రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి | Give resolution debt waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి

Published Wed, Jul 23 2014 1:44 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి - Sakshi

రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి

శ్రీకాకుళం అర్బన్: రైతులు, డ్వాక్రా రుణాల మాఫీపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు స్పష్టమైన వైఖరి తెలపాలని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. ఎన్నికల ప్రచారంలో రైతాంగానికి, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక దీనిపై పూటకోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు సంబంధించి ఒక కుటుంబానికి పంట, బంగారం రుణాలను రూ. లక్షన్నర వరకు, డ్వాక్రా మహిళలకు రూ. లక్ష వరకే రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు షరతులు విధించడం దారుణమన్నారు. టీడీపీ ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం ఉంటే ఆదాయ, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు తమ్మినేని వెంకట చిరంజీవినాగ్, కిరణ్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement