ఆ మంత్రులు అవివేకులు | mla peddireddy ramachandra reddy fires on tdp ministers | Sakshi
Sakshi News home page

ఆ మంత్రులు అవివేకులు

Published Thu, Dec 28 2017 11:03 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

mla peddireddy ramachandra reddy fires on tdp ministers - Sakshi

సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో చిత్తూరు జిల్లా తీవ్ర వివక్షకు గురైందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన సొంత నియోజక వర్గాన్నే అభివృద్ధి చేయలేక పోయారని విమర్శించారు. ఉపాధి కోసం కుప్పం ప్రజలు లక్షలాది మంది రోజు వేరే ప్రాంతాలకు వలసపోతున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు తన నియోజక వర్గానికి సాగు, తాగు నీరు ఇవ్వలేక పోయారని ఎద్దేవా చేశారు. జిల్లాలో షుగర్‌ ఫ్యాక్టరీని మూసేసి రైతులకు త్రీవ అన్యాయం చేశారని పెద్దిరెడ్డి విమర్శించారు. వైఎస్‌ఆర్ హయంలో షుగర్‌ ఫ్యాక్టరీలకు ప్రాణం పోసి రైతులకు మేలు చేశారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత షుగర్‌ ఫ్యాక్టరీలు మళ్లీ ముతపడ్డాయన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రపై విమర్శలు చేసే మంత్రులు అవివేకులు అని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రజాసంకల్పయాత్ర ఎలా సాగుతుందో వచ్చి చూస్తే తెలుస్తుందని సూచించారు. ఇంటికెళ్లే ముందైనా టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని పెద్దిరెడ్డి అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement