రుణమాఫీపై మహిళల రణభేరి | loan waiver scheme for women ranabheri | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై మహిళల రణభేరి

Published Fri, Jul 25 2014 2:31 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM

loan waiver scheme for women ranabheri

  •    స్వచ్ఛందంగా రోడ్లపైకొచ్చి నిరసన
  •      ధర్నా, రాస్తారోకోతో ఉద్రిక్తత
  •      మహిళలకు వైఎస్సార్‌సీపీ మద్దతు
  •  మదనపల్లె: డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలంటూ మదనపల్లెలో మహిళలు రోడ్లపైకొచ్చి రణభేరి సాగిం చారు. వేలాది మంది మహిళలు పార్టీలకు, రాజకీయాలకు ఆతీతంగా స్వచ్ఛందంగా రోడ్లపైకొచ్చి సీఎం చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
     
    గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయం లో డ్వాక్రా మహిళలతో సమావేశం ఉందని మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో సమాచారం ఇచ్చారు. మహిళలు హాజరయ్యూరు. అరుుతే రుణాలు మాఫీ అయ్యాయని సంబరాల్లో భాగంగా వైస్ చైర్మన్ కేక్ కట్‌చేశారు. దీనిపై మహిళలు ఆగ్రహించారు. ఏం సాధించారని సంబరాలు చేస్తున్నారని నిలదీశారు. ఆ కార్యక్రమాన్ని బహిష్కరించి ఆందోళనకు దిగారు. చర్చిముందు రోడ్డుపై ధర్నా నిర్వహించారు.

    అంతేకాకుండా స్థానిక టౌన్‌బ్యాంకు సర్కిల్‌లో బైఠాయిం చారు. దాదాపు గంటన్నరసేపు మహిళలు ఆందోళన నిర్వహించడంతో సీటీఎం రోడ్డు, అవెన్యూ రోడ్డులో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐలు మల్లికార్జున, దస్తగిరిలు ఆందోళనకారులతో చర్చించారు. ఓ దశలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని నమ్మించి ఇప్పుడు ఒక్కో మహిళకు పదివేలు మాఫీ చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు.

    నాలుగు నెలలుగా తామెవ్వరూ రుణాలను చెల్లించలేదని ఇప్పుడు వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు పంపిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే మహిళా లోకం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేట్టేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పునరాలోచించి రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
     
    మహిళలకు వైఎస్సార్‌సీపీ మద్దతు
     
    మహిళల ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూ ర్ణ మద్దతు ప్రకటించింది. ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, నాయకులు ఆందోళనకారులకు మద్దతు ప లికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు మొత్తం *22 వేల కోట్లు అరుుతే *7 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించడం గర్హనీయమన్నారు. ఎన్నికల హామీలను  నెరవేర్చలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాం డ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఉ ద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మస్తాన్‌రెడ్డి, నాయకులు దేశాయ్ జయదేవ్ రెడ్డి, రఫీ, హర్షవర్ధన్ రెడ్డి, కోటూరి ఈశ్వర్, పూజారి రమేష్, బాస్ నాయకులు శ్రీచందు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement