒకేసారి 18 మంది టీడీపీ మంత్రులు క్యూ కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఈ రోజు ఉదయం మంత్రులందరినీ లోకేష్ తన ఇంటికి పిలిపించుకోగా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చినందుకు అభినందనలు తెలిపినట్లు లోకేష్ టీం ప్రకటించింది.లోకేష్ పిలవగానే 18 మంది టీడీపీ సీనియర్, జూనియర్ మంత్రులు హాజరయ్యారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన నారా లోకేష్ తనకు విషెస్ చెప్పించుకోవడానికి మంత్రులందరిని ఇంటికి రప్పించుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బీజేపీ మంత్రి సత్యకుమార్ మాత్రం లోకేష్‌ను అభినందించలేకపోవడం కూడా కూటమి వర్గాల్లో చర్చ నడుస్తోంది.కాగా, ఒక మంత్రి ఇంటికి ఒకేసారి మంత్రులు వెళ్లడం ఏపీలో ఎప్పుడు ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. రాష్ట్రంలో ఇప్పటికే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో లోకేష్ ఎందుకు 18 మంది టీడీపీ మంత్రులను ప్రత్యేకంగా పిలిపించుకున్నారనే సందేహాలు కలుగుతున్నాయి.ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు! -
మంత్రి సుభాష్ కు చంద్రబాబు వార్నింగ్
-
పుంగనూరుకు టీడీపీ మంత్రులు.. ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్
-
కారుకూతలు కూస్తే ఖబడ్దార్
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై కారుకూతలు కూస్తూ... లేనిపోని రాద్ధాంతాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తెలుగుదేశం నాయకులకు జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర తీవ్రస్థాయిలో హెచ్చరించారు. బుధవారం నగర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఓ సంఘటనను బూచిగా చూపిస్తూ టీడీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపైన దాడికి పాల్పడిన వీళ్లా మహిళల రక్షణ గురించి ప్రశ్నించేదన్నారు. ఇదేనా మహిళలపై గౌరవమని ధ్వజమెత్తారు. మచ్చలేని ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం జగన్‌పై బురద చల్లేందుకు గోతికాడి గుంట నక్కలా ఎదురు చూస్తున్నారని విమర్శించారు. మహిళల రక్షణకు దిశ చట్టంగా మార్చేందుకు సహకరించపోవడం దారుణమన్నారు. టీడీపీ హయాంలో విజయవాడలో బాలికపై ఓ కార్పొరేటర్ అఘాయిత్యానికి పాల్పడినప్పుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదన్నారు. ఆనాడు ఓ గిరిజన ఎమ్మెల్యేపైన దేశ ద్రోహం కేసు నమోదు చేశారు? అప్పుడు గుర్తుకు రాలేదా? ఈ అక్కచెల్లెలు అని ప్రశ్నించారు. చట్టసభలో ఎమ్మెల్యే రోజాను ఈడ్చుకెళ్లింది మీరు కాదా అని ప్రశ్నించారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎమ్మార్వో వనజాక్షి, రితేశ్వరి లాంటి బాధిత మహిళలు ఎందరో ఉన్నారన్నారు. ఎన్నో కళాశాలలో విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు. ఉనికి చాటుకోవడానికి లేనిపోని రాద్ధాంతాలు చేసి అభాసు పాలవుతున్నారన్నారు. ప్రజలకు మేలు చేసే వి«ధంగా ప్రజల్లోకి వెళ్లండి, చిల్లర వేషాలు మానుకోవాలని హితువు పలికారు. పేదలకు పట్టాల పంపిణీ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఆరోపణలతో పబ్బం గడుపుకోవాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి:ఉన్మాద పాలన ఘనత చంద్రబాబుది: రాష్ట్రంలో ఉన్మాద పాలన సాగించిన ఘనుడు చంద్రబాబు అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వ్యాఖ్యానించారు. తహసీల్దార్పైన, అధికారులపైనా టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన వేధింపులు, చిత్రహింసలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బిక్కుబిక్కుమంటూ మహిళలు గడిపేవారన్నారు. దిశా యాప్‌తో మహిళలు నేడు ఎంతో ధైర్యంగా ఉన్నారన్నారు. ఇది చూసి ఓర్వలేక చేస్తున్న కుట్రలు అందరికి అర్థమవుతున్నాయన్నారు. మాది ఆడబిడ్డలకు అండగా ఉండే ప్రభుత్వమని పేర్కొన్నారు. మహిళలకు రాజ్యాధికారం ఇచ్చేందుకు 50 శాతం నామినేటెడ్ పదవులతో ఉన్నత స్థానంలో కూర్చొబెట్టామన్నారు. అగ్రవర్గాల మహిళలకు ఈబీసీ కింద రుణాలు, గ్రామ సచివాలయాల్లో 2 లక్షల ఉద్యోగులు ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యల చేయడానికి వంగలపూడి అనితకు అర్హత లేదన్నారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళా పుట్టుకనే హేళన చేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. బెయిల్ కోర్టులిస్తాయా.. ప్రభుత్వాలు ఇస్తాయో మాజీ ఎమ్మెల్యే అనితకు తెలియకపోవడం దురదృష్టమన్నారు. 14 ఏళ్ల పాలనలో మహిళల కోసం ఏం చేయలేని చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని కోరుతున్నానన్నారు. నారా లోకేష్ పీఏ టీడీపీ ఆఫీస్‌లో ఇబ్బందులున్నాయని చెప్పినప్పడు తెలుగు మహిళల నోరు ఎందుకు లేవలేదన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్లో అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధాలున్నాయని తెలిసినప్పడు నిరసన ఎందుకు చేయలేదన్నారు. ధ్వజమెత్తిన మహిళా నాయకులు... రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేయడం మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైఎస్సార్సీపీ మహిళా నాయకులు హెచ్చరించారు. దిశ యాప్ పట్ల లేనిపోని రాద్ధాంతం చేయాలని చూస్తే మహిళలు ఉగ్రరూపం దాల్చాల్సి వస్తుందని పలు కార్పొరేషన్ల చైర్మన్లు కొండా రమాదేవి, పిళ్లా సుజాత, చొక్కాకుల లక్ష్మి, మాధవివర్మ, చిన్నతల్లి, వైఎస్సార్ సీపీ మహిళా నాయకులు పేడాడ రమణకుమారి, నల్ల కృపాజ్యోతి హెచ్చరించారు. (చదవండి: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీదే విజయం :పుష్ప శ్రీవాణి) -
పచ్చ నేతల దగా.. అసైన్డ్ భూములు స్వాహ
సాక్షి, అమరావతిబ్యూరో : ‘అసైన్డ్, లంక భూముల్ని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. పట్టాలేని భూములు మా నుంచి దూరమవుతాయనే భయంతో వచ్చిన ధరకు విక్రయించాం. భూములన్నీ టీడీపీ నాయకులు కొన్నాక ప్రభుత్వం అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. అప్పుడు కూడా ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపింది. మెట్ట, అసైన్డ్, లంక భూములకు జరీబు భూములకు ఇచ్చే ప్యాకేజీ ఇవ్వాలని నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం కోసం విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. ఈ ఎన్నికల్లో మళ్లీ ఓట్ల కోసం ‘కొత్త’ హామీలు ఇచ్చేందుకు టీడీపీ నాయకులు వస్తున్నారు. దళితులంతా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం’ అని రాజధాని ప్రాంత దళిత రైతులు అంటున్నారు. సాక్షి ‘రచ్చబండ’లో వారు తమ ఆవేదనను పంచుకున్నారు. ఇంత మోసం చేస్తారనుకోలేదు తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. తుళ్లూరు మండలంలోని రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, మందడం, వెంకటపాలెం తదితర లంకల్లో సుమారు రెండు వేల ఎకరాల వరకు అసైన్డ్ భూమి ఉంది. ఈ భూములన్నీ కృష్ణా నది మధ్యలో, నదికి కిలోమీటరు దూరంలో ఉన్నాయి. రాజధానిగా ఈ ప్రాంతాన్ని ప్రకటించిన మొదట్లో లంక భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదని మభ్యపెట్టడంతో కొంత మంది దళిత రైతులు భూములు అమ్ముకున్నారు. ఆ భూముల్లో అధిక శాతం అధికార పార్టీ నాయకులే కొనుగోలు చేశారు. తర్వాత లంక భూములకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. – పొన్నూరు రాఘవులు, దళిత రైతు, లింగాయపాలెం ఈ వ్యత్యాసం ఎందుకు? పట్టా ఉన్న జరీబు భూమికి వెయ్యి గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాట్లను పరిహారంగా ఇస్తున్నారు. మెట్ట భూమికి వెయ్యి గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాట్లను కేటాయించారు. పేద రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములకు(అసైన్డ్) ఎకరా జరీబు భూమికి 800 గజాల నివాస, 200 గజాల వాణిజ్య స్థలాలను... మెట్ట(అసైన్డ్) భూములకు 800 గజాల నివాస, 100 గజాల వాణిజ్య స్థలాలను కేటాయించింది. లంక భూములకు ఎకరా జరీబు(అసైన్డ్)కు 800 చ.గజాల నివాస, 200 చ.గజాల కమర్షియల్ ప్లాట్లను కేటాయించింది. ఈ వ్యత్యాసం ఎందుకో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మాపై కుట్ర చేసి భూములు లాక్కుంటోంది. – కంతేటి ఫకీరయ్య, దళిత రైతు, తుళ్లూరు నాలుగేళ్లుగా పోరాడుతున్నాం పరిహారం విషయంలో ప్రభుత్వం మాపై తీవ్ర వివక్ష చూపిస్తోంది. జీవో 259 ప్రకారం పరిహారం పంపిణీ చేయాలని నాలుగేళ్లుగా కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. దీంతో ఓపిక నశించి గతేడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాం. వివక్షకు తావులేకుండా అన్ని భూములకు సమాన ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాం. మా భూములంత సారవంతమైనవి ఎక్కడా లేవు. రాజధాని పేరుతో మా భూముల్ని గద్దల్లా తన్నుకుపోయారు. – దాసరి సిలివేసు, దళితరైతు, తుళ్లూరు శివారు జమిందారీ భూములకు అన్యాయం మా వాళ్ల నుంచి కొనుగోలు చేసిన భూములకు ప్యాకేజీ మరీ దారుణంగా ఉంది. వందల ఏళ్లుగా ఈ భూములన్నీ మా ఆధీనంలోనే ఉన్నాయి. మా తాత, ముత్తాత కాలం నుంచి ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఎకరా జరీబు భూమికి కేవలం 500 చ.గజాల నివాస, వంద గజాల వాణిజ్య ప్లాట్లను ప్రభుత్వం ఇస్తోంది. ఏళ్ల నుంచి సాగు చేస్తూ, ఎలాంటి పట్టా లేని లంక భూములకు 250 చ.గజాల నివాస స్థలంతో ప్రభుత్వం సరిపెడుతోంది. మేం దళితులం కాబట్టే పరిహారం విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. – నేరేళ్ల ప్రకాశ్ రావు, దళిత రైతు, తుళ్లూరు – పి. హరినాథ్‌రెడ్డి , సాక్షి, అమరావతిబ్యూరో -
బాబునే బురిడీ కొట్టించిన మంత్రి..!
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఓ మంత్రి తన శాఖలో రూ.4500 కోట్ల పనులకు గత ఏడాది ప్రతిపాదనలు రూపొందించారు.ఈ పనుల బాధ్యత చూసే చీఫ్ ఇంజనీరునే తనకు ఓఎస్డీగా నియమించుకొని తెరవెనుక కథ నడిపారు. ఆ పనులకు యాన్యుటీ పద్ధతిలో టెండర్లు పిలిచారు. నచ్చిన వారికి 15 శాతం ఎక్సెస్‌కు పనులు కట్టబెట్టి భారీగా కమీషన్ తీసుకోవాలని అనుకున్నారు. అయితే మా నియోజకవర్గాల్లో మాకు చెప్పకుండా మంత్రి ఎలా ప్రతిపాదనలు తయారుచేయిస్తారని టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో సీఎం ఈ యాన్యుటీ టెండర్లను నిలిపివేసి ఎమ్మెల్యేలు చెప్పిన పనులే ప్లాన్‌లో పెట్టాలని సూచించారు. దీంతో వ్యవహారం తారుమారవుతోందని గమనించిన సదరు మంత్రి కొత్త ఎత్తు వేశారు. తన జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఇతర సన్నిహిత ఎమ్మెల్యేలు, నేతలతో విజయవాడలో రహస్య సమావేశాలకు తెర తీశారు. వీరందరితో కలిసి జనసేనలోకి జంప్ చేయబోతున్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బాబు వెంటనే రూ.4500 కోట్ల యాన్యుటీ ఆగమేఘాలపై తెప్పించుకున్నారు. 15 శాతం ఎక్సెస్‌కు కాకుండా కొంత తగ్గించేలా టెండర్లను మళ్లీ దాఖలు చేయించి ఓకే చేశారు. గతంలో కాంగ్రెస్‌పార్టీలో కూడా మంత్రిగా ఉండి ఎమ్మెల్యేలతో టీడీపీలోకి వచ్చిన ఈ మంత్రి మళ్ళీ అలాగే చేసినా చేస్తాడేమోనని బాబు టెండర్లను ఓకే చేశారు. -
అవినీతిలో ప్రథమ పౌరులు
ప్రజాప్రతినిధులంటే.. పదిమందికీ ఆదర్శంగా నిలవాలి. ప్రజలు.. ప్రభుత్వానికి వారధిగా నిలవాలి. ప్రజా సంక్షేమానికి అహరహం శ్రమించాలి.. ఆ ముగ్గురు ప్రజా ప్రతినిధులు కూడా అవిశ్రాంతంగా శ్రమిస్తుంటారు.. కమీషన్లు దండుకోవడం.. పోస్టుల్ని అమ్మేసుకోవడం.. గెడ్డల్ని కబ్జా చేయడం.. కాంట్రాక్టులు దక్కించుకోవడం.. ఇనాం భూముల్ని కారు చవగ్గా కొట్టేయడంలో వీరు నిత్యం తలమునకలై ఉంటారు. వారే పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు.. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్.. ఆయన సతీమణి, పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపుడ్డి శ్రీదేవి. దండుకోవడంలో ఈ త్రయానికున్న పేరు పార్వతీపురంలో మారు మోగిపోతోంది. పనికి ఇంత ధర నిర్ణయించేశారు. పైసలిస్తే తప్ప ఏ పనీ చేయరు. పార్వతీపురాన్ని దోచుకు తింటున్నారు. పట్టం గట్టిన ప్రజల్ని ఉసూరుమనిపిస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ.. ఇంకొకరు పట్టణ ప్రథమ పౌరురాలు. కమీషన్లు దండుకోవడం.. ఉద్యోగాలు అమ్ముకోవడం.. కాంట్రాక్టులు ఇప్పించడంలో ఈ ముగ్గురూ ఘనాపాటీలు. వాళ్లే పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు..ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్.. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి. ఏ పని కావాలన్నా గ్రామీణ ప్రాంతంలో అయితే ఎమ్మెల్యే.. పట్టణ ప్రాంతంలో అయితే ఎమ్మెల్సీకి అడిగినంత చదివించుకోవలసిందే. ఇక ఎమ్మెల్సీ సతీమణి, పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి భర్త స్ఫూర్తితో అయినకాడికి దోచుకోవడంలో పోటీ పడుతున్నారు. అడ్డూ అదుపూ లేని ఈ ముగ్గురి అక్రమార్జనపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. సాక్షి ప్రతినిధి, విజయనగరం: మున్సిపల్ చైర్పర్సన్ రేట్లివి పార్వతీపురం పురపాలక సంఘం చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి భర్త ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ కావడం ఆమెకు ఎదురు లేకపోయింది. భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని పురపాలక సంఘంలో చక్రం తిప్పుతున్నారు. ఏ పని చేయాలన్నా చేయి తడపాల్సిందే. ఇళ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, లే ఔట్ల రెగ్యులరైజేషన్, కొత్త లే అవుట్లకు అనుమతులు ఇచ్చేందుకు రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. పురపాలక సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్లు, మెప్మా కార్యాలయంలో ఆర్పీలు, పారిశుద్ధ్య కార్మికుల నియామకంలో దండిగా డబ్బులు వసూలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులను కొత్తగా 36 మందిని నియమించాలని పాలకవర్గం తీర్మానిస్తే.. చైర్పర్సన్ ఏకంగా 42 మందిని నియమించి ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారనేది బహిరంగ రహస్యం. కాంట్రాక్టులన్నీ ఎమ్మెల్సీ తమ్ముడికే.. పార్వతీపురం పురపాలక సంఘంలో ప్రతి సివిల్ కాంట్రాక్టును ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తన సోదరుడు ద్వారపురెడ్డి వెంకట తిరుపతిరావుకు అప్పగిస్తున్నారు. భార్య ద్వారపురెడ్డి శ్రీదేవి మున్సిపల్ చైర్పర్సన్ కావడంతో ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకొని పురపాలక సంఘంలో రూ.కోట్ల విలువైన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ నిర్మాణాలను తిరుపతిరావుకు కట్టబెడుతున్నారు. సింగిల్ టెండర్లు వస్తే వాటిని తిరస్కరించి మళ్లీ టెండర్లు పిలవాలన్న నిబంధనలున్నాయి. కానీ చైర్పర్సన్ అధికారాన్ని ఉపయోగించుకొని తమ్ముడికి సింగిల్ టెండర్లను కూడా ఆమోదింపజేసి కాంట్రాక్టులు కట్టబెట్టి కమీషన్లు దండుకుంటున్నారు. డివైడర్ పనుల పేరిట దోపిడీ పార్వతీపురం పట్టణ ప్రధాన రహదారిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులు చేపట్టారు. అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై పనులు చేపట్టాలంటే ఆర్అండ్బి శాఖ చేపట్టాలి. కానీ అందుకు విరుద్ధంగా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తమ్ముడు కాంట్రాక్టర్ ద్వారపురెడ్డి తిరుపతిరావుకు ఆ నిర్మాణ పనులను అప్పగించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందనుకుంటే పర్వాలేదు.. కానీ అవసరం లేని చోట పార్వతీపురం పురపాలక సంఘం రూ.1.39 కోట్ల ప్రజాధనం వెచ్చించి డివైడర్లు నిర్మించింది.. అన్ని పనులకు కలిపి ఒకేసారి టెండర్లు పిలిచినçప్పటికీ, డివైడర్లకు సున్నాలు, రంగులు వేయడానికి రూ.22 లక్షలు అదనంగా నిధులు మంజూరు చేసి పాలకవర్గంతో ఆమోదించారు. కొన్ని చోట్ల పాత డివైడర్లపై రంధ్రాలు వేసి ఇనుప కంచెతో గోడ నిర్మించినందుకు అదనంగా నిధులు మంజూరు చేసి తినేశారు. కమీషన్ల కోసం సుందరీకరణ పనులు పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపులా సుందరీకరణ పేరుతో రూ.16 లక్షలు వెచ్చించి మొక్కలు నాటారు. వాస్తవానికి దీనివల్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ప్రైవేటు వ్యక్తుల స్థలాల ముందు అడ్డంగా కంచెను నిర్మించి అందులో పేపర్ గులాబీ మొక్కలను వేశారు. ఎమ్మెల్సీ తమ్ముడు కాంట్రాక్టర్ ద్వారపురెడ్డి వెంకట తిరుపతిరావుకు లబ్ధి చేకూర్చేందుకే అవసరం లేకపోయినా సుందరీకరణ పేరుతో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో వీటిని నిర్మించి ప్రజాధనాన్ని వృథా చేశారు. మరమ్మతుల పేరిట మేత పార్వతీపురం 14వ వార్డులోని షటిల్ బ్యాడ్మింటన్ స్టేడియం ఇదివరకు ఐటీడీఏ పీఓ చైర్మన్‌గా ఆఫీసర్స్ స్టేడియంగా ఉండేది. అందులో ప్రభుత్వోద్యోగులు, క్ల»బ్ సభ్యులుగా ఉన్నవారు మాత్రమే ఆటలు ఆడేవారు. కానీ సొంత ప్రయోజనాల కోసం మున్సిపాల్టీతో దత్తత తీసుకొని మరమ్మతుల పేరుతో రూ.30 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి దాని నిర్మాణ బాధ్యతలను కూడా ఎమ్మెల్సీ సోదరుడు కాంట్రాక్టర్ ద్వారపురెడ్డి తిరుపతిరావుకు అప్పగించారు. అక్కడితో ఆగకుండా మరమ్మతుల పేరుతో రూ.5 లక్షలు మంజూరు చేసేందుకు పాలకవర్గ సమావేశంలో అజెండాలో పొందుపరిచారు. దీనిని అధికార, విపక్ష కౌన్సిల్ సభ్యులతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్‌నారాయణ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. మున్సిపాలిటీకి ఆదాయం రాని స్టేడియంకు ఎందుకు ప్రజాధనాన్ని ఖర్చు చేయాలని నిలదీశారు. అయినా తమ్ముడికి భారీగా కమీషన్లు రావడం కోసం పాలకవర్గంతో ఒప్పించి తీర్మానం చేయించిన ఘనత ఎమ్మెల్సీదే. కారు చవగ్గా ఇనాం భూములు గరుగుబిల్లి మండలం పోలినాయుడు వలస గ్రామ రెవెన్యూ పరిధిలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని 56.34 ఎకరాల ఇనాం భూములను ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికవక ముందు వరకు ఆయన పేరుమీద ఈ భూముల్లేవు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టాక మాత్రమే ఈ భూములు ఆయన కొనుగోలు చేసినట్టు ఆధారాలు ధ్రువీకరిస్తున్నాయి. పోలినాయుడు వలస గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 178లో 56.34 ఎకరాలను వల్లభ జోష్యుల సూర్యనారాయణ నుంచి ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఆయన సోదరుడు ద్వారపురెడ్డి ధనుంజయనాయుడు పేరుమీద కొనుగోలు చేసినట్టు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదై ఉంది. విశేషమేమిటంటే ద్వారపురెడ్డి జగదీష్ రూ.2,02,83,000కు ఈ భూములను కొనుగోలు చేసినట్టు దస్తావేజుల్లో చూపిస్తోంది. ఈ ఖర్చును ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడవిట్లో చూపించకపోవడం గమనార్హం. భూ క్రయ విక్రయాలు జరిగే సమయంలో ఒక వ్యక్తి భూమి అమ్మితే మరో వ్యక్తి ఆ భూమిని కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ ఖర్చులను కొనుగోలుదారు భరించాలి. కానీ భూ విక్రయదారే రిజిస్టేషన్ ఖర్చులను భరించుకున్నట్టు దస్తావేజు స్పష్టం చేస్తోంది. పోలినాయుడు వలస గ్రామ రెవెన్యూ పరిధిలో పల్లపు భూమి ఎకరా రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర పలుకుతుండగా.. ఎమ్మెల్సీ కేవలం రూ.3 లక్షల చొప్పున 56.34 ఎకరాలను కారు చౌకగా దక్కించుకున్నారు. బినామీకి 40 ఎకరాల డీ పట్టా భూములు పార్వతీపురం మండలం వెంకంపేట పంచాయతీ పరిధిలోని వెంకంపేట చెరువు దిగువ భాగంలో డీ పట్టా భూములను కూడా తన బినామీ పేరుమీద సుమారు 40 ఎకరాల వరకు కొనుగోలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ కొనుగోలు చేసిన భూములు నేటికి అనేక మంది రైతుల ఆధీనంలో సాగులో ఉన్నాయి. ద్వారపురెడ్డి జగదీష్ కొనుగోలు చేసిన విషయం నేటికి సాగు చేస్తున్న రైతులకు తెలియక పోవడం గమనార్హం. ఈ విషయం తెలిసిన రైతులు ఇటీవల కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు. వరహాల గెడ్డ కబ్జా పార్వతీపురం పట్టణ నడిబొడ్డుగుండా ప్రవహిస్తున్న వరహాలగెడ్డను ఆక్రమించి ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఇల్లు నిర్మించుకుంటున్నారు. సహజంగా వరహాలగెడ్డ వెడల్పు 12 మీటర్లు ఉండాలి. కానీ ఎమ్మెల్సీ ఇంటి వద్దకు వచ్చేసరికి గెడ్డను కుదించి ప్రహరీ నిర్మించి లోపలి భాగంలో ఇల్లు నిర్మిస్తున్నారు. ఎమ్మెల్సీ సోదరుడు డాక్టర్ రామ్మోహనరావు ఆస్పత్రి వెనుకభాగంలో వరహాలగెడ్డను కప్పి అందులో అరటి మొక్కలు, కొబ్బరి మొక్కలు వేసి పెంచుతున్నారు. దీనిపై గతంలో పత్రికల్లో కథనం రాగా పరిశీలనకు వెళ్లాలని కలెక్టర్ స్థానిక ఆర్డీఓను ఆదేశించారు. వివరణ కోరేందుకు వెళ్లిన అధికారులకు సరైన సమాధానం చెప్పకపోవడంతో వారు వెనుదిరిగారు. మా పొట్ట కొడుతున్నారు ఎన్నో దశాబ్ధాలుగా సాగు చేస్తున్న మా భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయి. మా సాగులో ఉన్న ఇనాం భూమిని సరిచేసి హక్కు కల్పించాలని నా లాంటి ఎంతో మంది రైతులం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా స్పందించలేదు. మాకు తెలియకుండానే మా సాగులో ఉన్న భూములు వేరొకరు రెవెన్యూ రికార్డుల్లో తారుమారు చేశారు. ఈ విషయం కొద్ది రోజుల ముందే ఆనోటా, ఈనోటా తెలిసింది. దీంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – బడే శంకరరావు, రైతు, పెద్దూరు. -
మంత్రి అండతో కోనేరు ఆక్రమణకు యత్నం
సూళ్లూరుపేట (నెల్లూరు): మండలంలో డేగావారికండ్రిగలో సుమారు 1.36 ఎకరాల కోనేరు, ఆర్అండ్బీ రోడ్డు స్థలాన్ని జిల్లాకు చెందిన మంత్రి సిఫార్సులతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన డేగా అనే ఇంటిపేరు కలిగిన జమీందార్లుగా ఉండేవారు. వారి ఇంటిపేరుతోనే ఆ గ్రామానికి కూడా డేగావారికండ్రిగ అనే వచ్చిందని ›గ్రామపెద్దలు చెబుతున్నారు. జమీందార్లకు సంబంధించి భూములను అంతా అమ్ముకుని వెళ్లారని, ప్రస్తుతం గంగమ్మ, వినాయకుడి గుడికి వెళ్లే రోడ్డు ఈ ఆలయాల ముందున్న కోనేరు కూడా తమదేనని డేగా కరుణాకర్‌రెడ్డి అనే వ్యక్తి దీన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్వే చేశారు గతంలో కూడా కోనేరు స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసినపుడు సర్వే కూడా జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. సర్వే నంబర్ 157, 157–2ఏ, 157–2బీ, 157–2సీలో సుమారు 1.36 ఎకరాల భూమి దాకా కోనేరు, ఆర్అండ్బీ రహదారి అని రెవెన్యూ రికార్డులో ఉంది. తన వద్ద రికార్డు ఉందని ఈ భూమి తమది అని కరుణాకర్‌రెడ్డి జిల్లాకు చెందిన మంత్రి ద్వారా ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని, అధికారపార్టీ నేతల అండదండలతో మా భూమిని ఆక్రమించే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని వారు కోరుతున్నారు. ఈ వివాదం చాలాకాలంగా జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మంత్రి సిఫార్సులతో రెవెన్యూ «అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా ఆక్రమించుకోవాలనే ఆలోచనలో కరుణాకర్‌రెడ్డి ఉన్నారు. ఈ భూమి డేగా వారిది కాదని, కోనేరు, ఆర్అండ్బీ రహదారికి రికార్డులో నమోదై ఉందని, పైపెచ్చు ఈ ప్రాంతంలో గంగమ్మ ఆలయం, వినాయకుడి గుడి ఉండటంతో ఈ రెండు ఆలయాలకు వెళ్లేందుకు దారి అవసరానికి, అలాగే కోనేరుకు మరమ్మతులు చేయించి బాగుచేస్తే పదిమందికి ఉపయోగపడేలా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆ స్థలం గ్రామానిదే కోనేరు, రోడ్డు స్థలం గ్రామానికి సంబంధించినదే. డేగా వాళ్లు ఈ గ్రామంలో జమీందార్లుగా ఉన్నమాట వాస్తవమే. వాళ్లు ఉన్న ఆస్తులన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్ముకుని వెళ్లారు. ఈ పొలం తమది అని జమీందార్లు అన్నపుడు దీనిపై సర్వే చేయించాం. అది పూర్తిగా ఆర్అండ్బీ రోడ్డు, కోనేరుకు చెందిన స్థలం అని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఇప్పుడు స్థలం తనది అని కరుణాకర్‌డ్డి రావడం సమంజసం కాదు. మంత్రి సిఫార్సులతో ఆక్రమించే ప్రయత్నాలు మానుకోవాలి. –ఎల్.రమ్మణయ్య, మాజీ సర్పంచ్, డేగావారి కండ్రిగ స్థలాన్ని కాపాడుతూ వచ్చాం చిన్నప్పటినుంచి కోనేరు పక్కనే ఉన్న చెట్టుకు నీళ్లుపోసి కాపాడుతూ వచ్చాం. ఈ పొలం ఏ మాత్రం డేగా వారిది కాదు. వినాయకుడి గుడికి, గంగమ్మ గుడికి వెళ్లే దారి కావడం, దీనికి పక్కనే కోనేరు ఉండటం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కోనేరు గురించి ఆలనా పాలనా చూసుకోకపోవడంతో అది పూడిపోయింది. ప్రస్తుతం దీన్ని స్థలంగా చూపించి అక్రమించుకోవాలనే ఆలోచన మంచిది కాదు. –పుట్టు వెంకటాద్రి, డేగావారి కండ్రిగ -
తెలుగుదేశంలో కాంగ్రెస్‌తో పొత్తు ముసలం
-
రాజధాని రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి..
