చంద్రబాబు బూటకపు హా మీలతో మోసపోయామని మండలంలోని వివిధ గ్రామాల వీవోల లీడర్లు నిరసన గళం విన్పించారు.
కురబలకోట: చంద్రబాబు బూటకపు హా మీలతో మోసపోయామని మండలంలోని వివిధ గ్రామాల వీవోల లీడర్లు నిరసన గళం విన్పించారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేయాలని, అంతవరకు ఎత్తిన చేతు లు దించేది లేదన్నారు. శనివారం వారు మొలకవారిపల్లెలో వీవో(గ్రామ సమైఖ్య) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా డ్వాక్రా లీడర్లు కాదర్‌బీ, భూలక్ష్మి, మహబూబ్‌బీ, రెడ్డెమ్మ తదితరులు మాట్లాడు తూ చంద్రబాబు రుణమాఫీ ఒట్టి బూటకమన్నారు.
ఆయన మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతోందన్నారు. ఎన్నికలకు ముందు అన్ని రుణాలు మాఫీ సాధ్యమేనన్నారు. ఇప్పుడు గ్రూపుకు లక్ష మాత్ర మే మాఫీ చేస్తానని మాట మార్చడం తగదన్నారు. రైతుల, డ్వాక్రా రుణమాఫీకి గతి లేకున్నా సింగ పూర్ తరహా రాజధాని కట్టిస్తాననడం ప్రజల్ని మభ్య పెట్టడమేనన్నారు.
మంత్రులు కూడా తానా.. అంటే తం దానా అంటున్నారని ధ్వజమెత్తారు. కాగా మండలంలో 882 డ్వాక్రా గ్రూపులు ఉన్నా యి. వీటిలో 540 గ్రూపులు బ్యాంకు రుణా లు తీసుకున్నాయి. ఈ రుణాలు రూ. 21 కోట్లు దాకా ఉన్నాయి. చంద్రబాబు చెప్పిన రూ.లక్ష మేరకైతే రూ.5 కోట్లు మాత్రమే మాఫీ అవుతాయి. చంద్రబాబు నట్టేట ముంచారని మహిళలు వాపోయారు.