vaiessarsipi
-
కాలువలు పూర్తికాకనే నీరెలా ఇస్తారు?
వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నల్లమాడ: ‘పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం చెరువుకు నీరు విడుదల చేయాలంటే మూడు రైల్వే క్రాసింగ్‌ల్లో బ్రిడ్జిలు నిర్మించి కాలువ తవ్వాల్సి ఉంది. బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వే శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనుమతి తీసుకోలేదు. చెరువు ముంగిట ఉన్న పెద్దకమ్మవారిపల్లి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి కాకుండానే నీటి విడుదల ఎలా సాధ్యమని’ వైఎస్సార్ సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి తప్పుడు ప్రకటనలు చేస్తూ నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నల్లమాడ మండలం పెమనకుంటపల్లి తండాలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చెరువుల్లో పూడిక తీస్తేనే నీటి సామర్థ్యం పెరుగుతుందన్నారు. పిల్లకాల్వలు తవ్వకుండా నీరు విడుదల చేసినా రైతులకు ప్రయోజనం ఉండదన్నారు. రూ.100 కోట్ల తెల్లధనం, భారీగా బంగారు నిల్వలతో పట్టుబడిన శేఖర్‌రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా చంద్రబాబు నియమించారంటే వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో విచారణాధికారులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానికి లేఖ రాయడం ద్వారా పెద్ద నోట్ల రద్దుకు చంద్రబాబు కారణమయ్యారని, ఫలితంగా సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాజధాని నిర్మాణంలో రోజుకో డిజైన్ మారుస్తూ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
బాబు వచ్చాడు ... జాబులు ఊడాయి
– ప్రతి నిరుద్యోగికి రూ.60 వేల బకాయి చెల్లించాలి – వైఎస్సార్సీపీ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస కదిరి టౌన్ : ఎన్నికల్లో జాబు కావాలంటే బాబు రావాలని నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కారని వైఎస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. ఒక్కో నిరుద్యోగికి రూ.2 వేలు ఇస్తామని మాటతప్పారన్నారు. ఒక్కో నిరుద్యోగికి రూ. 60 వేల చొప్పున సీఎం చంద్రబాబు బకాయి పడ్డారన్నారు. సోమవారం సాయంత్రం వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పీవీ సిద్దారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే వెనుకబడిన రాయలసీమలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. విభజన చట్టంలోని హామీ ప్రకారం కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానం రద్దు అయ్యేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. అన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకై నిరంతర పోరాటం చేస్తామనీ, మహిళా ఉపాధ్యాయ, ఉద్యోగులకు 22 నెలల ఛైల్డ్ కేర్ లీవ్‌లను సాధన కోసం కృషిచేస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించేలా సర్కారుపై మరింత ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పీవీ సిద్దారెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగాల లోకోశ్వర్రెడ్డి, పట్టణ అ«ధ్యక్షుడు కేఎస్ బహవుద్దీన్, కౌన్సిలర్ ఖాదర్‌బాషా, కదిరి, గాండ్లపెంట మండల కన్వీనర్లు ప్రకాష్, చంద్రశేఖర్రెడ్డిలు పాల్గొన్నారు. -
కేసులెన్ని పెట్టినా పోరుబాటే!
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన స్పష్టీకరణ ► బాధితుల తరఫున జగన్ నాయకత్వంలో పోరాటం ► అణచి వేయాలనుకుంటే ప్రభుత్వానికి భంగపాటే ► ప్రజలను జలగల్లా పీల్చి పిప్పిచేస్తున్న జన్మభూమి కమిటీలు సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: అధికారమదంతో టీడీపీ నాయకులు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న వైనాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని, ఇది అభివృద్ధిని అడ్డుకోవడమెలా అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగంతో అడ్డుకోవాలనుకుంటే భంగపాటు తప్పదన్నారు. హామీల వలవేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు మూడో సంవత్సరం గడిచిపోతున్నా ఎలాంటి అభివృద్ధి చేశారో ప్రజలు ఇప్పటికే గ్రహించారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గార మండలం శ్రీకూర్మంలో సర్పంచ్ బరాటం రామశేషు ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ధర్మాన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేలాది సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అర్హులందరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. అందుకు భిన్నంగా టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికీ గండికొడుతూ జన్మభూమి కమిటీలను స్థానిక సంస్థల నెత్తిన రుద్దిందని విమర్శించారు. పింఛను, రేషన్‌కార్డు ఉన్నవారికి తీసేయడం, కావాల్సిన వారికి కుంటిసాకులు చెప్పి అందకుండా చేయడం జన్మభూమి కమిటీల పనిగా మారిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న సర్పంచుల అధికారాలను హరిస్తున్న కిరికిరి కమిటీలనే ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రికలుగా భావిస్తున్నారంటే ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల గురించి ప్రశ్నిస్తే ప్రపంచం మెచ్చే గొప్ప రాజధాని కడతానని చంద్రబాబు చెబుతుంటారని, మళ్లీ అదే నోటితో మరో 50 ఏళ్ల వరకూ నిర్మాణం పూర్తికాదనీ చెబుతారని విమర్శించారు. రాజధాని పూర్తయ్యేవరకూ పింఛను కోసం పండుటాకులు ఎదురుచూడాల్సిందేనా అని ప్రశ్నించారు. ఒక్కరికై నా హామీలు నెరవేర్చారా?... రుణాలు మాఫీ చేస్తానన్న కల్లబొల్లి మాటలతో డ్వాక్రా మహిళలను మోసం చేశారని, లక్ష రూపాయల రుణానికి రూ.30 వేల చొప్పున పెరిగిపోరుున వడ్డీ ముందు రూ.3 వేలు ఏమూలకు వస్తుందని ధర్మాన ప్రశ్నించారు. రైతులు బ్యాంకు మెట్లు ఎక్కలేని పరిస్థితి తెచ్చారని విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలని జిల్లా అంతటా నినాదాలు రారుుంచారని, ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలని నిరుద్యోగ యువత కోరుకుంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. ఐదేళ్ల పాటు విద్యుత్తు చార్జీలు పెంచని ఘనత వైఎస్‌ది అరుుతే చాపకింద నీరులా విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలను వడ్డిస్తున్న గొప్పతనం చంద్రబాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఇవేమి కేబినెట్ మీటింగ్‌లు? పజలకు మేలు చేసే ప్రతిపాదనలపై చర్చించే అవకాశం రాలేదని చెబుతున్నారని, అదే అనుయాయులకు భారీ ఎత్తున భూపందేరానికి మాత్రం నిర్ణయాలు జరిగిపోతున్నాయని... ఇవేమి కేబినెట్ మీటింగ్‌లని ధర్మాన విమర్శించారు. కేబినెట్ సమావేశాల్లో చర్చ ఉండదని, ప్రజల సంక్షేమానికి నిర్ణయాలే ఉంటాయని గుర్తు చేశారు. తప్పు చేసి గొప్పగా చెప్పుకోవడమూ చంద్రబాబుకు, టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు. డబ్బు కట్టలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు నల్లధనం విషయం పసుపు కండువాలేసి వారిని పార్టీలోకి ఆహ్వానించినప్పుడు తెలియదా? అని ధర్మాన ప్రశ్నించారు. ఇలాంటి మోసపూరిత టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మం గడ్డపై నుంచే ప్రారంభమవ్వాలని పిలుపునిచ్చారు. -
ఓటుకు కోట్లు, నయీం కేసుల్ని సీబీఐకి అప్పగించాలి
వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు, హత్యలు, అక్రమాలకు పాల్పడిన నయీం కేసు... రెండింటినీ సీబీఐ విచారణకు అప్పగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య తాజాగా ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణలు చేశారని, అలాగే క్రూరమైన దారుణాలకు పాల్పడిన నయీంను పెంచిపోషించింది చంద్రబాబేనని సర్వత్రా వినిపిస్తోందని, కీలకమైన ఈ అంశాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. బాబు ముఖ్యమైన ఈ రెండంశాలపై మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. ‘‘ఆంధ్రాప్రాంతంలోని థియేటర్లన్నింటి పైనా నయీం పట్టుందని సినీ నిర్మాత ఒకరు వెల్లడించారు. తనను నయీం బెదిరిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు వద్దకెళితే ‘అతను ప్రమాదకారి సెటిల్ చేసుకో..’ అని చెప్పారంటూ వచ్చిన వార్తలకూ సమాధానమివ్వాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి కోరారు. సింధు కష్టం చంద్రబాబు ఘనతా! సింధు కష్టపడి, తన కృషి, పట్టుదలతో ఒలింపిక్స్‌లో వెండిపతకాన్ని గెలిస్తే ఆ ఘనతను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రతి పన్నెండేళ్లకు పుష్కరాలు రావడం సర్వసాధారణమని, వాటినీ తానే తెచ్చానని సీఎం చెప్పుకోవడం వింతగా ఉందని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణా పుష్కరాల పేరిట చంద్రబాబు, ఆయన పార్టీవారు కోట్లాది రూపాయలు దోచేసుకున్నారని దుయ్యబట్టారు. -
ప్రతిపక్షం..ప్రజాపక్షం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆగస్ట్ 18న ప్రారంభమై.. శనివారం ముగిశాయి. శాసనసభ సమావేశాలు 15 రోజులుగా, 60.37 గంటల పాటు జరిగాయి. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో 117 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ప్రజాసమస్యలపై సంధించిన 117 ప్రశ్నాస్త్రాల్లో అధికశాతం విపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సంధించినవే కావడం గమనార్హం. అందులోనూ మన జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అత్యధికంగా ప్రశ్నాస్త్రాలను సంధించారు. వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాసమస్యలే ప్రశ్నాస్త్రాలుగా ప్రభుత్వా న్ని నిలదీశారు. ఎన్నికల్లో వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి.. నాలుగు గంటలు కూడా కరెంట్‌ను సరఫరా చేయకపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే అంశంపై పెద్దిరెడ్డికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జతకలిశారు. వ్యవసాయానికి కనీసం ఏడు గంటలు కూడా విద్యుత్‌ను సరఫరా చేయలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. వర్షా కాలంలోనే విద్యుత్ పరిస్థితి ఇలా ఉంటే.. వేసవిలో రైతులను మరింత ఇబ్బంది పెడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టింది. ఏడు గంటల విద్యుత్‌ను సేద్యానికి సరఫరా చేసేం దుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం నుంచి హామీని రాబట్టడంలో పెద్దిరెడ్డి, చెవిరెడ్డి సఫలమయ్యారు. చె రకు రైతులకు టన్నుకు రూ.మూడు వందల చొప్పున ప్రభుత్వం పోత్సాహకం చెల్లించకపోవడంపై శాసనసభలో చెవిరెడ్డి నిలదీశారు. జిల్లాలో శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారం, చిత్తూరు సహకార చక్కె ర కర్మారాలకు చెరుకును సరఫరా చేసిన 27 వేల మంది రైతులకు రూ.18.50 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు. ఇందు కు ఆర్థికమంత్రి సమాధానమిస్తూ బకాయిలను విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్సార్సీపీ పోరుబాట తిరుపతిలో స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి భవన వి వాదం.. జూనియర్ డాక్టర్ల ఆందోళనపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. రాయలసీమలో మెటర్నిటీ ఆస్పత్రి కోసం నిర్మించిన 300 పడకల భవనాన్ని ఆ ఆస్పత్రికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రోజా వాదనతో ఏకీభవించిన ప్రభుత్వం.. 300 పడకల భవనాన్ని మెటర్నిటీ ఆస్పత్రికే కేటాయించేందుకు అంగీకరించింది. ఎన్నికల్లో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు రూ.లక్ష వంతున కార్ఫస్ ఫండ్ ఇస్తామంటూ సీఎం చంద్రబాబు వంచిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళలను నమ్మించి నట్టేట ముంచారని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. తమ మనోభిప్రాయాలను ప్రతిబింబించేలా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా శాసనసభలో వ్యవహరించడంపై మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తల వేతనాల పెంచుతామని ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యే రోజా ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీ అమలుకు వీలుగా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై ఎమ్మెల్యే రోజా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఓటు దాటాక హామీలను తగలేస్తున్న సీఎం చంద్రబాబుపై రోజా విరుచుకుపడటం అధికార పక్షాన్ని ఇబ్బందులకు గురిచేసింది. ఆశా వర్కర్ల వేతనాలను చెల్లించకపోవడం.. వేతనాలను పెంచకపోవడంపై పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, డాక్టర్లు, మౌలిక సదుపాయాల కొరత వల్ల నిరుపేద రోగులు ఇబ్బందులు పడుతుండటాన్ని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సభలో ప్రస్తావించారు. నిరుపేద రోగులకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వ ఆస్పతుల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం తిరుమల శ్రీవారికి భక్తులు మొక్కుబడుల రూపంలో సమర్పించిన ఆస్తులు అన్యాక్రాంతమవుతుండటాన్ని సభలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డిలు ప్రస్తావించారు. టీటీడీకీ విస్తృతమైన యంత్రాంగం ఉన్నా ఆస్తులను పరిరక్షించకపోవడంలో విఫలమవడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు దేవాదాయశాఖ మంత్రి ిపీ.