తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఐదవ రోజు శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు మోహినీ రూపంలో భక్తులకు సాక్షాత్కరించనున్నారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారు గరుడ వాహనంపై ఊరేగనున్నారు. పట్టు పీతాంబరాలు ధరించిన మలయప్ప స్వామి ఈరోజు విశేష ఆభరణాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం, కాలి నడక భక్తులకు 10గంటల సమయం పడుతోంది.