సాక్షి, హైదరాబాద్: గవర్నర్‌ను కించపరచడమే కాకుండా రెండు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబు, ఏపీ మంత్రులపై కేసు నమోదు చేయాలంటూ గురువారం సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సీఎం బాబుతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథ్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర, రావెల కిశోర్‌బాబు బహిరంగసభల్లో టీ సర్కార్‌ను కూలుస్తామంటూ గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్య లు చేశారని న్యాయవాది ఫణీంద్ర భార్గవ్ మేజి స్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి వారి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఎల్‌బీనగర్ పోలీసుల్ని ఆదేశించారు.