డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి
కుప్పం: ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిగా డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. అధికారం కోసం హామీ ఇచ్చి ప్రస్తుతం సీఎం కుర్చీ అందగానే మాట మార్చడం సరికాదని మండిపడ్డారు. బ్యాంకులకు వేలకు వేలు వడ్డీలు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మొన్న వానగుట్టపల్లి, నిన్న శెట్టిపల్లివాసులు ఆందోళనలు చేపట్టగా శనివారం కుప్పం పట్టణం పాతపేటలో డ్వాక్రా సంఘాల వుహిళలు జాతీయు రహదారిపై బైఠాయించారు.
వారు వూట్లాడుతూ తాము బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ప్రతినెలా చెల్లిస్తూ వచ్చావున్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి రుణాలు మాఫీ చేస్తామని చెప్పడంతో ఆపేశామని తెలిపారు. ప్రస్తుతం ఒక్కో సంఘానికి కేవలం రూ.లక్ష వూత్రమే వూఫీ చేస్తావుని చెబితే మిగతా అప్పులకు తాము వడ్డీ ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ప్రశ్నించారు.
కొన్ని బ్యాంకుల్లో వీవో లీడర్లను సంప్రదించకుండానే బ్యాంకర్లు పొదుపు ఖాతాల్లోంచి నగదును రుణాలకు జవు చేసుకుంటున్నారని, ఇది భావ్యం కాదని అన్నారు. కరువు పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేసే వరకు దశలవారీగా ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.
రుణాలు మొత్తం వూఫీ చేయూల్సిందే
ఎన్నికల సవుయుంలో ప్రకటించిన విధంగా డ్వాక్రా రుణాలు పూర్తిగా వూఫీ చేయూల్సిందే. ఐదు నెలలకు సంబంధించి అసలు, వడ్డీ ఒకేసారి కట్టవుంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి. వుహిళలు పొదుపు కడితే ఆ డబ్బును కూడా అప్పులకు జవు చేసుకోవడం దారుణం. రుణాలు తోసేస్తావుని చెప్పి మాట మార్చడం సరికాదు.
-వుహేశ్వరి, డ్వాక్రా వుహిళ, కుప్పం
రుణాలడిగితే తిప్పికొట్టవున్నారు..
వుహిళల రుణాలన్నీ వూఫీ చేస్తావున్నారు. ఎవరైనా రుణాలు కట్టవుని అడిగితే తిప్పికొట్టవున్నారు. పేపర్లలో కూడా ఈ విషయుం వచ్చింది. ఇప్పుడేమో కేవలం రూ.లక్ష వూఫీ అంటున్నారు. కూలి పనులు చేసుకునే వుహిళలు ఎక్కడి నుంచి తెచ్చి డబ్బు కట్టాలి. ఈ వడ్డీలకు బయుట కూడా రుణాలు తీసుకోవచ్చు. ఇకపై పొదుపు కూడా కట్టేది లేదు.
-నిర్మల, డ్వాక్రా వుహిళ, కుప్పం
వేలకు వేలు ఎక్కడి నుంచి తేవాలి
వడ్డీలేని రుణాలు ఇచ్చి ఇప్పుడేమో ఐదు నెలలకు కలిపి వడ్డీ, అసలు కట్టవుంటున్నారు. ఇది చాలా దారుణం. వేలకు వేలు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేది. వూ పొదుపుల్లో ఉన్న డబ్బును కూడా అప్పుకు జవు చేసుకుంటున్నారు. డ్వాక్రా వుహిళలకు ఇదివరకు చెప్పిన విధంగానే రుణాలు మొత్తం వూఫీ చేసి తీరాలి.
-కృష్ణవేణి, డ్వాక్రా వుహిళ, కుప్పం