తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ నేటి నుండి పునఃప్రారంభమైంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గత ఏడాది 17 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను రద్దుచేసి ఆ స్థానంలో తిరుప్పావై దివ్య ప్రబంధ పారాయణ చేపట్టిన విషయం విదితమే. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు ధనుర్మాస కాలం ముగియడంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి స్వామివారికి సుప్రభాత సేవను ప్రారంభించారు.
కాగా నేడు తిరుమలలో శ్రీవారికి నాలుగు సేవలు జరుగనున్నాయి. గోదా పరిణయోత్సవం, పార్వేటి ఉత్సవం, ప్రణయ కలహోత్సవం, రామకృష్ణ తీర్థముక్కోటిని టీటీడీ నిర్వహించనుంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు శ్రీవారి ఆలయంలో నిర్వహించే సుప్రభాతం మినహా మిగతా ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహశ్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవలు రద్దయ్యాయి. నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతి రోజు పండుగ వాతావరణమే. అటువంటిది ఒకే రోజు నాలుగు ఉత్సవాలు గురువారం నాడే రావడంతో శ్రీవారి భక్తులు ఆనందంతో పొంగిపోతున్నారు.
సుప్రభాత సేవ పునఃప్రారంభం
Published Thu, Jan 16 2014 8:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement