కరువు, చంద్రబాబు కవలపిల్లలు | ys jagan fires cm chandrabab on farmars issue | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 11 2018 6:09 PM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM

ys jagan fires cm chandrabab on farmars issue - Sakshi

నెమళ్లగుంటపల్లి (చిత్తూరు జిల్లా): చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రైతులు పూర్తిగా మోసపోయారని, చంద్రబాబే దళారిగా మారి.. రైతులను దళారులకు అమ్మేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదని, రైతులు బాబు పాలనలో తీవ్ర అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని, చంద్రబాబు సీఎం కావడంతో ఆయనతోపాటు కరువు కూడా వచ్చిందని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా నెమళ్లగుంటపల్లిలో గురువారం వైఎస్‌ జగన్‌ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. దేవుడి దయతో రేప్పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేలు చేయడానికి ప్రత్యేక పథకాలు అమలుచేస్తామని, ప్రతి ఒక్క రైతు కుటుంబంలోనూ ఆనందాన్ని నింపుతామని వైఎస్‌ జగన్‌ తెలిపారు. మన పాలనలో అనుసరించాల్సిన విధానాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతులను కోరారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ క్లుప్తంగా ప్రసంగించారు.. ఆయన ఏమన్నారంటే.

  • చంద్రబాబు పాలనలో రైతులు పూర్తిగా మోసపోయారు
  • ఎన్నికల్లో గెలువడం కోసం ఇదే మనిషి ఏం చెప్పారు?
  • బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలి
  • 87వేల వ్యవసాయ రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలి
  • నాలుగేళ్ల తర్వాత మన పరిస్థితి ఏమిటి?
  • బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా?
  • రాలేదు, సరికదా మన బంగారాన్ని వేలం వేస్తున్నట్టు బ్యాంకులు రైతుల ఇంటికి నోటీసులు పంపుతున్నాయి
  • బాబు అమలుచేస్తున్న రుణమాఫీ పథకం కనీసం రైతుల వడ్డీలకు కూడా సరిపోవడం లేదు
  • ఐదువేల కోట్ల రూపాయలతో ధరల స్థీరికరణ నిధి పెడతానని చంద్రబాబు చెప్పారు
  • ఇవాళ రైతులు పండించే ఏ పంటకైనా మద్దతుధర లభిస్తోందా?
  • నాలుగేళ్ల పాలనలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా?
  • ఏమైంది ధరల స్థీరికరణ నిధి.. ఎందుకు ఏర్పాటుచేయలేదు?
  • చంద్రబాబు, కరువు.. కవలపిల్లలు!
  • చంద్రబాబు సీఎం కాగానే.. ఆయనతోపాటు కరువు కూడా వచ్చింది
  • బాబు పాలనలో వరుసగా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించే పరిస్థితి
  • కరువు మండలాల్లో ప్రభుత్వం రైతులకు ఏమాత్రం సహాయం చేయడం లేదు
  • ఈ నాలుగేళ్లలో ఏ రైతుకైనా ఇన్‌పుట్‌ సబ్సిడీ, కరువు సాయం చేయడం కనిపించిందా?
  • ఈ సంవత్సరం రాయలసీమలో ఆగస్టు 9వ తేదీ నాటికి మైనస్‌ 22శాతం వర్షపాతం నమోదైంది
  • వర్షాల్లేక ఈ ప్రాంతం అల్లాడుతున్నా.. ఇప్పటికీ ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడంలేదు
  • కనీసం కరువు మండలాలు ప్రకటిస్తే.. రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఇవ్వాల్సి వస్తుందని వెనుకాడుతున్నారు
  • రైతులకు ఇచ్చే సహాయం, ఇన్సూరెన్స్‌ అన్ని అరకొరగానే ఇస్తున్నారు
  • రైతులకు సహాయం చేసే ఏ పని చంద్రబాబు పాలనలో జరగడం లేదు

  • చిత్తూరు జిల్లాలో మనకు చెరుకు రైతులు ఎక్కువ
  • సహకార రంగంలోని చెరకు ఫ్యాక్టరీలు నడిస్తే.. రైతులకు మేలు జరుగుతుంది
  • అప్పుడు ప్రైవేటు ఫ్యాక్టరీలు కూడా పోటీగా రైతులకు మద్దతు ధర ఇస్తాయి
  • బాబు సీఎం కాగానే చిత్తూరు జిల్లాలో ఉన్న రెండు షూగర్‌ ఫ్యాక్టరీలు మూతబడిపోతున్నాయి
  • బాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈ రెండు ఫ్యాక్టరీలు మూతబడ్డాయి
  • దివంగత నేత వైఎస్సార్‌ తన పరిపాలనలో ఈ షూగర్‌ ఫ్యాక్టరీలను మళ్లీ తెరిపించారు
  • కానీ, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలు మళ్లీ మూతబడటంతో గత్యంతరం లేక ప్రైవేటు ఫ్యాక్టరీలు చెప్పే రేటుకు అమ్ముకుంటున్నారు
  • గిట్టుబాటు ధర లేకపోవడంతో చెరకు రైతులు బెల్లం తయారీ చేసుకుంటుండగా..
  • నల్లబెల్లం అంటూ ఆ బెల్లం తయారీపైనా చంద్రబాబు ఆంక్షలు విధిస్తున్నారు
  • ఒక మహిళ నా వద్దకు ఒక లీటరు పాలు, ఒక లీటరు నీళ్లు తీసుకొని వచ్చింది
  • బెల్లం తీసుకొచ్చి చూపించి.. మా జిల్లాలో పండేది ఇదే..ఇది నల్లగా ఉంటే మేం ఏం చేయాలి? అని అడిగింది
  • లీటరు నీళ్ల బాటిల్‌ రూ. 20 అమ్మితే.. లీటరు పాలు రూ. 22 అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది
  • తన హేరిటేజ్‌ ఫ్యాక్టరీకి లాభాలు రావాలని.. చంద్రబాబు పాడిరైతుల పొట్టకొట్టారు
  • విజయా డైరీని సీఎం చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం మూయించారు
  • మన ఖర్మ ఏమిటంటే చంద్రబాబు హెరిటేజ్‌ ఫ్రెష్‌ పేరిట షాపులు పెట్టి కూరగాయలు కూడా అమ్ముతున్నారు
  • ఆయన దగ్గరుండి దళారి వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు.
  • చంద్రబాబే ఒక దళారి అయి.. రైతులను దళారిలకు అమ్మేస్తున్నారు
  • చంద్రబాబు పాలనలో రైతులకు కొత్త కరెంటు కనెక్షన్లు కూడా ఇవ్వడం లేదు
  • బాబు పాలనలో చిత్తూరు జిల్లాలోని హంద్రీనీవా, గాలేరు ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు



    మన ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్నివిధాలుగా ఆదుకుంటాం
  • రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం
  • వ్యవసాయానికి పగటిపూట ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ ఇస్తాం
  • దరఖాస్తు చేసుకున్న పదిరోజుల్లోనే రైతులకు కొత్త కరెంటు కనెక్షన్లు ఇస్తాం
  • జూన్‌లో సాగుకు సిద్ధమయ్యే రైతుకు మే నెలలో పెట్టుబడి భరోసా కింద రూ. 12,500 చొప్పున అందజేస్తాం
  • రైతన్నలకు అందించే పంటరుణాలు పూర్తిగా వడ్డీ లేకుండా అందజేస్తాం
  • అక్షరాల మూడువేల కోట్లతో ధరల స్థీరికరణ నిధి ఏర్పాటు చేస్తాం
  • రైతన్న పంట వేయకముందే ఏ రేటుకు కొంటామో ముందే ప్రకటిస్తాం
  • పాడిరైతులను ప్రత్యేకంగా ఆదుకుంటాం
  • కరువు వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా రైతులను ఆదుకోవడానికి రూ. 4వేల కోట్లతో కాలమిటీ  ఫండ్‌ ఏర్పాటుచేస్తాం
  • ప్రతి రైతన్నకూ మా ముఖ్యమంత్రి తోడున్నారన్న ధీమా కల్పిస్తాం
  • ప్రతి ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి.. కాల్వల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement