పచ్చిమోసం! | Re-schedule the loan waiver ... | Sakshi
Sakshi News home page

పచ్చిమోసం!

Published Mon, Aug 11 2014 4:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

పచ్చిమోసం! - Sakshi

పచ్చిమోసం!

  •     రుణమాఫీ...రీషెడ్యూల్...ఒట్టిమాటలే అని తేలిన వైనం
  •      కొత్త రుణం కావాలంటే పాత బకాయిలు చెల్లించాల్సిందే
  •      జిల్లాలో వ్యవసాయ రుణాలే  రూ.5810.84కోట్లు
  •      మండిపడుతున్న రైతులు
  • సాక్షి, చిత్తూరు: ‘‘అంతన్నాడింతన్నాడే...గంగరాజు...ముంతమామిడి పప్పన్నాడే గంగరాజు’’ అన్నట్లు...అంతా అనుకున్నదే జరిగింది. సీఎం కుర్చీ ఇవ్వండి...రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేసి మీ జీవితాలను ఆనందమయం చేస్తామని ఆచరణసాధ్యం కానీ హామీలతో ఊదరగొట్టిన చంద్రబాబు...ఇప్పుడు ఉసూరుమనిపించారు. రుణమాఫీ నుంచి రీషెడ్యూల్ వరకూ రైతులకు అర్థం కాని మాటలను వల్లెవేసి, వారిని అయోమయానికి గురిచేసిన చంద్రబాబు చివరగా చేతులెత్తేశారు.
     
    రుణమాఫీ నుంచి బకాయిలు చెల్లించేదాకా:

    రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు రైతులను తప్పుదోవ పట్టిం చేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరిం చింది. అధికారంలోకి రాగానే రైతుల్ని రుణవిముక్తుల్ని చేస్తామని బీరాలు పలికారు. అధికారపీఠం దక్కిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బం దులున్నాయి... అయినా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. అందుకు ఎర్రచందనాన్ని కూడా విక్రయించి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామన్నారు.

    ఈ ప్రకటనతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రుణమాఫీ అమలుపై వారికి సందేహం మొదలైంది. ఆపై రుణమాఫీ పూర్తిగా సాధ్యం కాదని రైతులకు 1.5లక్షలు, బంగారంపై 50వేలు, డ్వాక్రా సంఘాల్లో ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పారు. అది కూడా కుటుంబానికి ఏదేని ఒక రుణం మాత్రమేనని  లింకు పెట్టారు. దీంతో రైతులు మోసపోతున్నామని గ్రహించారు. ఆపై ఇప్పట్లో సాధ్యం కాదని, రీషెడ్యూల్ చేసేలా చూస్తామని చెప్పారు.

    రుణమాఫీ చేసే పరిస్థితులు కనిపించడం లేదని రీషెడ్యూల్‌తో సర్దుకుందామని రైతులకు తెలుగుతమ్ముళ్లు ఉద్బోధ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రీషెడ్యూల్ కూడా కుదరదని ఆర్‌బీఐ తేల్చి చెప్పింది. శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విజయనగరం, కృష్ణా జిల్లాల్లోని కొన్ని మండలాలకు మాత్రమే రీషెడ్యూల్ వర్తిస్తుందని పేర్కొంది.

    చిత్తూరు జిల్లాలో 33 కరువు మండలాలు ఉన్నప్పటికీ రీషెడ్యూల్‌కు తిరస్కరించింది. దీంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసింది. కొత్త రుణాలు కావాలంటే పాత బకాయిలు చెల్లించాలని, భవిష్యత్తులో తిరిగి రైతు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెబుతున్నారు. దీంతో రైతులంతా మోసపోయామని గ్రహించారు. రుణమాఫీకి ఎలాగూ దిక్కులేదు... కనీసం రీషెడ్యూల్ చేయించే స్తోమత కూడా లేనప్పుడు హామీ ఎందుకిచ్చారని మండిపడుతున్నారు.
     
    జిల్లాలో బకాయిల పరిస్థితి ఇదీ..
     
    2014 మార్చి ఆఖరుకు రాష్ట్రంలో 87,612కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇందులో చిత్తూరు జిల్లాలో 5,810.84 కోట్ల రూపాయల పంటరుణాలను 7,55,270 మంది రైతులు తీసుకున్నారు. అలాగే పట్టాదారు పాసుపుస్తకంపై బంగారునగలు తాకట్టుపెట్టి 3,486.50 కోట్ల రూపాయలను 68,671మంది తీసుకున్నారు. దీర్ఘకాలిక, స్వల్ప కాలిక (టర్ము) రుణాల కింద 45,780 మంది రైతులకు రూ.1129.75 కోట్లు ఇచ్చారు. అలాగే వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా రూ.753.16 కోట్లు రుణాలు ఇచ్చారు. వీటిలో ఏ ఒక్క రుణాన్నీ మాఫీ చేసే పరిస్థితి లేదు. అన్ని బకాయిలు చెల్లించి, కొత్త రుణాలు తీసుకోవాలి.
     
    ఆలస్యం చేస్తే వడ్డీబాదుడూ తప్పదు..

    ప్రస్తుతం పంటరుణాల బకాయిలు చెల్లిస్తే 4శాతం వడ్డీని వసూలు చేస్తారు. కాస్త ఆలస్యమైతే 11 శాతం అదనపు వడ్డీని చెల్లించాలని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ ప్రకటనలతో రైతులంతా బోరుమంటున్నారు. ఏదో జీవితాలు బాగు చేస్తామంటే ఆశపడి ఓటేసి చంద్రబాబును సీఎంను చేస్తే రుణమాఫీ... 1.5 లక్షలు... రీషెడ్యూలు అన్నీ పోయి... ఎవరి బకాయిలు వారు చెల్లించే పరిస్థితి వచ్చిందేంటని వేదనపడుతున్నారు.
     
    పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు
     
    రీషెడ్యూలుకు సంబంధించి మాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. బ్యాంకులకు ఎలాంటి బకాయిలు లేనివారికి కొత్త రుణాలు ఇస్తాం. రైతులు పాత బకాయిలు చెల్లిస్తే వారికీ కొత్త రుణాలు ఇస్తాం.
     -వెంకటేశ్వరరెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement