suprabhata seva
-
Tirumala: శ్రీ వేంకటేశ్వర స్వామివారి మేల్కొలుపు ఇలా...
తిరుమలలో సుప్రభాత సేవ సమయంలో భక్తుల్ని బంగారు వాకిలి ముందు నిలబెట్టి ఆ వాకిలికి తెరవేసి వుంచుతారు. ఆ సమయంలో తెర వెనుక గర్భాలయంలో ఏమి జరుగుతూ వుంటుంది, అర్చకులు ఏమి చేస్తారు..? అన్న ఉత్కంఠ భక్తులలో నెలకొంటుంది. ఇంతకీ అక్కడ ఏమి జరుగుతుందంటే..? సుప్రభాత సేవను విశ్వరూప సేవ అని కూడా అంటారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ జరగడానికి ముందు గొల్ల మిరాశిదారుడు వెళ్ళి అర్చకులను, జీయంగార్లను దివిటీల వెలుగులో ఆలయం వద్దకు తీసుకురావడం సంప్రదాయం. అదే సమయంలో ఆలయ అధికారులు కూడా వస్తారు. ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది వారి స్థానాలలో చేరిన తరువాత భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. అదే సమయంలో వేదపండితులు, అర్చకులు, జీయంగార్లు, అన్నమయ్య వారసులు బంగారు వాకిలి వద్దకు చేరుకుంటారు. అందరి సమక్షంలో గొల్ల మిరాశిదారుడు రాత్రి వేసిన సీళ్లను తొలగించి, తాళాలతో ఆలయం తలుపులు తీసి అర్చకులు, జీయంగార్లను తీసుకుని ఆలయం లోపలికి వెళ్తారు. పూర్వకాలంలో భక్తులను కూడా లోపలకి అనుమతించేవారట. అన్నమయ్య వంశస్థులు పాటలు పాడుతూ వుంటే భక్తులు నృత్యం చేసేవారు. రుత్విజులు వేదం చదువుతూ వుంటే స్వామివారికి మేల్కొలుపు జరిపేవారట. అటు తరువాత ఈ సంప్రదాయంలో మార్పు వచ్చింది. బంగారు వాకిలి తలుపులు తీసి గొల్ల మిరాశిదారుడు అర్చకులు, జీయంగార్లను లోపలికి తీసుకువెళ్లాక తలుపులు వేసేస్తారు. బంగారు వాకిలి ముందు నుంచే వేదపండితులు సుప్రభాతం పఠిస్తే, అన్నమయ్య వంశీకులు గానం చేస్తారు. ఇదే సమయంలో లోపల అర్చకులు, జీయంగార్లు గర్భాలయంలో దీపాలు సరిచేసి, కొత్తగా దీపాలు వెలిగించి స్వామివారి దోమతెరను తొలగించి ఉయ్యాలపై పవళించిన స్వామివారిని మేల్కొలిపి భోగ శ్రీనివాసమూర్తిని స్నపన మండపం నుంచి గర్భగృహంలోకి జీవస్థానానికి చేరుస్తారు. స్వామివారు పవళించిన పరుపు, మంచాలను గొల్ల బయటకు తీసుకువచ్చి సబేరా గదికి తరలిస్తారు. స్వామివారికి ఆవు పాలు, వెన్న నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతిని ఇవ్వడంతో బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. అప్పటికి సుప్రభాత పఠనం పూర్తవుతుంది. ఆ సమయంలో జరిగేవి రెండు సేవలు. ఒకటి మేలుకొలుపు సేవ అయితే, రెండవది భక్తులకు స్వామివారి విశ్వరూప దర్శనం. (క్లిక్ చేయండి: ఆనంద నిలయ విమాన విశిష్టత) -
15 నుంచి సుప్రభాతసేవ పునఃప్రారంభం
సాక్షి, తిరుమల/తిరుపతి సెంట్రల్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 15 నుంచి సుప్రభాతసేవ పునఃప్రారంభం కానుంది. డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభమవడంతో అప్పటినుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగుతోంది. ఈనెల 14న ధనుర్మాసం పూర్తికానున్న నేపథ్యంలో.. 15వ తేదీ నుంచి శ్రీవారికి సుప్రభాతసేవ నిర్వహిస్తారు. అదేరోజు ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగుతాయి. కాగా, ధర్మప్రచారంలో భాగంగా ఈ నెల 15వ తేది గుంటూరు జిల్లా నరసరావుపేటలో కామధేనుపూజ నిర్వహించనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. కామధేనుపూజ ఏర్పాట్లపై సోమవారం తిరుపతిలో ఆయన సమీక్షించారు. శ్రీగిరిలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ చేశారు. పంచాహ్నిక దీక్షతో మొదలైన ఈ ఉత్సవాలు ఏడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవ క్రతువులకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం యాగశాలలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన చేసి.. ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. చదవండి: 58 స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలు తిరుమలలో సినీ ప్రముఖులు -
శ్రీవారిసేవలో శ్రీలంక అధ్యక్షుడు
-
నేటి నుంచి శ్రీవారికి సుప్రభాతం
-
శ్రీవారి సుప్రభాత సేవ పునఃప్రారంభం
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ టికెట్లను బుధవారం మంజూరుచేశారు. ధనుర్మాసం బుధవారం సాయంత్రం పూర్తి కావడంతో గురువారం వేకువజామున ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది. బుధవారం ఉదయం విజయ బ్యాంక్లో కరెంట్ బుకింగ్ ద్వారా 75 టికెట్లను విక్రయించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి బుధవారం 6 గంటల సమయం పడుతోంది. సంక్రాంతి పండుగ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం వేకువజాము నుండి సాయంత్రం 6 గంటల వరకు 36,282 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 12 కంపార్ట్మెంట్లలో సర్వదర్శనం భక్తులు వేచి ఉన్నారు. కాగా కాలినడకన తిరుమలకు వచ్చిన భక్తులు 4 కంపార్ట్మెంట్లలో ఉన్నారు. వీరికి 3 గంటల దర్శనం సమయం పడుతోంది. గదులు సులభంగానే లభిస్తున్నాయి. -
సుప్రభాత సేవ పునఃప్రారంభం
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ నేటి నుండి పునఃప్రారంభమైంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గత ఏడాది 17 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను రద్దుచేసి ఆ స్థానంలో తిరుప్పావై దివ్య ప్రబంధ పారాయణ చేపట్టిన విషయం విదితమే. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు ధనుర్మాస కాలం ముగియడంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి స్వామివారికి సుప్రభాత సేవను ప్రారంభించారు. కాగా నేడు తిరుమలలో శ్రీవారికి నాలుగు సేవలు జరుగనున్నాయి. గోదా పరిణయోత్సవం, పార్వేటి ఉత్సవం, ప్రణయ కలహోత్సవం, రామకృష్ణ తీర్థముక్కోటిని టీటీడీ నిర్వహించనుంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు శ్రీవారి ఆలయంలో నిర్వహించే సుప్రభాతం మినహా మిగతా ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహశ్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవలు రద్దయ్యాయి. నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతి రోజు పండుగ వాతావరణమే. అటువంటిది ఒకే రోజు నాలుగు ఉత్సవాలు గురువారం నాడే రావడంతో శ్రీవారి భక్తులు ఆనందంతో పొంగిపోతున్నారు.