సాక్షి, నెల్లూరు: రాజధాని రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రులు నారాయణ, లోకేష్ కనుసన్నల్లో రూ. 400కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ కుంభకోణంలో రూ. 100కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రుణం తీసుకుని.. 5వేల కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు. దీంట్లో 5 నుంచి 10 శాతం కమీషన్ మంత్రులు తీసుకుంటున్నారని కోటం రెడ్డి తెలిపారు. -
శల్యసారథ్యం రాష్ట్రానికి శాపం
టీడీపీ మంత్రుల రాజీనామాలను, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొన్న నిర్ణయంగా కాక.. 2019 ఎన్నికల వ్యూహంలో భాగమేనని జాతీయ మీడియా కథనాలు పేర్కొనడం టీడీపీకి ఊహించని దెబ్బ. నాలుగేళ్లుగా ఏ దశలో కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేలేకపోవడం.. చివరకు అనివార్యంగా మంత్రులతో రాజీనామా చేయించడం తెలుగుదేశం బలహీనత, తప్పిదంగానే యావత్ దేశం పరిగణిస్తోంది. విసిరిన పాచికలు అన్నిసార్లూ అనుకొన్నట్టు పారవు ఎవరికైనా! ప్రతి అడుగును రాజకీయంగా ఆచితూచి వేసే ఏపీ సీఎం చంద్రబాబు అందుకు మినహాయింపు కాదు. కేంద్రంలో తమ ఇద్దరు మంత్రులు అశోక గజపతిరాజు, సుజనాచౌదరిలతో రాజీనామా చేయించగానే.. రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా మారతాయని ఊహించిన టీడీపీకి జరుగుతున్న పరిణామాలు, వస్తున్న విమర్శలు మింగుడుపడటం లేదు. అయితే, మంత్రులతో రాజీనామా చేయించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని ప్రధాని మోదీ గానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా గానీ సీరియన్‌గా తీసుకోలేదు. తెలుగుదేశం తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తేలిగ్గా తిప్పికొట్టవచ్చునన్న భావన బీజేపీ అగ్రనాయకత్వంలో కనిపిస్తున్నది. బాబు ప్రభుత్వం చేసిన తప్పుల చిట్టా కేంద్రం వద్ద ఉండి ఉండొచ్చు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీతో పొత్తును తెగదెంపులు చేసుకున్న బీజేపీ.. ఏపీలో కూడా తెలుగుదేశాన్ని వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు కన్పిస్తోంది. టీడీపీ మంత్రుల రాజీనామాల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొన్న నిర్ణయంగా కాక.. 2019 ఎన్నికల వ్యూహంలో భాగమేనని జాతీయ మీడియా కథనాలు పేర్కొనడం తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బ. నాలుగేళ్లుగా ఏ దశలో కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేలేకపోవడం.. చివరకు అనివార్యంగా మంత్రులతో రాజీనామా చేయించడం టీడీపీ బలహీనత, తప్పిదంగానే యావత్ దేశం పరిగణిస్తోంది. ప్రజల ఆకాంక్షల్ని నాలుగేళ్లుగా గుర్తించలేదా? ప్రజల ఆకాంక్షల మేరకు మోదీ మంత్రి వర్గం నుండి తమ ఇరువురు నేతలు తప్పుకొన్నారని, ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించే ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలుగుదేశం నేతలు ప్రచారం చేస్తున్నారు. తద్వారా తప్పంతా బీజేపీ మీదకు నెట్టి... కడిగిన ముత్యంలా బయటపడటం టీడీపీ వ్యూహం! కానీ.. ఏం చెప్పినా నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు కదా? గత 4 ఏళ్లుగా ప్రజల ఆకాంక్షల మేరకు టీడీపీ పరిపాలిస్తోందా? నిర్ణయాలు తీసుకొంటున్నదా? ‘రాష్ట్రానికి ప్రత్యేకహోదా’ అన్నది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినదిగా ప్రజలందరూ పరిగణిస్తే.. తెలుగుదేశం దానిని రాజకీయాంశంగానే పరిగణించిందని ప్రజా బాహుళ్యానికి పూర్తి అవగాహన ఉన్నది కదా! రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తాత్సారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ నిరసిస్తూనే ఉంది. వైఎస్సార్సీపీ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ధర్నా చేసినప్పుడు, రాష్ట్ర బంద్ చేసినపుడు.. గుంటూరులో అమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు, ప్రతి జిల్లాలో యువగర్జన సదస్సులు జరిపినప్పుడు, పాదయాత్రలో పదేపదే ప్రత్యేకహోదా విషయం ప్రస్తావిస్తున్నప్పుడు... ఇంకా అనేక సందర్భాలలో ఈ అంశంపై పలు రకాలుగా ఉద్యమాలు చేసిన సందర్భాలలో అధికారంలో ఉన్న టీడీపీ ఎదురుదాడికి దిగింది. అక్రమ కేసులు బనాయించింది. ఏ రాజకీయ పార్టీకీ చెందని విద్యార్థులు ఆందోళనకు దిగితే.. వారిపై పి.డి. యాక్ట్ కింద కేసులు పెడతామని, జైళ్లకు పంపిస్తామని, భవిష్యత్తు నాశనం అవుతుందని బెదిరించింది టి.డి.పి. ప్రభుత్వం. విద్యార్థుల తల్లిదండ్రులను హెచ్చరించింది. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌పార్టీ అడ్డగోలుగా విభజించిందన్న వాదనను ప్రజ ల్లోకి బీజేపీ, టీడీపీలు బలంగా తీసుకువెళ్లడం, ఆనాడు దేశవ్యాప్తంగా మోదీకి లభించిన ఆదరణ తదితర అంశాలు తోడు కాగా స్వల్ప ఓట్ల తేడాతోనే చంద్రబాబు ఏపీకి సీఎం కాగలిగారు. అయితే, విభజన కారణంగా రాష్ట్రానికి సంక్రమించిన కష్టాలను పరిష్కరించవలసిన ప్రభుత్వం.. దానికి బదులుగా కొత్త కష్టాలను ప్రజలపై మోపింది. రుణమాఫీ హామీ ఇచ్చి.. దానిని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల రైతాంగం అప్పుల్లో కూరుకు పోయింది. డ్వాక్రా రుణాలమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అమలు వంటి ప్రధాన ఎన్నికల హామీల్ని నెరవేర్చలేదు. దశల వారీ మద్యపాన నిషేధం కాస్తా.. దశదిశల మద్యపానంగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. హక్కుగా లభించవలసిన విభజన చట్టంలోని ప్రధాన హామీల్ని కేంద్రం నుంచి సాధించుకోవడంలో ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపలేక పోయింది. చివరి వరకు ప్యాకేజీనే ముద్దు అన్నారు రెవెన్యూలోటును రాష్ట్ర ప్రభుత్వం రూ.16,078 కోట్లుగా చూపితే, కేంద్రం ఇచ్చింది రూ.4,117 కోట్లు మాత్రమే! రాష్ట్ర ప్రభుత్వం చూపిన రెవెన్యూలోటు లెక్కల్లో తేడాలున్నాయని కేంద్రం ఎన్నోసార్లు స్పష్టం చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధ్యులైన ఆర్ధికశాఖమంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లి ఆ లెక్కల్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు. రాజధాని నిర్మాణానికి తొలుత 5 లక్షల కోట్ల రూపాయిలు కావాలని అడిగి, రూ.43,000 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, అందులో కేంద్రం ఇచ్చింది. రూ.2,500 కోట్లు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజపట్నంలో భారీ ఓడరేవు నిర్మాణం మొదలైన ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశాలను.. కేంద్రాన్ని ఒప్పించి పరిష్కరించుకునే చొరవ సీఎంగానీ, టీడీపీ ఎంపీలుగానీ చేయలేదు. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, జిల్లాలకు కోరాపుట్, బుందేల్ ఖండ్ ప్యాకేజీ వంటిది అందిస్తామని విభజనచట్టంలో ఉండగా, ఆ పద్దు కింద 4 ఏళ్లలో జిల్లాకు రూ.5 కోట్లు చొప్పున 7 జిల్లాలకు కేవలం రూ.105 కోట్లుతో కేంద్రం సరిపుచ్చగా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు సరికదా.. ఆ నిధుల్ని కూడా పూర్తిగా ఆయా జిల్లాలకు ఖర్చు చేయకుండా దారి మళ్లించింది. ఇక కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులు అర్ధరాత్రి విలేకర్ల సమావేశం పెట్టి..విభజన చట్టంలోని హామీల్నీ చదివేసి వాటిని రీప్యాకేజీ చేస్తే.. అందులో ఏమున్నదో కూడా చూడకుండానే సీఎం బాబు హర్షం వ్యక్తం చేశారు. వెంకయ్యని ఓపెన్ జీపులో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఓపెన్‌టాప్ జీపులో ఎక్కించుకొని విజయవాడ నగరంలో తిప్పారు. ప్రత్యేకహోదా నిరాకరించడానికి కేంద్రం సాకులు చూపుతున్నా, ప్రత్యేకహోదా లభించకుంటే ఎన్నికల్లో తాను చేసిన హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని తెలిసినా.. చంద్రబాబు మహా మౌనిలా వ్యవహరించారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబుకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా లభిస్తే చేకూరే ప్రయోజనాలకు, ప్రత్యేక ప్యాకేజీ వల్ల పరిమితంగా కలిగే చిరు లాభానికి తేడా తెలియదని అనుకోవాలా? రాష్ట్రానికి నష్టం జరిగిందని, దానికి కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ పదేపదే జరిగిపోయిన వాటిపై ఆక్రోశించిన చంద్రబాబు.. పార్లమెంట్ ఆమోదించిన పునర్విభజన బిల్లులో పేర్కొన్న అంశాలు, బీజేపీ నేతలు ఇచ్చిన హామీల అమలుపై కంటితుడుపుగా విజ్ఞాపన ప్రత్రాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప ఏనాడూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన సందర్భం లేదు. కేవలం కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడినట్లుగా వ్యవహరించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష పార్టీలు ఉద్యమిస్తే.. కేసులు బనాయించారు, హేళన చేశారు. ప్రత్యేకహోదా వల్ల ఫలితంలేదని, అది సంజీవని కాదని, ప్యాకేజీయే మేలని.. ఇలా రకరకాల వాదనల్ని విన్పించారు. కేంద్రం 2017–18 బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత.. రాష్ట్రానికి అన్నీ వచ్చేశాయని సి.ఎం. చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘ఇంతకుమించి అడగలేం’’ అని కూడా తేల్చేశారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా మీడియా సమావేశంలో ‘‘అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ సాధించాం.. ప్రత్యేక హోదాతో సమానమైనవన్నీ వచ్చాయి’’ అని సాధికారంగా చెప్పారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఇన్చార్జిగా సిద్ధార్ధనాథ్ సింగ్ చంద్రబాబు తమను ఏనాడు ప్రత్యేకహోదా కావాలని అడగనేలేదని, ప్రత్యేక ప్యాకేజికే మొగ్గుచూపారని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధించవలసిన వారే శల్య సార«థ్యం వహించారు. పోరాడింది వైఎస్సార్సీపీ, వామపక్షాలే ప్రత్యేకహోదా అంశాన్ని మరుగుపర్చడానికి అధికార తెలుగుదేశం ఎంతగా ప్రయత్నించినా.. ఎప్పటికప్పుడు నిర్విరామంగా ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ దానిని ఓ ఆశాదీపంగా నిలిపింది వైఎస్సార్ సీపీయే! వైసీపీ అధ్యక్షులు వై.యస్.జగన్ ‘‘ప్రత్యేకహోదా’’ కల్పించాలంటూ ఢిల్లీలో ధర్నాచేశారు. అసెంబ్లీలో సమర్ధవంతంగా తన వాదనల్ని విన్పించారు. ప్రజల ఆకాంక్షలను తెలియజెప్పారు. కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఉద్యమాలు చేశాయి. అయితే, కేంద్రంలో ఐదవ బడ్జెట్ ప్రతిపాదించిన తర్వాత.. పార్లమెంట్ వెలుపల, లోపల తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు మొక్కుబడిగా సాగించిన నిరసనను సీఎం చంద్రబాబు ‘పోరాటం’గా అభివర్ణిస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన పార్లమెంట్ సమావేశాలకు ఇచ్చిన విరామంలో.. టీడీపీ ఏ ఒక్క కార్యక్రమమైనా చేయగలిగిందా? ఫిబ్రవరి 8న వామపక్షాలు ప్రతిపాదించగా వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్ధతు ఇచ్చిన రాష్ట్ర బంద్‌ను విఫలం చేయాలని శతవిధాలా ప్రయత్నించింది రాష్ట్ర ప్రభుత్వం. చివరకు విధిలేక బంద్‌లో తామూ పాల్గొన్నట్లు ప్రచారం చేసుకున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి బయటపడటానికి మోదీకి సాగిలపడిపోయిన ఫలితంగానే.. టీడీపీ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రతిష్ట పోగొట్టుకొందని ప్రజాబాహుళ్యం చెవులు కొరుక్కోవడం, చర్చించుకోవటం, నిరసనలు తెలపడం ప్రభుత్వానికి వినపడటం లేదా, లేక కనపడటం లేదా! కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన ప్రత్యేకహోదా రాకుండా ఎవరు అడ్డుపడ్డారు? విభజన బిల్లు అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలు, ప్రతిపక్ష నేతగా వెంకయ్య ప్రత్యేకహోదా కోసం గర్జించిన విధానం, తిరుపతి పుణ్యక్షేత్రంలో జరిగిన ఎన్నికల సభలో ఆనాడు మోదీ, వెంకయ్య, బాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆవశ్యకతను గురించి చేసిన భీకర ప్రసంగాలు ఏమైపోయాయి? పాలకులు మర్చిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోలేదు. టీడీపీ దోబూచులాటలను ఇకనైనా కట్టిపెట్టి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు సమాయత్తం కావటం విజ్ఞత అనిపించుకొంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు 184వ నిబంధన క్రింద పార్లమెంటుకు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో భాగస్వాములు కావడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల పట్ల టీడీపీ ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన పరీక్షా సమయమని గుర్తిం చుకోవాలి. వైఎస్సార్ సీపీ తీర్మానానికి పోటీగా అవిశ్వాస తీర్మానం చేసిన టీడీపీ కనీసం దాన్నయినా నిజాయితీగా ముందుకు తీసుకుపోతుందా అనేది సందేహాస్పదమే. రాష్ట్రానికి ప్రస్తుత తరుణంలో కావాల్సింది శల్య సార«థ్యం కాదు... చిత్తశుద్ధితో కూడిన సారథ్యం. వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మొబైల్ : 99890 24579 -
ముగ్గురూ ముగ్గురే
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో పేరుకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు బీజేపికి చెందిన వారు కాగా ఇద్దరు టీడీపీకి చెందిన వారు. బీజేపీ నుంచి గెలిచిన పైడికొండల మాణిక్యాలరావు తనను అంటరానివారిగా టీడీపీ నాయకులు చూస్తున్నారని చెబుతున్నారు. మిగిలిన ఇద్దరు మంత్రులది వారి పంథా వారిదే. జనం గోడు పట్టించుకోవడం లేదు. జిల్లాలో సాగునీరు అందక వరిపైరు ఎండిపోతోందని రైతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నా.. కనీసం ఆ విషయమై సమీక్ష జరిపే ప్రయత్నం కూడా ఆ ఇద్దరు మంత్రులు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. పితాని సత్యనారాయణ నియోజకవర్గంలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఆయన ఇప్పటి వరకూ ఆ ప్రాంతాల్లో పర్యటించిన పాపాన పోలేదు. ఇక మరోమంత్రి కేఎస్ జవహర్‌ది కూడా ఇదే తీరు. పచ్చని పొలాలతో కళకళలాడే పశ్చిమలో మునుపెన్నడూ లేనివిధంగా కరువు ఛాయలు అలముకుంటున్నాయి. మార్చి మొదటివారంలోనే పంట పొలాలు బీటలు వారిపోతున్నాయి. వెరసి అన్నదాతకు తీవ్ర సాగునీటి కష్టం వచ్చింది. ఆరుగాలం శ్రమించే రైతులు ఇప్పుడు రబీ గట్టెక్కేదెలాగా అని మధనపడుతున్నారు. వంతుల వారీ విధానంతో సాగునీరు అందిస్తామన్న పాలకుల హామీలు గాలిలో కలిసిపోవడంతో చుక్క నీరు అందక రైతన్నలు రబీపై ఆశలు వదిలేసుకుంటున్నారు. జిల్లాలో నరసాపురం, యలమంచిలి, మొగల్తూరు, ఆచంట, పెనుమంట్ర, అత్తిలి, భీమవరం, వీరవాసరం, పాలకోడేరు, పాలకొల్లు, పెంటపాడు, దెందులూరు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల్లో ఎప్పుడూ లేని విధంగా సాగునీటి ఎద్దడి నెలకొంది. గోదావరి డెల్టాలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో శివారు పొలాలకు నీరు అందే పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పచ్చని పంట పొలాలకు నెర్రలు వచ్చాయి. పాలకులు ఏం చేస్తున్నట్టు? సాగునీటి సమస్యపై రైతులు అల్లాడుతున్నా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అండగా నిలవాల్సిన పాలకులు కనీసం స్పందించడం లేదని రైతు సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కనీసం జిల్లాలోని ఇరిగేషన్ అధికారులను కూర్చోబెట్టి ఏం జరుగుతోంది, ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కుతామన్న ఆలోచన కూడా చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మూడు నెలల క్రితం జరిగిన నీటిపారుదల సలహామండలి సమావేశంలో పట్టిసీమ నుంచి నీరు తరలించడం ద్వారా గోదావరి డెల్టా నష్టపోతోందన్న విషయాన్ని మంత్రి పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని వెంటనే పట్టిసీమ నుంచి నీటి సరఫరా నిలిపివేయాలని కోరారు. అయితే తర్వాత దానిపై దృష్టి పెట్టలేదు. ఒకవైపు గోదావరిలో నీరు అడుగంటినా రికార్డుల కోసం 105 టీఎంసీలను తరలించేశారు. పట్టిసీమ కట్టేసే సమయానికే గోదావరిలో నీటి లభ్యత చాలా తక్కువ ఉందని తేలింది. అయినా డెల్టాను కాపాడే దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రస్తుత సాగునీటి సంక్షోభం తీవ్రస్థాయిలో ముందుకు వచ్చింది. మంత్రులు కేవలం తమ స్వప్రయోజనాలు, సొంత నియోజకవర్గాలకే పరిమితం అయిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అసంతృప్తే.. ఆగ్రహం వద్దు..!
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేయాలే తప్ప తొందరపాటు ప్రకటనలు చేయొద్దని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలు, మంత్రులకు నిర్దేశించారు. బడ్జెట్ తీవ్రంగా నిరుత్సాహపరిచిందని, భాగస్వామ్య పక్షంగా టీడీపీకి ఇది తీవ్రమైన అంశమని, అయినప్పటికీ వెంటనే ఓ నిర్ణయానికి రాలేమని, ఆచితూచి స్పందించాల్సి ఉందని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై గురువారం చంద్రబాబు టీడీపీ ఎంపీలు, మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తొలుత ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయేలో కొనసాగడం మంచిది కాదని పలువురు ఎంపీలు చెప్పగా.. తామంతా రాజీనామాలు చేస్తామని ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎంపీ అన్నట్టు సమాచారం. రాజీనామాలకంటే ఈ బడ్జెట్ సమావేశాల్ని బహిష్కరించడం ద్వారా నిరసన తెలిపితే బాగుంటుందని మరికొందరు ఎంపీలు అభిప్రాయపడగా, కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాలని ఒకరిద్దరు సూచించారు. అందరి మాటలు విన్న చంద్రబాబు ఆవేశపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని, ఎంపీలు తొందరపాటుగా ఎక్కడా మాట్లాడవద్దని సూచించారు. ఆదివారం జరిగే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించాక ఓ నిర్ణయానికి వద్దామని, అప్పటివరకు ఆచితూచి స్పందించాలన్నారు. కేంద్రమంత్రి సుజనాచౌదరితో ఆయన విడిగా మాట్లాడి ఢిల్లీ పరిణామాల గురించి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమై బడ్జెట్‌పై ఎలా మాట్లాడాలనే దానిపై సూచనలు చేశారు. కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోకున్నా ఎన్డీయేను టీడీపీ వదలట్లేదనే భావన ప్రజల్లో ఉందని, ఇలాంటి సమయంలో ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి ఇబ్బంది వస్తుందని పలువురు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. సీఎం స్పందిస్తూ.. కేంద్రంపై ఒత్తిడి చేయడమే మన ముందున్న మార్గమని, అంతకుమించి ఎక్కువ చేయొద్దని స్పష్టం చేశారు. బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే చెప్పాలని, నేరుగా కేంద్రం, బీజేపీపై విమర్శలు చేయొద్దని సూచించారు. శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చిద్దామని, కేంద్రమంత్రులను కలవడమా? నిరసన తెలపడమా? ఇంకా గట్టిగా ఒత్తిడి తేవడమా? అనే విషయాన్ని రెండురోజుల్లో నిర్ణయిద్దామని చెప్పారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. బీజేపీని దూరం చేసుకోవడం వల్ల నష్టపోతామని, దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పలువురు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. -
ఆ మంత్రులు అవివేకులు
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో చిత్తూరు జిల్లా తీవ్ర వివక్షకు గురైందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన సొంత నియోజక వర్గాన్నే అభివృద్ధి చేయలేక పోయారని విమర్శించారు. ఉపాధి కోసం కుప్పం ప్రజలు లక్షలాది మంది రోజు వేరే ప్రాంతాలకు వలసపోతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు తన నియోజక వర్గానికి సాగు, తాగు నీరు ఇవ్వలేక పోయారని ఎద్దేవా చేశారు. జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీని మూసేసి రైతులకు త్రీవ అన్యాయం చేశారని పెద్దిరెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ హయంలో షుగర్ ఫ్యాక్టరీలకు ప్రాణం పోసి రైతులకు మేలు చేశారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీలు మళ్లీ ముతపడ్డాయన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రపై విమర్శలు చేసే మంత్రులు అవివేకులు అని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రజాసంకల్పయాత్ర ఎలా సాగుతుందో వచ్చి చూస్తే తెలుస్తుందని సూచించారు. ఇంటికెళ్లే ముందైనా టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని పెద్దిరెడ్డి అన్నారు. -
టీడీపీ మంత్రుల మధ్య బెల్ట్ వార్
-
కర్నూలులో ఓట్లకు గాలం వేస్తున్న మంత్రులు
-
కామెడీ ఎక్స్‌ప్రెస్
-
మంత్రులకు చుక్కెదురు
హిరమండలం(పాతపట్నం) : అసలు సమస్యను పక్కనబెట్టి...కంటి తుడుపు చర్యలతో సరిపెట్టుకుంటే సహించేది లేదని వంశధార నిర్వాసితులు రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమా ర్, ఎంపీ కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కలమట వెంకటరమణలను నిలదీశారు. ప్రభుత్వం నిర్వాసితులకు మంజూరు చేసిన పరిహారం పంపిణీ కోసం వీరంతా కట్టుదిట్టమైన భద్రత మధ్య మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. పది నిమిషాల్లోనే ముగ్గురు నిర్వాసిత యువతకు చెక్కులు అందజేసి వెనుదిరిగారు. సభకు భీమవరం గ్రామానికి చెందిన నిర్వాసితులు మాత్రమే హాజరు కావడంతో మంత్రులు అవాక్కయ్యారు. మంత్రులు వస్తున్నారని తెలిసినా నిర్వాసిత గ్రామాల ప్రజ లు ఎవరూ రాలేదు. వచ్చిన వారు ప్రభుత్వ తీరుపై...మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ నెల 31లోగా సమస్య లు పరిష్కరిస్తామన్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి తక్షణమే రూ.190 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలో నిర్వాసితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల మీరు మాపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు మరోలా మాట్లాడడం ఏమిటని నిలదీశారు. ఉన్న ఊరిని, భూములను విడిచి వెళ్లేందుకు సిద్ధపడి త్యాగాలు చేస్తే మమ్మల్నే అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతుండగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు మీరు చేసిందేమటని వేదిక వద్దకు దూసుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో మంత్రులు మెళ్లగా అక్కడ నుంచి జారుకున్నారు. కలెక్టర్ లక్ష్మీనరసింహం, ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, జేసీ చక్రధరరావు, ఆర్డీవో గున్న య్య, భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్ గోవర్ధనరావు, తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్ పాల్గొన్నారు. నెలాఖరు నాటికి యూత్ ప్యాకేజి ఎల్.ఎన్.పేట/కొత్తూరు : వంశధార స్టేజ్–2, ఫేజ్–2 ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన యూత్ ప్యాకేజి చెక్కులు పంపిణీ ఒకటి రెండు రోజులు అటుఇటుగా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు వెల్లడించారు. మంగళవారం కొత్తూరు మండలం కృష్ణాపురం గ్రామంలో జరిగిన యూత్ ప్యాకేజీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. కార్యక్రమానికి విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
’హోదా’పై మాట మార్చిన మంత్రులు
-
చేతగాక అభివృద్ధికి అడ్డు అంటారా?
-
చేతగాక అభివృద్ధికి అడ్డు అంటారా?
చంద్రబాబు, టీడీపీ మంత్రులపై అంబటి రాంబాబు ధ్వజం సాక్షి, హైదరాబాద్: రెండున్నరేళ్లుగా పాలిస్తున్న సీఎం చంద్రబాబునాయుడుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగాక ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి అడ్డుపడుతున్నారంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్రకార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, టీడీపీ మంత్రులు, నేతలంతా కలసి జగన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ నిత్యం భజన చేస్తున్నారని మండిపడ్డారు. తాము అభివృద్ధికి ఏమాత్రం వ్యతిరేకం కాదని, ఆ ముసుగులో చంద్రబాబు, లోకేశ్ సాగిస్తున్న అవినీతి, అన్యాయాలు, అక్రమాలనే ప్రశ్నిస్తున్నామని చెప్పారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది.. భోగాపురం విమానాశ్రయం, మచిలీపట్నం నౌకాశ్రయం, మెగా ఆక్వా ఫుడ్ పార్కు, కాకినాడ దివీస్ లేబరేటరీ, రాజధాని, ఇలా ప్రతిదానికీ జగన్‌కు ముడిపెట్టి విమర్శించడమంటే ‘ఆడలేక మద్దెల ఓడు..’, అన్నట్లుగా ఉందని అంబటి విమర్శించారు. రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమకు జరుగుతున్న అన్యాయాలపై ప్రజలు న్యాయస్థానాలకెళ్లి స్టేలు తెచ్చుకుంటే వారికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందన్నారు. తరిమి కొట్టేది మిమ్మల్నే.. జగన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ అనవసరంగా విమర్శలు కొనసాగిస్తే ప్రజలు మూతిపళ్లు రాలగొట్టడం ఖాయమని అంబటి అన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు బందోబస్తు లేకుండా ప్రజల దగ్గరకు వెళితే తరిమితరిమి కొడతారని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కులాలమధ్య చిచ్చుపెడుతోందని, తమ తండ్రీకొడుకుల మధ్య కూడా చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని లోకేశ్ చేసిన విమర్శ అర్థం లేనిదన్నారు. ఈ రాష్ట్రంలో కులాలమధ్య, కుటుంబాలమధ్య, బంధువులమధ్య చిచ్చుపెట్టే చరిత్ర, సంస్కృతి ఏపార్టీకి, ఎవరికుందో ప్రజలందరికీ తెలుసన్నారు. నోట్ల రద్దు లీక్ బాబుకు ఎక్కడినుంచో అందింది పెద్ద నోట్లు రద్దవుతాయని చంద్రబాబుకు ఎక్కడినుంచో ముందుగానే ‘లీక్’అందినట్లుందని, అందుకే కొద్ది రోజులక్రితం ఆయన కేంద్రానికి లేఖలు రాశారని అంబటి అనుమానం వెలిబుచ్చారు. జగన్ వద్ద నల్లధనం ఉందంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
అనంతలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుత్తిలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. రుణమాఫీపై టీడీపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘనాథరెడ్డి, పరిటా సునీతలను గురువారం అనంతపురంలో ఓ డ్వాక్రా మహిళ నిలదీసింది. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు.. టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లైన ఒక్క రూపాయి మాఫీ కాలేదని సాలమ్మ అనే డ్వాక్రా మహిళ మంత్రులను నిలదీసింది. -
ఇసుక క్వారీలో టీడీపీ నేతల ఆధిపత్య పోరు
► రీచ్‌లో పోటాపోటీగా భారీ యంత్రాలు ► ఫోన్లలో మాటల యుద్ధం తాడేపల్లి రూరల్ : తాడేపల్లి మండల పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక రీచ్‌లలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు తమ ఆధిపత్య పోరు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిన్న, మొన్నటిదాకా దొరికినకాడికి దోచుకుని తమ జేబులు నింపుకున్న నేతలు ప్రభుత్వం ఇసుక ఉచితం అని ప్రకటన చేయడంతో వాటిల్లో కూడా తమ హవా కొనసాగించాలని శుక్రవారం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య కోల్డ్‌వార్ కొనసాగింది. వారి మధ్య వార్ జరగడంతో అధికారులు మాకెందుకొచ్చిన తిప్పలు అంటూ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని గుండిమెడ, ప్రాతూరు ఇసుక రీచ్‌లను నాలుగు భాగాలుగా విభజించి మొత్తం 2.90 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులు ఆ ఇసుకను తోడేందుకు అనుమతులు పొందారు. వేరే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే పెత్తనం తాడేపల్లి మండలంలో ఏంటంటూ స్థానిక నాయకులు గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఇద్దరు టీడీపీ మంత్రులతో మాట్లాడి ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు వారి పొక్లెయిన్లు కూడా కృష్ణానదిలోకి దించారు. సదరు యంత్రాలకు సంబంధించిన ఇరు వర్గాలకు చెందిన నాయకులు ఇక్కడ లేనప్పటికీ ఫోనులో మాటల యుద్ధం జరిగింది. అనుమతులు పొందిన ఎమ్మెల్యే అనుచరులు అధికారులు, పోలీసుల సహాయంతో క్వారీలోకి వచ్చిన పొక్లెయిన్లను బయటకు పంపించారు. ప్రభుత్వం ఉచిత ఇసుక ప్రకటించినప్పటికీ నేతల మధ్య ఈ ఆధిపత్య పోరు ఎందుకు జరుగుతుందో అర్థంకాక ఇసుక వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు. -
అస్మదీయుడి కోసం.. వియ్యంకుల పంతం
వారిద్దరూ మంత్రులు.. పైగా కొన్ని నెలల క్రితమే వియ్యంకులయ్యారు. అప్పుడే వారి మధ్య విభేదాలు!.. విభేదాలంటే ఇదేదో కుటుంబ వివాదం అనుకునేరు!. ఇది ఫక్తు రాజకీయం.. అందులోనూ కీలకమైన ఒక విభాగాధిపతి పోస్టు యవ్వారం.. ఎవరికి వారు తమ మాటే నెగ్గాలని పట్టుదల వహించడంతో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. దాంతో ఆ విభాగాన్ని పట్టించుకునే నాథుడు లేకపోయాడు.. కుటుంబం కుటుంబమే.. రాజకీయం రాజకీయమే.. అని నిరూపిస్తున్న ఈ వ్యవహారం వివరాల్లోకి వెళితే.. సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) ఇటీవలే స్వచ్ఛ భారత్ అవార్డును సొంతం చేసుకుంది. కానీ ఈ నగరంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన కీలకమైన ముఖ్య వైద్య ఆరోగ్యాధికారి (సీఎంహెచ్వో) సీటు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉంది. జాయింట్ డెరైక్టర్ డాక్టర్ ఎం.సత్య నారాయణరాజు రీజనల్ డైరెక్టర్‌గా పదోన్నతిపై గత ఏడాది జూలై 15న ఒంగోలుకు వెళ్లిపోయినప్పటి నుంచి ప్రజారోగ్య విభాగం దిక్కులేనిదైంది. ఇన్ చార్జ్‌గా వ్యవహరించిన జోన్ -4 ఏఎంవో డాక్టర్ మురళీమోహన్ కూడా కొద్దికాలానికే సెలవుపై వెళ్లిపోయారు. ఈయన పనితీరుపై కమిషనర్ ప్రవీణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేయడం వల్లే సెలవుపై వెళ్లిపోయారనే ప్రచారం జరిగింది. దాంతో ఈ బాధ్యతలను ఏడీసీ జనరల్ జీవీవీఎస్ మూర్తికి అప్పగించినప్పటికీ పని ఒత్తిడి పెరగడంతో ఆయన పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. కమిషనర్ ప్రవీణ్ కుమార్ అంతా తానై చూసుకోవడం వల్లే పారిశుద్ద్య నిర్వహణ గాడిలో పడింది. అయినప్పటికీ జీవీఎంసీలోనే అతిపెద్ద విభాగమైన ప్రజారోగ్యంలో క్షేత్ర స్థాయిలో ఏమూల ఏం జరుగుతుందో పర్యవేక్షించడం అంత ఈజీ కాదు. సీహెచ్ఎంవో పోస్టు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉండడంతో ప్రజారోగ్యంలో కీలకమైన శానిటేషన్ అండ్ సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్, మెడికల్ కేర్, అర్బన్ మలేరియా అండ్ విక్టర్ బోర్న్ డిసీజెస్, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్, ఫుడ్ హైజనిక్, వెటర్నరీ పబ్లిక్ హెల్త్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (ఎన్యూహెచ్ఎం) విభాగాలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది. కీలకమైన ఈ పోస్టు భర్తీ చేస్తే ఇటు కమిషనర్ .. అటు ఏడీసీ(జనరల్)పై ఒత్తిడి తగ్గుతుంది. ఇంత ప్రాధాన్యమున్న ఈ పోస్టును భర్తీ చేయడంలో ఇటీవలే వియ్యంకులుగా మారిన మున్సిపల్, మానవవనరుల శాఖల మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదర లేదనే వాదన జీవీఎంసీలో బలంగా విన్పిస్తోంది. ఈ పోస్టులో శ్రీకాకుళానికి చెందిన డాక్టర్ దవళ భాస్కరరావును నియమించాలన్న ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. మరోపక్క గతంలో ఇదే పోస్టులో పనిచేసిన వైద్యాధికారితో పాటు కాకినాడ జీజీహెచ్, నెల్లూరు, గుంటూరు ప్రభుత్వాస్పత్రుల్లో సివిల్ సర్జన్ క్యాడర్లో పనిచేస్తున్న వైద్యాధికారులు దీని కోసం పైరవీలు సాగిస్తున్నట్టు తెలిసింది. రూ.50లక్షల వరకు ఇచ్చేందుకు నెల్లూరు, గుంటూరులలో పనిచేస్తున్న ఒకరిద్దరు సిద్ధపడినట్టు చెబుతున్నారు. కాగా తమకు కావాల్సిన వారిని ఈ పోస్టులో కూర్చోబెట్టేందుకు వియ్యంకులైన మంత్రులిద్దరూ ఎవరికివారు పట్టుదలతో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వారి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఈ పోస్టు భర్తీలో జాప్యం జరుగుతోందని అంటున్నారు. దీనిపై కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ని ఎప్పుడు అడిగినా సీఎంహెచ్వో పోస్టు భర్తీ నా చేతుల్లో లేదు.. ప్రభుత్వమే త్వరలో నిర్ణయం తీసుకుంటుందంటూ దాటవేస్తున్నారు. -
దోస్త్ మేరా దొస్త్
-
ఏపీ సీఎం, మంత్రులపై కేసు నమోదుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్‌ను కించపరచడమే కాకుండా రెండు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబు, ఏపీ మంత్రులపై కేసు నమోదు చేయాలంటూ గురువారం సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సీఎం బాబుతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథ్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర, రావెల కిశోర్‌బాబు బహిరంగసభల్లో టీ సర్కార్‌ను కూలుస్తామంటూ గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్య లు చేశారని న్యాయవాది ఫణీంద్ర భార్గవ్ మేజి స్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి వారి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసుల్ని ఆదేశించారు. -
సుజనా చౌదరిపై అసంతృప్తి
హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై ఏపీ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా రాదంటూ టీడీపీకి చెందిన కేంద్ర మంత్రే ప్రకటన చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులను కలిసేటప్పుడు కూడా సహచర టీడీపీ ఎంపీలను తీసుకెళ్లకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి వస్తాయంటున్న నిధులు రాష్ట్రానికి పడ్డ బకాయిలేనని టీడీపీ సీనియర్లు అంటున్నారు. -
మంత్రుల పనితీరు పై బాబు అసంతృప్తి
-
మంత్రుల తీరు బాధించింది!
సాలూరు:రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు వ్యవహరించిన తీరు తనతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరినీ ఎంతగానో బా ధించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూ టీ ఫ్లోర్‌లీడర్, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. వచ్చే సమావేశాల్లోనైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలపై చర్చించేలా చూడాలని కోరారు. గురువారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. తాను ఇప్పటివరకు మూడు సభల్లో పాల్గొన్నానని, కానీ ఎప్పుడూ ఇలాంటి సభను చూడలేదన్నారు. మంత్రులు మాట్లాడే తీరు చాలా బాధి కలిగించిందని చెప్పారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పాల్సిన మంత్రులు అవమానకరంగా మాట్లాడడం, సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ.. బ్లాక్ మెయిల్‌కు దిగడం విచారకరమన్నారు. అందుకే తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షా ...ప్రభుత్వంలో ఉన్నది మేమా, లేక టీడీపీ వాళ్లా అన్న అనుమానం కలుగుతోందని స్పీకర్‌ను ప్రశ్నించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. పతి పక్షం, ప్రభుత్వంపై సమస్యలపై దాడి చేయడం పరి పాటని, కానీ ప్రజా సమస్యలు అడిగిన ప్రతిపక్షంపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం శోచనీయమన్నారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు తమ మాట తీరు మార్చుకోవాలని సూచించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా బ్లాక్ మెయి ల్కు దిగుతున్నారన్నారు. గృహ నిర్మాణ రుణాలు మంజూరు కాక, మం జూరైన వారికి బిల్లులు అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందు లు గురువుతున్నారని తాను సభ దృష్టికి తీసుకువెళితే జిల్లాకు చెందిన మంత్రి మృణాళిని సాలూరు నియోజకవర్గంలో కూడా అవినీతి జరిగిందని చెప్పుకొచ్చారన్నారు. అవినీతి జరిగిందని భావిస్తే విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి కాని లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తాను తిప్పికొట్టాల్సి వచ్చిందన్నారు. ఇదే తీరు ప్రతి పక్ష సభ్యులందరిపైనా మం త్రులు కనపరిచారన్నారు. ఎంతసేపూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని అవినీతిపరుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారే గాని ఆయనపై కేసులు విచార ణ దశలో ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోకుండా వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూ డా చాలా ఆరోపణలున్నాయని, వాటిపై సీబీఐతో విచారణ జరిపించుకుని మచ్చలేని నాయకుడిగా నిరూపించుకున్నప్పుడే జగన్‌ను విమర్శించే నైతిక హక్కు టీడీపీ నాయకులకు ఉంటుందని తెలిపారు. ఏమీ లేకపోతే చంద్రబాబుపై విచారణకు హైకోర్టులో స్టే తెచ్చుకోవాల్సిన పని ఏమొచ్చిందని ప్రశ్నించారు. మొదటిసారిగా ఎన్నికైన గిరిజన ఎమ్మెల్యేలను శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశార న్నారు. తమది రైతు ప్రభుత్వమని చెబుతున్న టీడీపీ నాయకులు జిల్లాలోని ఎన్సీఎస్ చక్కెర కర్మాగార యాజమాన్యం దాదాపు 16 వేల మంది రైతులకు రూ. 28 కోట్ల చెల్లించకుండా రోడ్డెక్కేలా చేస్తే.. ఆ విషయమై చర్చిద్దామని సభలో అడిగితే కొట్టిపారేశారన్నారు. ఇదేనా రైతు ప్రభుత్వం వ్యవహరించే తీరని ప్రశ్నించారు. మంత్రులు నిబద్దతతో వ్యవహరించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక శిక్షణ ఇస్తే బాగుం టుందని సూచించారు. ఈఏడాది చివరలో జరగనున్న శాసన సభలోనైనా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. -
రుణ మా(ఫీ)య
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన అన్ని వర్గాలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. టీడీపీ మంత్రులు, నేతలు, కార్యకర్తలను నిలదీసేందుకు ఆయూ వర్గాలు సిద్ధమవుతున్నాయి. పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో డ్వాక్రా గ్రూపు సభ్యులు కన్నెర్ర చేసి రోడ్డెక్కారు. వ్యవసాయం పట్ల మొదటినుంచి తేలిక భావం కలిగిన చంద్రబాబు మారాడని భావించి మొన్నటి ఎన్నికల్లో ఓట్లు వేశామని, అరుుతే రుణమాఫీపై ప్రకటనను బట్టి ఆయన మారలేదని స్పష్టమైందని రైతులు అంటున్నారు. రుణమాఫీ చేస్తానని బాబు కాలయాపన చేయడంతో నెల నుంచి బ్యాంకుల్లో రుణాలు దొరక్క ఖరీఫ్ పనులు ఆలస్యమైనాయని, దీనివల్ల దిగుబడులు తగ్గే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయూరైందని వాపోతున్నారు. ఇదిలాఉండగా పరిమిత రుణమాఫీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టేందుకు విపక్షాలు సిద్ధవుతున్నాయి. మరోవైపు.. చంద్రబాబు నిర్ణయానికి అనుకూలంగా టీడీపీ తమ్ముళ్లు సంబరాలు జరుపుకుంటుండటం విస్మయం కలిగిస్తోంది. అప్పుడు గెలుపే ధ్యేయం.. ఎన్నికల సమయంలో గెలుపే ధ్యేయంగా టీడీపీ పనిచేసింది. రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు తీసుకున్న రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని పార్టీ అధినేత చం ద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయిం చారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్న సమయంలో రుణమాఫీపై ప్రకటన చేశానని, విభజన తర్వాత రాష్ట్ర ఆదాయ వనరులు అందు కు సహకరించడం లేదంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేశారు. జిల్లాల్లో తిరి గిన మంత్రులు కూడా అధినేత కు వంత పాడారు. గుంటూరు జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసా యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రుణాలను మాఫీ చేయడానికి తమ వద్ద అక్షయపాత్ర, మంత్రదండం లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ వివరాలను వెల్లడించారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా గ్రూపులకు లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని వెల్లడించారు. దీనిపై రైతులు, డ్వాక్రా గ్రూపుల సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో ఆంధ్రాబ్యాంకు, ఐకేపీ సిబ్బంది మంగళవారం డ్వాక్రా గ్రూపు సభ్యులతో సమావేశం నిర్వహించి రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో వారంతా రాస్తారోకో నిర్వహించారు. గ్రూపునకు రూ.లక్ష వరకే మాఫీ చేయడం వల్ల గ్రూపులోని 10 నుంచి 12 మంది సభ్యులకు మాఫీ రూ.10 వేలలోపే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలోని 52,373 స్వయం సహాయక సంఘాలు రూ.1145 కోట్లు రుణాలుగా తీసుకున్నాయి. ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు మాఫీ చేస్తే రూ.523 కోట్లు మాత్రమే మాఫీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రైతులు రూ.4005 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. ఒక కుటుంబానికి ఒక రుణం మాత్రమే రద్దు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఫలితంగా సగానిపైగా రైతులకు మాఫీ వర్తించే అవకాశాలు కనపడటం లేదు. వరినారుమళ్లు, నాట్లు, ఎరువులు వేసే సమయంలో రైతులు దశలవారీగా బ్యాంకు రుణాలు తీసుకుంటారు. ఖరీఫ్ సీజను పూర్తయ్యేలోపు మూడునాలుగు సార్లు రుణం తీసుకుంటారు. అయితే ఒక రుణానికే మాఫీని వర్తింపచేయడం వల్ల రైతులకు పెద్దగా లా భం ఉండదు. బాబు ప్రకటనపై అన్ని వర్గాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే గుంటూరు టీడీపీ కార్యాలయంలో నేతలు మాత్రం సం బరాలు జరుపుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 30న మహాధర్నా డ్వాక్రా, చేతి వృత్తిదారుల రుణాలన్నీ బేషరతుగ మాఫీ చేయాలని కోరుతూ ఈ నెల 30న సమాజ్‌వాది పార్టీ గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట మహాధర్నాను చేపట్టనున్నది. ఈ మేరకు పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నవీన్‌కుమార్, వై.వి.సురేష్‌లు ధర్నా వివరాలను వెల్లడించారు. రుణమాఫీని పూర్తిగా అమలు చేయగలిగే పరిస్ధితులు లేనప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.