మాణిక్యాలరావు సమాధానం ఇస్తూ.. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతమైన విషయం వాస్తవమేనని అంగీకరించారు. అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ.. సభా సంఘం వేయాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయాల లేమి వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమానికి మంత్రి పదవిని ఇవ్వడంతో రాష్ట్రంలో విద్యారంగంలో ప్రైవేటు మాఫియా ప్రజలను దోచుకుంటోందని ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోపించారు. ప్రైవేటు మాఫియాపై చర్యలు తీసుకుని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న చెవిరెడ్డి డిమాండ్‌ను ఉపాధ్యయవర్గాలు స్వాగతిస్తున్నాయి. ఇలా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా సభలో ప్రశ్నాస్త్రాలను సంధించారు. బడ్జెట్ చర్చల్లోనూ.. స్వల్ఫకాలిక చర్చల్లోనూ.. ప్రశ్నోత్తరాల్లోనూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొన్నారు. కానీ.. జిల్లాలో ఆరు శాసనసభ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. సీఎం చంద్రబాబు, అటవీశాఖ మంత్రి బొజ్జల మినహా సభలో తక్కిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు కూడా సభలో నోరు తెరిచేందుకు కూడా సాహసించకపోవడం గమనార్హం. -
రుణమాఫీపై మహిళల రణభేరి
స్వచ్ఛందంగా రోడ్లపైకొచ్చి నిరసన ధర్నా, రాస్తారోకోతో ఉద్రిక్తత మహిళలకు వైఎస్సార్సీపీ మద్దతు మదనపల్లె: డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలంటూ మదనపల్లెలో మహిళలు రోడ్లపైకొచ్చి రణభేరి సాగిం చారు. వేలాది మంది మహిళలు పార్టీలకు, రాజకీయాలకు ఆతీతంగా స్వచ్ఛందంగా రోడ్లపైకొచ్చి సీఎం చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయం లో డ్వాక్రా మహిళలతో సమావేశం ఉందని మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో సమాచారం ఇచ్చారు. మహిళలు హాజరయ్యూరు. అరుుతే రుణాలు మాఫీ అయ్యాయని సంబరాల్లో భాగంగా వైస్ చైర్మన్ కేక్ కట్‌చేశారు. దీనిపై మహిళలు ఆగ్రహించారు. ఏం సాధించారని సంబరాలు చేస్తున్నారని నిలదీశారు. ఆ కార్యక్రమాన్ని బహిష్కరించి ఆందోళనకు దిగారు. చర్చిముందు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా స్థానిక టౌన్‌బ్యాంకు సర్కిల్లో బైఠాయిం చారు. దాదాపు గంటన్నరసేపు మహిళలు ఆందోళన నిర్వహించడంతో సీటీఎం రోడ్డు, అవెన్యూ రోడ్డులో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్ఐలు మల్లికార్జున, దస్తగిరిలు ఆందోళనకారులతో చర్చించారు. ఓ దశలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని నమ్మించి ఇప్పుడు ఒక్కో మహిళకు పదివేలు మాఫీ చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. నాలుగు నెలలుగా తామెవ్వరూ రుణాలను చెల్లించలేదని ఇప్పుడు వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు పంపిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే మహిళా లోకం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేట్టేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పునరాలోచించి రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు వైఎస్సార్సీపీ మద్దతు మహిళల ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూ ర్ణ మద్దతు ప్రకటించింది. ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, నాయకులు ఆందోళనకారులకు మద్దతు ప లికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు మొత్తం *22 వేల కోట్లు అరుుతే *7 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించడం గర్హనీయమన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాం డ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఉ ద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మస్తాన్‌రెడ్డి, నాయకులు దేశాయ్ జయదేవ్ రెడ్డి, రఫీ, హర్షవర్ధన్ రెడ్డి, కోటూరి ఈశ్వర్, పూజారి రమేష్, బాస్ నాయకులు శ్రీచందు పాల్గొన్నారు.