టెక్కలి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్
టెక్కలి: సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన చం ద్రబాబు, ఆయన పాలకవర్గం నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అధికారులతో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహా రాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాసు అన్నా రు. మంగళవారం టెక్కలిలో వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త పే రాడ తిలక్ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు.
ఈ సందర్భంగా కృష్ణదాసు మాట్లాడుతూ ఎన్నికల ముందు మోసపూరితమైన హామీలు గుప్పించి అధికారం దక్కించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మంత్రులు సుమారు నాలుగున్నరేళ్లుగా అన్ని రకాల అవి నీతి కార్యకలాపాలకు పాల్పడి కోట్ల రూపాయలు దోచుకున్నారని, మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో సారి రాష్ట్ర ప్రజలను మోసగించడానికి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని దుయ్యబట్టారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన అన్ని రకాల సంక్షేమ పథకాలు ఈనాడు రాష్ట్రంలో అన్ని వర్గాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయన్నారు. అలాంటి సంక్షేమ పథకాలకు పసుపు రంగు పూసి అర్హులైన పేదలకు ఇవ్వకుండా జన్మభూమి కమిటీలతో అనర్హులకు అందలం ఎక్కిస్తున్నారని ఆయ న మండిపడ్డారు. వీటికి అధికారులను బలి చేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారని కృష్ణదాసు వెల్లడించారు. సంక్షేమ పాలన అందజేస్తారని టీడీపీ నాయకులకు ప్రజలు పగ్గాలు ఇస్తే వాటిని కుటుంబ వ్యవస్థగా మార్చి సామాన్య ప్రజలను హింసిస్తున్నారని మండిపడ్డారు.
జిల్లాలో సాగునీటి కోసం రైతులు పడుతు న్న కష్టాలు బాధాకరంగా ఉన్నాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన నవరత్నాల పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాయని, రాబోయే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని కృష్ణదాసు అన్నారు.అనంతరం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత చోటు చేసుకుందన్నారు.
జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు చే స్తున్న అవినీతి, అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. జిల్లాలో ధర్మాన ప్రసాదరా వు హయాంలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం జరి గిందేమిటని ప్రశ్నించారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త తిలక్ మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు జన్మభూమి కమిటీలతో అనర్హులకు పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు.
టెక్కలి నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఇలాంటి మంత్రికి తగిన గుణపాఠం తప్పదన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ బి.గౌరీపతి, నాయకులు టి.జానకిరామయ్య, దువ్వాడ వాణి, సత్తారు సత్యం, సత్తారు ఉషారాణి, కురమాన కృష్ణారావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment