సాక్షి, తిరుమల/తిరుపతి సెంట్రల్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 15 నుంచి సుప్రభాతసేవ పునఃప్రారంభం కానుంది. డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభమవడంతో అప్పటినుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగుతోంది. ఈనెల 14న ధనుర్మాసం పూర్తికానున్న నేపథ్యంలో.. 15వ తేదీ నుంచి శ్రీవారికి సుప్రభాతసేవ నిర్వహిస్తారు. అదేరోజు ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగుతాయి. కాగా, ధర్మప్రచారంలో భాగంగా ఈ నెల 15వ తేది గుంటూరు జిల్లా నరసరావుపేటలో కామధేనుపూజ నిర్వహించనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. కామధేనుపూజ ఏర్పాట్లపై సోమవారం తిరుపతిలో ఆయన సమీక్షించారు.
శ్రీగిరిలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ చేశారు. పంచాహ్నిక దీక్షతో మొదలైన ఈ ఉత్సవాలు ఏడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవ క్రతువులకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం యాగశాలలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన చేసి.. ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ శాస్త్రోక్తంగా నిర్వహించారు.
చదవండి:
58 స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలు
Comments
Please login to add a commentAdd a comment