
సుజనా చౌదరిపై అసంతృప్తి
హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై ఏపీ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా రాదంటూ టీడీపీకి చెందిన కేంద్ర మంత్రే ప్రకటన చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర మంత్రులను కలిసేటప్పుడు కూడా సహచర టీడీపీ ఎంపీలను తీసుకెళ్లకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి వస్తాయంటున్న నిధులు రాష్ట్రానికి పడ్డ బకాయిలేనని టీడీపీ సీనియర్లు అంటున్నారు.