మోసపూరిత హామీలు చంద్రబాబుకే చెల్లు
గుంటూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిలా తానూ మోసపూరిత హామీలు ఇచ్చి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో శుక్రవారం ఉంగుటూ రు, చింతలపూడి నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, మునిసిపల్ కౌన్సిలర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ చేస్తామని రైతులు, డ్వాక్రా మహిళలను నమ్మించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. అయినప్పటికీ టీడీపీకి, వైఎస్సార్ సీపీకి మధ్య 5. 60 లక్షల ఓట్లు మాత్రమే తేడా వచ్చిం దన్న విషయాన్ని గుర్తు చేశారు.
అబద్ధపు హామీలు ఇచ్చి ఉంటే అందులో 2లక్షల 80వేల ఓట్లు వైఎస్సార్ సీపీకి లభించి ఉండేవని, తామే అధికారంలోకి వచ్చి ఉండేవారమని అన్నారు. నిజమైన రాజకీయాలు చేసి ఒక మంచి నాయకుడిగా సుపరి పాలన సాగించి, ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలన్నదే తన అభిమతమని చెప్పారు. తద్వారా 30 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించి అన్నివర్గాల ప్రజలను అభివృద్ధిపథంలో నడపాలన్నదే తన లక్ష్యమని వివరించారు.
అందుకే తప్పుడు హామీలను ఇవ్వలేకపోయాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదిం చారని, ఆయనలాగే తాను సైతం ప్రజల మనసుల్లో స్థానాన్ని సంపాదిం చుకునేందుకు పాటుపడతానని చెప్పారు. చింతలపూడి, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
ఇది అన్యాయం బాబూ
చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రతి డ్వాక్రా చెల్లెమ్మ ఖాతాలో నుంచి వారికి ఎటువంటి సంబంధం లేకుండా బ్యాంకు అధికారులు డబ్బులు తీసుకుంటున్నారన్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెబుతున్న చంద్రబాబ వాటిపై పడుతున్న వడ్డీలను ఏంచేస్తారని ప్రశ్నించారు.
పలువురు రైతులు రుణాలు చెల్లించినప్పటికీ బ్యాంకు అధికారులు బంగారం ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది. ప్రతి కార్యకర్త వారి మనోభావాలను పార్టీ అధినేత ఎదుట వ్యక్తం చేశారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ బాగా పనిచేయటం వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయిందని పలువురు కార్యకర్తలు తెలిపారు. టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసుల విషయంలో పోరాటాలకు సన్నద్ధం కావాలని కోరారు. పార్టీలో కొంతమంది నేతలు స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే వారి చిట్టాలను బయటపెడ తామని తెలిపారు.
పార్టీ అధినేత పిలుపును సైతం లెక్క చేయకుండా నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. కార్యకర్తలు చెప్పిన వివరాలను రాసుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే పలు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కన్వీనర్ తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్‌కుమార్, ఘంటా మురళి, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, నాయకులు జానకిరెడ్డి, శరత్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, నరసింహారెడ్డి, తోట కుమార్, తోట లక్ష్మణరావు, బాబ్జీ, రాజానాయక్, సుబ్బారావు, సునీత, దేవమణి, చరణ్‌కుమార్, కీర్తి, పి.నాని, చౌదరిబాబు, ఎం.వెంటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.