సాక్షి, కందుకూరు: నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబాబు సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేసు నమోదయింది. సెక్షన్ 174 కింద కందుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేశారు. ఈ ఘటనలో 8 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు విచారణ అనంతరం నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చనున్నారు.
ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి ప్రచార యావ చాలా ఎక్కువ. ఈ విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోడు. ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఈ వ్యవహారశైలే మరోసారి ప్రజల ప్రాణాలపైకి తెచ్చింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి యాత్ర సందర్భంగా కందుకూరులో నిర్వహించిన బహిరంగసభ అనేక మంది కుటుంబాల్లో పెను విషాదన్ని మిగిల్చింది.
చదవండి: (‘షో’క సంద్రం.. చంద్రబాబు రోడ్ షోలో 8 మంది దుర్మరణం)
Comments
Please login to add a commentAdd a comment